రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌ను ఎవరూ ఏమీ చేయలేరు, జ్యుడీషియరీ, చంద్రబాబు కూడా, వైసీపీ ఎమ్మెల్సీ హాట్ కామెంట్స్..

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని మాటున అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. రాజధాని వికేంద్రీకరణ చుట్టూ రాజకీయాలు జరుగుతోన్నాయి. ఇటీవలే ఎమ్మెల్సీ అయిన వైసీపీ నేత పండుల రవీంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. విపక్ష నేత చంద్రబాబు నాయుడు, జ్యుడీషియరీపై కూడా వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తమ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరు తన స్వామి భక్తిని ప్రదర్శించారు. పండుల రవీంద్రబాబు వ్యాఖ్యలు రాజకీయంగా పెనుదుమారం రేపే అవకాశాలు ఉన్నాయి.

వాలంటీర్ల ముసుగులో మైనర్లపై లైంగికదాడులా..? మృగాళ్లపై చర్యలేవీ..? జగన్‌ సర్కార్‌పై లోకేశ్ ఫైర్..వాలంటీర్ల ముసుగులో మైనర్లపై లైంగికదాడులా..? మృగాళ్లపై చర్యలేవీ..? జగన్‌ సర్కార్‌పై లోకేశ్ ఫైర్..

 జగన్‌ను ఏమీ చేయలేరు..

జగన్‌ను ఏమీ చేయలేరు..

వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలుపగా.. వైసీపీ శ్రేణులు ఆనందోత్సాహం జరుపుకుంటున్నాయి. ఈ క్రమంలో స్టేటస్ కో విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేయడంతో టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాం వచ్చింది. దీంతో ఆ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒకడుగు ముందేసిన పండుల.. చంద్రబాబు నాయుడు, కోర్టులు కూడా జగన్‌ను ఏమీ చేయలేరని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం గుడ్డివాని చింతలో గవర్నర్ ఆమోదాన్ని స్వాగతిస్తూ సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇటీవేల ఎమ్మెల్సీగా ఎన్నికైన పండుల మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

రాజధాని రైతుల శాపం వల్లే

రాజధాని రైతుల శాపం వల్లే

రాజధాని రైతుల శాపం వల్లే చంద్రబాబు నాయుడిని పరాజయం పాలు చేసిందని పండుల ధ్వజమెత్తారు. అంతేకాదు రైతులకు అన్యాయం జరిగిందని ఆందోళన చేస్తున్న వారంతా రైతులు కాదు అని.. వారి ముసుగులో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు అని రవీంద్ర ఆరోపించారు. వారి కోసమే చంద్రబాబు నాయుడు తెగ ఆరాటపడుతున్నారని మండిపడ్డారు. అంతే తప్ప ప్రజలపై, రాజధాని రైతులపై ఆయనకు ప్రేమ లేదని చెప్పారు.

విజయమ్మ పోటీ చేసి ఓడిపోయారు..

విజయమ్మ పోటీ చేసి ఓడిపోయారు..

రాష్ట్రంలో మూడు రాజధానుల ప్రకటించడంలో ఎలాంటి స్వార్థం లేదని పండుల స్పష్టంచేశారు. ఇదివరకు ఇక్కడ నుంచి విజయలక్ష్మీ పోటీచేసి ఓడిపోయారని గుర్తుచేశారు. విశాఖ నుంచి ముగ్గురు టీడీపీ సభ్యులు ఎమ్మెల్యేలుగా గెలిచారని చెప్పారు. అలాంటి నగరంలో రాజధాని ప్రకటించడంలో రాజకీయ స్వార్థం ఎక్కడ ఉంది అని ప్రశ్నించారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ప్రతీది రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. తన రాజకీయాల కోసం రైతులను పావులాగా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు.

Recommended Video

Andhra Pradesh Corona Virus Update || Oneindia Telugu
 కడపనో.. పులివెందులనో చేసేవారు కదా..?

కడపనో.. పులివెందులనో చేసేవారు కదా..?


సీఎం జగన్ స్వార్థంగా ఆలోచిస్తే విశాఖ రాజధానిగా ప్రకటించేవారు కాదని పండుల తెలిపారు. తన సొంత జిల్లా కడపను ప్రకటించేవారు అని పేర్కొన్నారు. లేదంటే తన నియోజకవర్గం పులివెందులను చేసేవారు అని చెప్పారు. ప్రజల కోసం.. రాష్ట్రంలోని అన్నీ ప్రాంతాలు సమంగా అభివృద్ది చెందాలని ఆయన భావిస్తున్నారని తెలిపారు. అందుకోసమే మూడు రాజధానులను ప్రకటించారని గుర్తుచేశారు.

English summary
no one can not do anything cm jagan mohan reddy. chandra babu naidu, courts also ycp mlc pandula ravindra babu comment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X