• search
 • Live TV
రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జ‌గ‌న్ కు ప‌వ‌న్ హెచ్చ‌రిక : దారుణ‌మైన వాస్త‌వాలు బ‌య‌ట పెడ‌తా ....!!

|
  జగన్ ను హెచ్చరించిన పవన్...! | Oneindia Telugu

  జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ కొద్ది రోజులుగా త‌న ప్ర‌సంగాల తీరును మార్చేసారు. చంద్ర‌బాబు - లోకేష్ పైనే ఎక్కువ‌గా గురి పెట్టిన‌ట్లు క‌నిపించిన ప‌వ‌న్‌..తాజాగా జ‌గ‌న్ ను సైతం ల‌క్ష్యంగా చేసుకుంటున్నారు. చంద్ర‌బాబు కు సెల‌విద్దాం.. జ‌గ‌న్ ను ప‌క్క‌న పెడ‌దాం అనే నినాదంతో ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నారు. తాజాగా రాహుల్ గాంధీ గురించి ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో చ‌ర్చ‌కు కార‌ణ‌మ‌య్యాయి. ఇక‌..ప‌వ‌న్ త‌న వ్య‌క్తిగ‌త జీవితం గురించి మాట్లాడిన విష‌యాన్ని ప‌వ‌న్ ప్ర‌తీ సందర్భంలోనూ ప్ర‌స్తావిస్తున్నారు. జ‌గ‌న్ గురించి మాట్లాడాల్సి వ‌స్తే దారుణ‌మైన వాస్త‌వాలు బ‌య‌ట పెట్టాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించారు. జ‌గ‌న్ లా వెన‌క్కి త‌గ్గే వాడిని కాద‌ని చెప్పుకొస్తున్నారు...

  జ‌గ‌న్ స‌మ‌ర్ధ‌త పై ప‌వ‌న్ విమ‌ర్శ‌ల‌: ప‌రోక్ష హెచ్చ‌రిక‌లు..

  జ‌గ‌న్ స‌మ‌ర్ధ‌త పై ప‌వ‌న్ విమ‌ర్శ‌ల‌: ప‌రోక్ష హెచ్చ‌రిక‌లు..

  ప‌వ‌న్ క‌ళ్యాన్ ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా జ‌గ‌న్ ను ల‌క్ష్యంగా చేసుకొని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. జ‌గ‌న్ లాగా త‌న‌కు వేల కోట్ల ఆస్తులు లేవంటూనే..జ‌గ‌న్ అసెంబ్లీ గైర్హాజ‌రీ నిర్ణ‌యాన్ని త‌ప్పు బ‌డుతున్నారు. ఎమ్మెల్యేలను కాపాడుకోలేక‌పోతున్న జ‌గ‌న్‌..అసెంబ్లీకి వెళ్ల‌టం లేద‌ని విమ‌ర్శిస్తున్నారు. త‌న‌కే ఇలాంటి ప‌రిస్థితి ఎదురైతే..ఎమ్మెల్యేలు అంద‌రూ వెళ్లిపోయినా తాను ఒక్క‌డినే అసెంబ్లీకి వెళ్లి..ప్ర‌భుత్వ అవినీతిని ప్ర‌శ్నించేవాడిన‌ని చెబుతున్నారు. ఇక‌, తాజాగా..జ‌గ‌న్ కు ప‌వ‌న్ ప‌రోక్ష హెచ్చిరిక చేసారు. జ‌గ‌న్ త‌న వ్య‌క్తిగ‌త జీవితం గురించి మాట్లాడుతున్నార‌ని..త‌న జీవితం అంద‌రికంటే చాలా బెట‌ర్ అని చెబ‌తూ..తాను జ‌గ‌న్ వ్య‌క్తిగ‌త జీవితం గురించి మాట్లాడాల్సి వ‌స్తే..దారుణ‌మైన వాస్తవాలు బ‌య‌ట పెడ‌తాన‌ని హెచ్చ‌రించారు. మూడు పెళ్లిళ్లు చేసుకోవ‌టం వ‌ల‌నే త‌న జీవితం రోడ్డున ప‌డింద‌ని వ్యాఖ్యానించారు. జ‌గ‌న్ ను ప‌క్క‌న పెడ‌దామ‌ని..వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ను సీయంను చేద్దామంటూ పిలుపునిచ్చారు.

  చంద్ర‌బాబు - లోకేష్ పై అవినీతి ఆరోప‌ణ‌లు..

  చంద్ర‌బాబు - లోకేష్ పై అవినీతి ఆరోప‌ణ‌లు..

  గ‌త మ‌ర్చి లో ప్రారంభించిన వ‌ప‌న్ ..చంద్ర‌బాబు - లోకేష్ ల‌క్ష్యంగా అవినీతి ఆరోప‌ణ‌లు కొన‌సాగిస్తున్నారు. పంచాయి తీ ప్రెసిడెంట్ కూడా కాలేని లోకేష్ పంచాయితీ రాజ్ శాఖా మంత్రిగా ప‌ని చేస్తున్నార‌ని దుయ్య బ‌ట్టారు. ఆయ‌న పేరి ట లంక‌ల గ‌న్న‌వ‌రం లో ఒక ప్ర‌త్యేక ర్యాంపే ఉంద‌ని.. అడ్డ‌గోలుగా ఇసుక దోచుకుంటున్నార‌ని..పంచ‌భూతాల‌ను సైతం దోచుకొనే చ‌రిత్ర లోకేశ్ దే అంటూ ఫైర్ అయ్యారు. చంద్ర‌బాబు వ‌య‌సు గురించి ప‌వ‌న్ ప్ర‌స్తావిస్తున్నారు. చంద్ర‌బాబు కు సెల‌విద్దాం అని పిలుపు నిచ్చారు ప‌వ‌న్‌. ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో సుదీర్ఘంగా ప‌ర్య‌టిస్తున్న ప‌వ‌న్ అక్క‌డి ప‌రిస్థితుల‌ను పూర్తిగా అన‌కు అనుకూలంగా మల‌చుకొనేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. గ‌తం కంటే భిన్నంగా ప్ర‌సంగాలు చేస్తూ..త‌న‌ను ముఖ్య‌మంత్రిని చేయాల‌ని కోరుతున్నారు.

  రాహుల్ - అంబానీల పైనా విసుర్లు..

  రాహుల్ - అంబానీల పైనా విసుర్లు..

  జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌.. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పైనా విమ‌ర్శ‌లు చేసారు. రాహుల్ గాంధీ బ్ర‌హ్మ‌చారి అని చెబుతార‌ని..ఆయ‌న బ్ర‌హ్మ‌చారో కాదో మ‌న‌కు తెలియ‌ద‌ని వ్యాఖ్యానించారు. ఇక‌, కోన‌సీమ లో చ‌మురు, స‌హ‌జ వాయు వుల ద్వారా వ‌చ్చే వేల కోట్ల‌ను రిల‌య‌న్స్‌, గెయిల్ వంటి సంస్థ‌లు దోచుకుపోయి న‌ష్టాన్ని క‌లిగిస్తున్నాయ‌ని ప‌వ‌న్ ఫైర్ అయ్యారు. రిల‌య‌న్స్ సంస్థ అధినేత అంబానీకి స‌తైం ఎదురొడ్డి పోరాడ‌గ‌లిగే శ‌క్తి ప‌వ‌న్ ఒక్క‌డికే ఉంద‌న్నారు.

  ప్ర‌తీ రోజు ఇలా జ‌గ‌న్ ను టార్గెట్ చేస్తూ ప‌వ‌న్ మాట్లాడ‌తున్న తీరు...చేస్తున్న విమ‌ర్శ‌ల పై వైసిపి నేత‌లు ప్ర‌తివిమ‌ర్శ ల‌కు దిగుతున్నారు. రానున్న రోజుల్లో ప‌వ‌న్ వ‌ర్సెస్ జ‌గ‌న్ రాజ‌కీయాలు మ‌రింత వేడెక్కే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

  English summary
  Janasena Chief pawan Kalyan warned YCP chief Jagan in directly. If jagan comment on Pawan personal life...he also revile Jagan Personal life details in public. Now..Pawan comments on Jagan became hot topic in political circles.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X