రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాకినాడలో ఉద్రిక్తత: నానాజీ ఇంటికి పవన్ కళ్యాణ్, బాధితులకు పరామర్శ

|
Google Oneindia TeluguNews

తూర్పుగోదావరి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం మధ్యాహ్నం కాకినాడ చేరుకున్నారు. దీంతో భారీ ఎత్తున జనసేన పార్టీ నాయకులు, కార్యర్తలు కాకినాడకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

చంద్రబాబు తప్పు చేశారు: మోడీ, బాబు, పవన్ మళ్లీ కలుస్తారంటూ రాయపాటి సంచలన వ్యాఖ్యలుచంద్రబాబు తప్పు చేశారు: మోడీ, బాబు, పవన్ మళ్లీ కలుస్తారంటూ రాయపాటి సంచలన వ్యాఖ్యలు

గాయపడిన కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ పరామర్శ

గాయపడిన కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ పరామర్శ

కాగా, పవన్ కళ్యాణ్ కాకినాడ నగరంలోని గుడారిగంటలో జనసేన స్థానిక నేత పంతం నానాజీ ఇంటికి వెళ్లారు. ఆదివారం జరిగిన దాడిలో గాయపడిన జనసేన కార్యకర్తలను నానాజీ నివాసంలో పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఘటన జరిగిన తీరును పవన్ కళ్యాణ్‌కు జసేన నేతలు, కార్యకర్తలు వివరించారు.

144 సెక్షన్.. భారీగా మోహరించిన పోలీసులు

144 సెక్షన్.. భారీగా మోహరించిన పోలీసులు


పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో కాకినాడ నగరంలో 144 సెక్షన్ తోపాటు పోలీస్ యాక్ట్ 30 అమలు చేస్తున్నారు. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నివాసం వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. అటు వైపు వెళ్లే వాహనలను తనిఖీ చేసి పంపిస్తున్నారు.

జనసేన వాహనాలను అడ్డుకున్న పోలీసులు..

జనసేన వాహనాలను అడ్డుకున్న పోలీసులు..

ఆదివారం జరిగిన దాడి పరిణామాలపై పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ చర్చించారు. కాగా, అంతకుముందు వపన్ కళ్యాణ్ విశాఖపట్నం విమానాశ్రయం నుంచి కాకినాడకు కాన్వాయ్‌లో వచ్చారు. అయితే, పవన్ కాన్వాయ్ వెంటే వచ్చిన జనసేన నేతల వాహనాలను పోలీసులు మార్గమధ్యలోనే ఆపి వెనక్కి పంపించారు పోలీసులు. తుని, ప్రత్తిపాడు వద్ద నుంచి వాహనాలను అడ్డుకుని పంపించారు.

పోలీసుల లాఠీఛార్జీతో తీవ్రంగా గాయపడ్డ జనసైనికులు

పోలీసుల లాఠీఛార్జీతో తీవ్రంగా గాయపడ్డ జనసైనికులు

కాగా, ద్వారంపూడి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ఇటీవల నిర్వహించిన ర్యాలీలో మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో జనసేన కార్యకర్తలు ద్వారంపూడి నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు, వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. భారీ ఎత్తున జనసేన కార్యకర్తలు రావడంతో పోలీసులు వారిపై లాఠీఛార్జీ చేశారు. దీంతో పలువురు జనసేన కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమయంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్.. తాను నేరుగా కాకినాడకే వస్తానంటూ ఎమ్మెల్యేను హెచ్చరించారు. చెప్పినట్లుగానే ఆయన ఢిల్లీ పర్యటన నుంచి కాకినాడకు చేరుకున్నారు.

English summary
Janasena president pawan kalyan meets janasena leaders in Kakinada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X