రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరద ఉధృతిలోనూ నో బ్రేక్: ఏపీ జీవనాడి నిర్మాణ పనులు చకచకా: జగన్ లక్ష్యాన్ని అందుకునేలా

|
Google Oneindia TeluguNews

రాజమండ్రి: ఏపీ జీవనాడిగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టు పనులు వరద ఉధృతిలోనూ కొనసాగుతున్నాయి. సుమారు వారం రోజుల పాటు నిలిపివేసిన నిర్మాణ పనులు పునః ప్రారంభం అయ్యాయి. గోదావరి వరద పోటెత్తుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాణ పనులకు కార్మికులు పూనుకుంటున్నారు. పోలవరం స్పిల్ వే కాంక్రీట్, బ్రిడ్జి నిర్మాణ పనులను నిలిపివేసినప్పటికీ.. దానికి ప్రత్యామ్నాయంగా గడ్డర్ల నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు.

ఏపీ, తెలంగాణ సహా ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల గోదావరి నదీ ఉగ్రరూపాన్ని దాల్చింది. పరీవాహక ప్రాంతాలను ముంచెత్తుతోంది. గోదావరి వరదలు పెను నష్టాన్ని మిగిల్చాయి. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు ఏపీ పరీవాహక ప్రాంతాల్లోని పలు గ్రామాలు మునకేశాయి. 200లకు పైగా లంక గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 30కి పైగా మండలాలు వరద తాకిడికి గురయ్యాయి. 25 వేల మంది వరకు నిరాశ్రయులయ్యారు.

Polavaram Project works continues amid floods in Andhar Pradesh

పోలవరం ముంపు మండలాలు, కోనసీమ లంకల్లో ఈసారి గోదావరి వరద ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది. వారంరోజులుగా కొన్ని గ్రామాలు నీటిలో నానుతున్నాయి. దేవీపట్నం మండలంలోని పలు గ్రామాల్లో ఇదే దుస్థితి కనిపిస్తోంది. గోదావరికి సంభవించిన వరద ప్రభావం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై పడ్డాయి. కాఫర్ డ్యామ్ వద్ద వరద ప్రవాహం గరిష్ఠంగా 30 మీటర్లను తాకింది. ఆ తరువాత తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ.. వరద పోటు ఇంకా పూర్తిగా తగ్గలేదు.

Polavaram Project works continues amid floods in Andhar Pradesh

స్పిల్ వే, స్పిల్ ఛానల్ వరద ముంపులోనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కూడా కార్మికులు పోలవరం నిర్మాణ పనులను పునఃప్రారంభించారు. ప్రస్తుతం దాని నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వర్షం పెద్దగా పడకపోవడం వల్ల నిర్మాణ పనుల్లో ఆటంకం ఏర్పడట్లేదు. పోలవరం నిర్మాణ పనులను వచ్చే రెండేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకోవడంతో నిర్మాణ పనులను నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు.

Polavaram Project works continues amid floods in Andhar Pradesh

ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద నీరు ఉధృతి స్వల్పంగా తగ్గుముఖం పడుతోంది. బ్యారేజ్ వద్ద వరద 16 అడుగులకు తగ్గింది.
గోదావరి వరద తగ్గుముఖం పట్టడంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మూడో ప్రమాద హెచ్చరికను తొలగించారు. ప్రస్తుతం అధికారులు బ్యారేజ్‌ గేట్లు ఎత్తి 18 లక్షల 99వేల క్యూసెక్కల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.ఇప్పటికే వరద నీటిలోనే 27 లంక గ్రామాలు మగ్గుతున్నాయి.

English summary
Floods claimed four lives in Andhra Pradesh as the flow in the Godavari has again intensified on Friday, pushing the level closer to the third danger mark at Sir Arthur Cotton Barrage in East Godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X