రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అప్పుడే మొదలైన పందేలు.. తూ.గో జిల్లాలో స్థావరంపై దాడి, 19 మంది అరెస్ట్.. బైక్స్ స్వాధీనం..

|
Google Oneindia TeluguNews

సంక్రాంతి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్‌లో సందడే సందడి. గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంటుంది. పిల్లల ఆటపాటలు బిజీగా ఉండగా.. మహిళలు పిండి వంటలు చేస్తూ సందడిగా కనిపిస్తారు. ఇక మగాళ్ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎక్కడ కోడి పందేలు ఉంటే అక్కడ వాలుతారు. పందేం కాస్తూ.. తీరికలేకుండా గడుపుతారు. వాస్తవానికి కోడి పందాలపై గతంలో హైకోర్టు నిషేధం విధించినా.. అక్కడి స్థానిక పరిస్థితుల దృష్ట్యా కోడికి కత్తి కట్టకుండా చూడాలని కోరింది. న్యూ ఇయర్ సందర్భంగా.. 1వ తేదీ నుంచి పందాలలో తీరికలేకుండా ఉంటారు.

తూర్పుగోదావరి జిల్లా చింతలపూడి మండలం మేడిశెట్టి వారిపాలెంలో కోడి పందాలు నిర్వహిస్తున్నారని తెలిసింది. పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు. 19 మందిని అదుపులోకి తీసుకుని 5 బైక్‌లు, 5 కోడిపుంజులను స్వాధీనం చేసుకున్నారు. అడపాదడపా ఇక్కడ కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలకు చెందిన వారు ఇక్కడికి వచ్చి కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కోడి పందాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

police raid on hens base at eg district..

సంక్రాంతికి వారం రోజుల ముందు నుంచే సందడి నెలకొంటుంది. కానీ 15 రోజుల నుంచి కూడా ఒక్కటే సందడి ఉంది. ఇప్పుడే కాదు రెగ్యులర్‌గా ఇక్కడ పందాలు నిర్వహిస్తారని తెలుస్తోంది. ఆ సమాచారంతోనే దాడి చేసినట్టు తెలిసింది. ఇక ఇప్పటినుంచి జోరుగా పందాలు నిర్వహణ కొనసాగుతోంది.

English summary
police raid on hens base at east godavari district. 19 people arrested and 5 bykes are seized.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X