• search
 • Live TV
రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

టీడీపీతో బీజేపీ-జనసేన ఫెవికాల్ బంధం? ప్రశ్నిస్తానన్న పవన్ ఎక్కడ?: మౌనం వెనుక ఆంతర్యం?

|

అమరావతి: రాష్ట్రంలో పెను రాజకీయ దుమారానికి దారి తీసిన దేవాలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంస ఘటనల్లో ఎవరి ప్రమేయం ఉందనేది క్రమంగా స్పష్టమౌతోంది. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోన్న కొద్దీ.. అసలు నిందితులెవరనేది వెలుగులోకి వస్తోంది. రాజకీయ కారణాలతోనే విగ్రహాల విధ్వంసకాండ సాగిందనేది తేలిపోయింది. అవన్నీ- తమ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి రాజకీయ ప్రత్యర్థులు కృత్రిమంగా సృష్టించారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇదివరకు చేసిన ఆరోపణలన్నీ వాస్తవ రూసాన్ని దాల్చుతున్నట్లు కనిపిస్తోంది.

పంచాయతీ ఎన్నికల కోసం పవన్ కల్యాణ్ పక్కా స్కెచ్: సొంత కులం ఓటుబ్యాంకుపై ఫోకస్: త్వరలో భేటీపంచాయతీ ఎన్నికల కోసం పవన్ కల్యాణ్ పక్కా స్కెచ్: సొంత కులం ఓటుబ్యాంకుపై ఫోకస్: త్వరలో భేటీ

టీడీపీ నేతల అరెస్టుపై..

టీడీపీ నేతల అరెస్టుపై..

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సంకటహర వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వరుడి విగ్రహాన్ని సాక్షాత్తూ ఆ ఆలయ పూజారే ధ్వంసం చేశారనే వాస్తవం.. పోలీసుల దర్యాప్తులో బయటకి వచ్చింది. ఆలయ పూజారి వెంకట మురళీకృష్ణ తన నేరాన్ని కూడా అంగీకరించారని పోలీసులు స్పష్టం చేశారు. రాజమహేంద్రవరానికే చెందిన ఇద్దరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనకు 30 వేల రూపాయలు ఇచ్చి.. మరీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహాన్ని ధ్వంసం చేయించినట్లు సిట్ వెల్లడించింది.

 ఫెవికాల్ బంధం..

ఫెవికాల్ బంధం..

టీడీపీ నేతలు మల్ల వెంకటరాజు, దంతులూరి వెంకటపతి రాజును అరెస్ట్ చేశారు. మరింత లోతుగా దర్యాప్తు సాగాల్సి ఉందంటూ సిట్ చేసిన ప్రకటన స్థానికంగా కలకలం రేపుతోంది. విగ్రహాల విధ్వంసం ఘటనలో తెలుగుదేశం పార్టీ నేతల ప్రమేయం ఉన్నట్లు తేలినప్పటికీ.. బీజేపీ-జనసేన కూటమి నేతలు మౌనం దాల్చడం వెనుక అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. బీజేపీ-జనసేన కూటమి నేతలు.. తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షంగా ఉంటున్నాయనే ఆరోపణలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఆయా పార్టీల మధ్య ఫెవికాల్ బంధం ఉందంటూ నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.

వైసీపీ నేతలు ఏం చెబుతున్నారు?

వైసీపీ నేతలు ఏం చెబుతున్నారు?

విగ్రహాల విధ్వంస ఘటనపై టీడీపీ నేతల ప్రమేయం ఉందంటూ తాము మొదటి నుంచీ చెబుతూనే ఉన్నామని, తమ వాదనలు, ఆరోపణలు నిజం అయ్యాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. దొంగే పోలీసును దొంగ అన్నట్లుంది చంద్రబాబు వ్యవహారమంటూ వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.. దేవుడి విగ్రహం ధ్వంసం చేసిన నిందితులకు టీడీపీ నేతలు 30 వేలు చెల్లించినట్లు విచారణలో బయటపడిందని,. దేవాలయాల విధ్వంసం వెనుక టీడీపీ కుట్ర క్రమంగా బట్టబయలు అవుతోందని అన్నారు.. అందుకే పచ్చ గ్యాంగ్ లీడర్ సైలెంట్ అయ్యారని చంద్రబాబును ఉద్దేశించి చురకలు అంటించారు.

బాత్‌ టబ్‌లో యువ హీరోయిన్ ప్రియా బెనర్జీ హాట్ ఫోటోషూట్..

  Rajahmundry లో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం!!
  మౌనం వెనుక ఆంతర్యమేంటీ?

  మౌనం వెనుక ఆంతర్యమేంటీ?

  ఈ అరెస్టుపై బీజేపీ-జనసేన కూటమి నేతలు తేలుకుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. వారందరూ ఒకే తాను ముక్కలేనంటూ వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయాలు చేయడానికి మాత్రమే వారు హిందు మతాన్ని అడ్డుగా పెట్టుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. నిజంగా హిందుత్వం పట్ల ప్రేమ ఉంటే.. తెలుగుదేశం పార్టీని ఎందుకు నిలదీయట్లేదని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ-జనసేన నేతలు సోము వీర్రాజు, పవన్ కల్యాణ్ ఇప్పుడెందుకు రోడ్డెక్కి ధర్నాలు చేయట్లేదని అన్నారు. ఇది వారి మధ్య ఉన్న అనుబంధానికి నిదర్శనమని అంటున్నారు.

  English summary
  Rajahmundry Idol desecration Row:Why is BJP-Janasena not questioning TDP, Netizens troll two parties after Police arrests two of Telugu Desam Party leaders and temple priest.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X