రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజమండ్రి స్వధార్ లో కీచక వాచ్ మెన్ .. మహిళలపై అత్యాచారం .. ఆపై వ్యభిచారం

|
Google Oneindia TeluguNews

ఏపీలో నిరాశ్రయులైన మహిళల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ వసతి గృహం స్వధార్ లో మహిళల లైంగిక వేధింపుల ఘటన వెలుగు చూసింది. సమాజంలో దగా పడి, వివిధ సందర్భాల్లో వివక్షకు గురైన , నిరాశ్రయులైన మహిళలు ఉండే స్వధార్ హోం లో జరుగుతున్న అకృత్యాలు వెలుగులోకి రావటంతో ఏపీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇక దీనిపై ప్రతిపక్షాలు ఇప్పటికే సదరు కీచక వాచ్ మెన్ , వార్డెన్ లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు . ఇక ప్రభుత్వం సైతం ఈ ఘటనపై సీరియస్ గా ఉందని మంత్రులు చెప్తున్నారు.

కామంతో సోదరిపై అత్యాచారం చేసిన సోదరుడు: ఫోక్సో చట్టం క్రింద కేసు నమోదుకామంతో సోదరిపై అత్యాచారం చేసిన సోదరుడు: ఫోక్సో చట్టం క్రింద కేసు నమోదు

 బొమ్మూరు ప్రభుత్వ వసతి గృహం స్వధార్ హోమ్ లో దారుణం

బొమ్మూరు ప్రభుత్వ వసతి గృహం స్వధార్ హోమ్ లో దారుణం

కష్టాల్లో ఉన్న మహిళల కోసం ఏర్పాటు చేసిన ఈ వసతి గృహాలు బాధిత మహిళలకు ఆర్థికపరమైన భద్రత, వసతి అందించేందుకు పని చెయ్యాలి. వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించాలి . వారు తమ కాళ్ళ మీద తాము నిలబడేలా చొరవ చూపాలి . కానీ ఈ వసతి గృహాలలో ఉన్న మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన రాజమండ్రి వసతి గృహంలో ఘటన రాష్ట్ర వ్యాప్తంగా స్వధార్ హోమ్స్ నిర్వహణ ఎలా ఉంది అన్న అనుమానం కలిగిస్తుంది.

కీచక వాచ్ మెన్ .. నలుగురు మహిళలపై అత్యాచారం .. ఆపై వ్యభిచారానికి ఒత్తిడి

కీచక వాచ్ మెన్ .. నలుగురు మహిళలపై అత్యాచారం .. ఆపై వ్యభిచారానికి ఒత్తిడి

రాజమండ్రి సమీపంలోని బొమ్మూరు స్వాధార్ స్వధార్ వసతి గృహంలో మహిళలను జాగ్రత్తగా చూసుకుంటూ వారికి కాపలాగా ఉండాల్సిన వాచ్ మెన్ కామాంధుడిగా మారి వారి జీవితాలను చిద్రం చేస్తున్నాడు . లాక్ డౌన్ సమయంలో నలుగురి మహిళలపై కన్నేసి వారికి మాయమాటలు చెప్పి లోబరుచుకున్న సదరు ఘనుడు నలుగురు మహిళలను శారీరకంగా వాడుకున్నతరువాత వారిని వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేశారు. ఇక వాచ్ మెన్ వేధింపులు భరించలేక తమకు జరిగిన అన్యాయం గురించి వార్డెన్ అరుణకు చెప్పుకున్నారు సదరు మహిళలు. ఆమె కూడా వాచ్ మెన్ కు సపోర్ట్ చేసి మాట్లాడటంతో దిక్కు తోచని స్థితిలో పడ్డారు .

వాచ్ మెన్ అరెస్ట్ .. బొమ్మూరు ఘటనపై టీడీపీ ఫైర్

వాచ్ మెన్ అరెస్ట్ .. బొమ్మూరు ఘటనపై టీడీపీ ఫైర్


ఇక ఇదే సమయంలో వార్డెన్ అరుణ లీవ్ మీద వెళ్లగా ఆమె స్థానంలో ఇందిర అనే వార్డెన్ రాగా అందులో ఉండే మహిళలు ఆమెకు తమ గోడు చెప్పుకున్నారు. వెంటనే ఇందిరా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో వాచ్ మెన్ పై కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఇక బాధిత మహిళలను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు . బొమ్మూరు మహిళా ప్రాంగణంలోని స్వధార్ హోమ్‌లో బాధిత యువతులపై జరిగిన దారుణాన్ని తీవ్రంగా యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడిన వార్డెన్, వాచ్‌మెన్‌లను కఠినంగా శిక్షించాలని టీడీపీ డిమాండ్ చేస్తుంది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని టీడీపీ నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

బాధితులను పరామర్శించి న్యాయం చేస్తామన్న మంత్రి తానేటి వనిత ..వాచ్‌మెన్, వార్డెన్ల తొలగింపు

బాధితులను పరామర్శించి న్యాయం చేస్తామన్న మంత్రి తానేటి వనిత ..వాచ్‌మెన్, వార్డెన్ల తొలగింపు

ఇక ఈఘటన నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి తానేటి వనిత బాధితులను పరామర్శించారు. స్వధార్ కేంద్రంలో మహిళలపై లైంగిక దాడి ఘటనలో వాచ్‌మెన్, వార్డెన్లను విధుల నుంచి తొలగించామని ఆమె స్పష్టం చేశారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోని స్వధార్ కేంద్రం మేనేజర్‌ని సస్పెండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యం ఉందన్నమంత్రి దిశ చట్టం వచ్చాక గతంలో కంటే బాధితులకు తక్షణమే న్యాయం జరుగుతోందని పేర్కొన్నారు.

English summary
Watchmen in the dormitory of Swadhar in bommuru near Rajahmundry, sexually abused four women and forced them to commit adultery . they complained about his harrassment . police filed case and started investigation .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X