రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గ్రాఫిక్స్ బాబు..రియల్ ఎస్టేట్ బాబు: వైసీపీ కౌంటర్ అటాక్: రోడ్డెక్కిన ఎంపీ: విశాఖకు అనుకూలంగా..!

|
Google Oneindia TeluguNews

కాకినాడ: అమరావతి ప్రాంత రైతులతో కలిసి కొద్దిరోజులుగా నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చేపట్టిన తెలుగుదేశంపై ఎదురు దాడికి దిగింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయిదేళ్ల తన ప్రభుత్వ హయాంలో చంద్రబాాబు నాయుడు అమరావతి కోసం ఏం చేశారంటూ కౌంటర్ అటాక్ చేస్తోంది. ముఖ్యమంత్రిగా పని చేసినన్ని రోజులూ చంద్రబాబు గ్రాఫిక్స్‌లతో ప్రజలను మభ్య పెడుతూ వచ్చారంటూ ప్రత్యారోపణాస్త్రాలను సంధిస్తోంది.

'గ్రీన్ జోన్ పేరుతో చంద్రబాబు మోసం.. వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ది''గ్రీన్ జోన్ పేరుతో చంద్రబాబు మోసం.. వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ది'

రాజమహేంద్రవరం వీధుల్లో..

రాజమహేంద్రవరం వీధుల్లో..

ఈ దిశగా తూర్ప గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోక్ సభ సభ్యుడు మార్గాని భరత్ శుక్రవారం ఓ భారీ ప్రదర్శనను నిర్వహించారు. రాజమహేంద్రవరంలో చేపట్టిన ఈ ర్యాలీకి జిల్లాకు చెందిన పలువురు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గో బ్యాక్ బాబు, రియల్ ఎస్టేట్ బాబు, గ్రాఫిక్స్ బాబు అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. రోడ్లపై బైఠాయించారు.

ఉత్తరాంధ్ర, రాయలసీమకు వ్యతిరేకి..

ఉత్తరాంధ్ర, రాయలసీమకు వ్యతిరేకి..

చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని మార్గాని భరత్ ఆరోపించారు. ఈ రెండు ప్రాంతాల్లోని ఏడు జిల్లాల్లో అభివృద్ధిలో వెనుకబడిన విషయం చంద్రబాబు తెలియదా? అని నిలదీశారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లావాసులు జీవనోపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమలోని కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఏటా కరవు తాండవిస్తుంటుందని, అలాంటి ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం వైఎస్ జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకున్నారని అన్నారు.

తెలుగుదేశం పార్టీ నేతలు తమ వైఖరిని స్పష్టం చేయాలి..

తెలుగుదేశం పార్టీ నేతలు తమ వైఖరిని స్పష్టం చేయాలి..


ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు తమ వైఖరిని స్పష్టం చేయాలని మార్గాని భరత్ డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటుకు చంద్రబాబు వ్యతిరేకంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండు ప్రాంతాల టీడీపీ నాయకులు చంద్రబాబు వెంట ఉంటారా? లేక ప్రజల మనోభావాలకు అనుగుణంగా వెళ్తారా? అనే విషయాన్ని స్పష్టం చేయాలని అన్నారు. రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తే.. ప్రజలు ఛీ కొడతారని విమర్శించారు.

రైతు ఉద్యమాల పేరుతో..

రైతు ఉద్యమాల పేరుతో..

రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతిలో నిరసన ప్రదర్శనలు, ఆందోళనలకు దిగిన రైతులకు నాయకత్వాన్ని వహిస్తోన్న తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులో పుట్టగతులు ఉండవని మార్గాని భరత్ అన్నారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాలను తీసుకోవాలే తప్ప తన సామాజిక వర్గానికి చెందిన కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం చంద్రబాబు పని చేస్తున్నారని ధ్వజమెత్తారు.

English summary
Ruling YSR Congress Party Lok Sabha member Margani Bharat conducted a rally in support with the Three capital cities for Andhra Pradesh in Rajahmundry. He was alleged to TDP President and Former Chief Minister Chandrababu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X