రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒడ్డుకు చేరిన రాయల్ వశిష్ట బోటు..మరో అయిదు మృత దేహాలు లభ్యం

|
Google Oneindia TeluguNews

Recommended Video

బయటకు వచ్చిన వశిష్ట బోటు

తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద జరిగిన ప్రమాదంలో మునిగిన బోటు ఎట్టకేలకు బయటకు వచ్చింది. గత ముప్పై ఎనిమిది రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలితాలను ఇచ్చాయి. ధర్మాడి సత్యం బ‌ృందం గత అయిదు రోజులుగా సాంప్రదాయ పద్దతిలో లంగర్లు వేస్తూ తన ప్రయత్నాలు కొనసాగించింది. దీంతో బయటకు వచ్చిన బోటులో పలు మృతదేహాలు బయటపడుతున్నాయి. ప్రస్తుతానికి అయిదు మృతదేహాలు బయటపడగా పూర్తిగా గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయి.

 శిధిలావస్థకు చేరిన బోటు

శిధిలావస్థకు చేరిన బోటు

సత్యం బృందం మరియు విశాఖ నుండి డీప్ సీ డైవర్స్ నేరుగా ఆక్సిజన్ మాస్క్‌లు ధరించి డైవర్లు బోటుకు లంగర్లు వేసి బయటకు తీశారు. అయితే గోదావరి నదిలో మునిగిన బోటు శిధిలావస్థకు చేరుకున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ముక్కలుగా నీటీపై కనిపిస్తున్న బోటును బయటకు పూర్తిగా బటయకు తీసేందుకు సత్యం బృందం వెలికి తీస్తోంది. గత వారం రోజులుగా ధర్మాడి సత్యం బృందం లంగర్లు, ఐరన్ రోప్‌లతో తన ప్రయత్నాన్ని కోనసాగించింది. దీంతో రెండు రోజుల క్రితం బోటు రెయిలింగ్ బయట పడిన విషయం తెలిసిందే..అయితే 38 రోజులుగా బోటు నీటీలో ఉండడంతో పూర్తిగా శిధిలావస్థకు చేరుకున్నట్టు కనిపిస్తోంది.

బోటులో పయటపడ్డ మృతదేహాలు


ప్రస్తుతం నీటీలో ఉన్న బోటు అయిదు మృతదేహాలు బయటపడ్డాయి. దీంతో మరిన్ని మృతదేహాలు కూడ అందులో లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే నీటిలో నుండి బయటకు తీసిన తర్వాత బోటు లోపలి ప్రాంతాన్ని పరీశిలించనున్నారు. బోటు పూర్తిగా నీళ్లపైకి రావడంతో సత్యం బృందంతో పాటు ఇన్నాళ్లు తమ ప్రయత్నాలు చేస్తున్న సిబ్బందిలో కొంత సంతోషాన్ని కనబరుస్తుండగా తమవారి చివరి చూపుకోసం మ‌‌ృతుల కుటుంభాలు ఎదురు చూస్తున్నాయి. మరోవైపు కచ్చులూరు ప్రజలు బోటు బయటకు రావడంతో గోదావరిలో తిరిగి చేపలు పట్టడడంతో పాటు నీళ్లను వాడుకునేందుకు సిద్దమవుతున్నట్టు చెప్పారు.

సెప్టెంబర్ 15న ఘటన

సెప్టెంబర్ 15న ఘటన

సెప్టెంబర్ 15న జరిగిన బోటు ప్రమాద సమయంలో 8 మంది సిబ్బందితో పాటు ముగ్గురు పిల్లలు సహా మొత్తం 75 మంది ఉన్నాట్లు అధికారులు ప్రకటించారు. వీరిలో 26 మంది ప్రాణాలతో బయటపడగా.. ఇప్పటి వరకు 38 మృతదేహాలను బయటకు తీశారు. కాగా మరో 11 మంది ఆచూకీ తెలియలేదు. బోటులోనే వారి డెడ్‌బాడీలు చిక్కుకొని ఉంటాయని అంచనా వేస్తున్నారు. ధర్మాడి సత్యం బృందం ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిరంతరంగా తన ప్రయత్నాలను కొనసాగించింది. చివరి రోజు వర్షం కురుస్తున్నా... సత్యం బ‌ృందం తన ప్రయత్నాలు కొనసాగించింది. ఫలితంగా బోటు బయటకు వచ్చింది.

English summary
ofter 38 days trials Royal Vashista Boat came out today.swim diver jumped into rever with masks and fixed the langers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X