రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బోటు మృతుల కుటుంబాలకు అదనంగా పదిలక్షలు..,

|
Google Oneindia TeluguNews

గోదావరిలో జరిగిన బోటు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు అదనంగా పది లక్షల రుపాయాలు అందించనున్నట్టు తూర్పుగోదావరి జిల్లా పోలీసు అధికారులు ప్రకటించారు. ఇవి ప్రభుత్వ సహాయానికి అదనంగా అందివ్వనున్నట్టు జిల్లా ఎస్పీ నయీం అస్మి తెలిపారు. అదనపు డబ్బులను బీమా సహయం ద్వార అందించనున్నట్టు ఆయన చెప్పారు. ఇందుకోసం న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా చెల్లింపులు జరుగుతాయన్నారు. దీనికోసం రాజమహేంద్రవరం ఎస్పీ కార్యాలయం వద్ద బీమా సహాయకేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు.

కాగా ప్రమాద సంఘటనపై సమీక్ష జరిపిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి బాధిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి మూడు లక్షల రుపాయాలతోపాటు ప్రమాదం బయటపడిన వారికి లక్ష రూపాలయను ప్రకటించారు. దీంతో పాటు బాధితకుటుంబాలకు అండగా ఉంటామని హమీ ఇచ్చారు. మరోవైపు మృతుల్లో వరంగల్, హైదారబాద్ ప్రాంతానికి చెందిన వారు ఉండడంతో తెలంగాణ ప్రభుత్వం కూడ స్పందించింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరుపున 5 రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది.

Rs 10 lakh additional ex-gratia through Insurance to the Godavari boat families

ప్రమాద సమయంలో బోటులో 8 మంది సిబ్బందితోపాటు ముగ్గురు పిల్లలతో సహా మొత్తం 75 మంది ఉన్నారని పోలీసులు చెప్పారు. వీరిలో 26 మంది ప్రాణాలతో బయటపడగా.. 34 మృతదేహాలను బయటకు తీశారు. మరో 15 మంది ఆచూకీ తెలియలేదు. బోటులోనే వారి డెడ్‌బాడీలు చిక్కుకొని ఉంటాయని అంచనా వేస్తున్నారు.

English summary
East Godavari SP has announces Rs 10 lakh additional ex-gratia through Insurance to the families of the victims who died in the Godavari boat tragedy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X