స్టార్స్ అంతా డిసెంబర్ లోనే .. డైనమిక్ సీఎం జగన్ కూడా డిసెంబర్ లోనే : నటి పాయల్ రాజ్ పుత్
స్టార్స్ అంతా డిసెంబర్ నెలలోనే పుడతారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా డిసెంబర్లోనే పుట్టారు అని సినీనటి ఆర్ఎక్స్ 100 పాయల్ రాజ్ పుత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో రాజమహేంద్రవరం ప్రీమియర్ లీగ్ సీజన్ 4 క్రికెట్ పోటీలను ప్రారంభించిన కార్యక్రమంలో పాల్గొన్న పాయల్ రాజ్ పుత్ సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అక్కడ క్రీడాకారులతో కలిపి ఉత్సాహంగా మాట్లాడిన ఆమె ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి క్రీడాకారులకు ఇస్తున్న ప్రోత్సాహం ఎనలేనిదని కొనియాడారు.
జగన్ .. ఓ అసమర్ధ సీఎం .. ఉదాసీనత వల్లే ఇదంతా .. విరుచుకుపడిన చంద్రబాబు

సీఎం జగన్మోహన్ రెడ్డి క్రీడలపై ప్రత్యేకమైన అభిరుచి ఉండడం మన అదృష్టం : మంత్రి అనీల్ కుమార్ యాదవ్
రాజమండ్రి ప్రీమియర్ లీగ్ సీజన్ 4 క్రికెట్ పోటీల కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ మార్గాని భరత్ రామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సీఎం జగన్మోహన్ రెడ్డి క్రీడలపై ప్రత్యేకమైన అభిరుచి ఉండడం మన అదృష్టం అంటూ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి క్రీడాకారులకు అనేక ప్రోత్సాహకాలు ఇస్తున్నారని, క్రీడాకారుల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.

రాజమండ్రిని స్పోర్ట్స్ హబ్ గా మారుస్తాం : ఎంపీ మార్గాని భరత్
ఎంపీ మార్గాని భరత్ రామ్ రాజమండ్రిని స్పోర్ట్స్ హబ్ గా తయారు చేస్తారని పేర్కొన్నారు. క్రీడలు శారీరక , మానసిక వికాసానికి పునాదులని, ఐకమత్యాన్ని పెంపొందించడానికి కూడా క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని ఎంపీ మార్గాన్ని భరత్ రామ్ అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి క్రీడల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నారని, క్రీడాకారులకు రాష్ట్రంలో చక్కని ప్రోత్సాహం లభిస్తుందని మార్గాన్ని భరత్ రామ్ వ్యాఖ్యానించారు.

రాజమండ్రిలో సందడి చేసిన నటి పాయల్ రాజ్ పుత్ .. సీఎం జగన్ పై వ్యాఖ్యలే ఇంట్రెస్టింగ్
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటి , ఆర్ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్ తెలుగులో మాట్లాడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టమని తన కాలేజీలో చదువుకునే రోజుల్లో క్రికెట్ ఆడే దానినని చెప్పుకొచ్చారు. రాజమండ్రి రావటం చాలా సంతోషంగా ఉందని , అలాగే గోదావరి అందాలు చాలా బాగున్నాయని ఆమె ఆనందం వ్యక్తం చేశారు . అక్కడి క్రీడాకారులతో సరదాగా మాట్లాడిన పాయల్ రాజ్ పుత్, ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.