• search
  • Live TV
రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తూ.గో లో టీడీపీకి కీలక నేత గుడ్ బై : వరుపుల రాజా రాజీనామా : జగన్ పై ప్రశంసలు..!!

|

తూర్పు గోదావరి జిల్లాలో కీలక నేత టీడీపీకి గుడ్ బై చెప్పారు. ప్రత్తిపాడు నియోజకవర్గ నేత వరుపుల రాజా టీడీపీకి రాజీనామా చేశారు. వెల్లడించారు. టీడీపీలో ఒకే సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారని, కాపులకు సరైన గుర్తింపు లేదని ఆరోపించారు. టీడీపీకి మనుగడ లేదని, మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాల్లేవని వ్యాఖ్యానించారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, పేదల అవసరాలను గుర్తించడంలో టీడీపీ వైఫ్యలం చెందిందని అన్నారు. జగన్ మూడు నెలల పరిపాలనలో ఏమీ చేయలేదని టీడీపీ విమర్శలు చేస్తోంది. పేద ప్రజల కోసం జగన్ ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. కాపుల విషయంలో సీఎం వైఎస్‌ జగన్ మొదటి నుంచీ ఒకే విధానంతో ఉన్నారన్నారు.

నాన్చుడా... తేల్చుడా: అగ్గిరాజుకుంటోంది..జగన్ సమర్థతకు పరీక్ష

టీడీపీకి వరుపుల రాజా గుడ్ బై..

తెలుగుదేశం పార్టీకి వరుపుల రాజా రాజీనామా చేశారు. టీడీపీ హయాంలో డీసీసీబీ ఛైర్మన్‌గా పని చేసిన వరుపుల.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడం వల్లే టీడీపీని వీడుతున్నానని తెలిపారు. కష్టపడి పనిచేసే వారికి టీడీపీలో గుర్తింపు లేదని వాపోయారు. టీడీపీ పూర్తిగా వెనుకబడిపోయిందని, తానెప్పుడో టీడీపీ నుంచి బయటకు రావాలనికున్నానని వెల్లడించారు. టీడీపీలో ఒకే సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారని, కాపులకు సరైన గుర్తింపు లేదని ఆరోపించారు. టీడీపీలో ఉన్న 80 శాతం కాపు నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, కాపులను చంద్రబాబు పట్టించుకోకుండా ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. కాపుల విషయంలో సీఎం వైఎస్‌ జగన్ మొదటి నుంచీ ఒకే విధానంతో ఉన్నారని చెప్పుకొచ్చారు. ఎప్పుడో పార్టీ మారాలనుకున్నా.. మారతారేమోనని ఎదురు చూశా. కార్యకర్తలతో మాట్లాడి త్వరలో నా‌ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పుకొచ్చారు.

చాలా రోజుల నుంచి ఆవేదన చెందుతున్ననని... అందుకే రాజీనామా చేస్తున్నానని చెప్పిన రాజా తూర్పు గోదావరి జిల్లాలో పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డానని వివరించారు.

TDP key leader in East Godavari District Varupula Raja resigned for TDP

జగన్ పైన ప్రశంసలు..

గత ఎన్నికలలో చివరి‌ వరకు తనకు సీటు కేటాయించలేదని... పార్టీ చివరిలో సీటు ఇవ్వడం వల్లే నాలుగు వేల ఓట్లతో ఓటమి చెందాల్సి వచ్చిందన్నారు. కాపులకు టీడీపీలో భవిష్యత్తు ఉండదని చెప్పుకొచ్చారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో కూడా కాపులకు న్యాయం చేయలేదుని విమర్శించారు. ఇప్పుడు కాపు రిజర్వేషన్‌పై జగన్‌ను విమర్శించే అర్హత టీడీపీకి లేదని.. టీడీపీ మునిగిపోయే పడవ లాంటిదని ఫైర్ అయ్యారు. ఆ పార్టీకి ఏపీలో ఇక మనుగడ లేదంటూ ప్రజలకు ఏమి కావాలో గుర్తించకపోవడం వల్లే 23 సీట్లకు టీడీపీ పరిమితం అయ్యిందని విమర్శించారు. జగన్ మూడు నెలల పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చి పక్షాళన చేశారని మెచ్చుకున్నారు. రాజధాని మారుస్తానని సీఎం జగన్ ఎక్కడా చెప్పలేదని, టీడీపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. రాజధానిలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు 90 శాతం భూములు కొన్నారని వెల్లడించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ వరుపుల రాజా 4611 ఓట్ల తేడాతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ చేతిలో ఓడిపోయారు. నిర్వహిస్తున్నారు. తనకు బీజేపీ నుంచి ఆహ్వానం వచ్చిందని... ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. టీడీపీలో ఇతర కాపు నేతలు కూడా త్వరలో మంచి నిర్ణయం తీసుకుంటారని‌ భావిస్తున్నానని రాజా పేర్కొన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TDP key leader in East Godavari Dsitrict Varupula Raja resigned for TDP. He may join in YCP shortly.Raja serious comments on TDP. He says TDP have no future in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more