video social media viral intermediate students వీడియో సోషల్ మీడియా వైరల్ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్
క్లాస్‌రూంలో పెళ్లి చేసుకున్న మైనర్ల జంట .. ఏపీలో ఇంటర్ స్టూడెంట్స్ ఘనకార్యం .. వీడియో వైరల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు మైనర్లు పెళ్లి చేసుకున్న ఘటన అందరినీ షాక్ కు గురి చేసింది. ఇంటర్మీడియట్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు తరగతిగదిలోనే పెళ్లి చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు నవంబర్ 17వ తేదీన తరగతిలో వివాహం చేసుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
క్లాస్ రూమ్ లోనే పెళ్లి చేసుకున్న ఇద్దరు ఏకంగా తమ పెళ్లి వీడియో తీసుకున్నారు.
రైతు మ్యారేజ్ బ్యూరో ... అక్కడ పెళ్లి సంబంధాలు రైతులకు మాత్రమే.. ఎందుకంటే..
క్లాస్ రూమ్ లో పెళ్లి , పెళ్లి తతంగం వీడియో .. సోషల్ మీడియాలో లైక్స్ కోసం ?
తాళిబొట్టు కట్టి, మూడు ముళ్ళు వేసి, బొట్టు పెట్టి మరీ పెళ్లి తతంగాన్ని వీడియో తీసుకున్నారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రిన్సిపల్ వారికి టి సి ఇచ్చి పంపించేశారు.
అయితే ఇది నిజమైన పెళ్లి కాదు అని సోషల్ మీడియాలో లైకుల కోసం మాత్రమే చేశామని విద్యార్థులు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై విద్యార్థుల పేరెంట్స్ కు సమాచారం ఇచ్చామని, విద్యార్థులు చేసిన పనికి ఏం చేయాలో అర్థం కాని దిక్కుతోచని స్థితిలోకి తల్లిదండ్రులు వెళ్లిపోయారని కళాశాల యాజమాన్యం చెబుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ గా వీడియో .. లబోదిబోమంటున్న తల్లిదండ్రులు
చదువుకోమని కాలేజ్ కి పంపితే ఇవేం పిచ్చి పనులు అంటూ ఈ వీడియో చూసిన కొందరు విసుక్కుంటూ ఉంటే , తల్లిదండ్రులు తమ పరువు బజారుకీడ్చారంటూ లబోదిబోమంటున్నారు . ఇద్దరు మైనర్లు కావడంతో వారు చేసుకున్న పెళ్లిని ఏమనాలో అర్థం కాని స్థితిలో తల్లిదండ్రులు ఉన్నారు. వారు చేసిన ఘనకార్యం సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియడంతో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో తల్లిదండ్రులు పడ్డారు. ఇక విద్యార్థులు మాత్రం ఏదో సరదాకి చేశామని చెప్పడం గమనార్హం.

విచక్షణా జ్ఞానం లేకుండా ఏది పడితే అది చేస్తే దారుణంగా భవిష్యత్ పరిణామాలు
ఏది చెయ్యొచ్చు, ఏది చేయకూడదు అన్న విచక్షణ జ్ఞానం విద్యార్థులకు ఉండాల్సిన అవసరముంది. తరగతిలోని ఏకంగా పెళ్లి చేసుకొని, సరదాగా చేశామని చెప్పడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. సరదాగా చేసినా వాళ్లు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇప్పుడు వారిద్దరి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. తరగతి గదిలో జరిగింది పెళ్ళే కాదని , వాళ్లు మామూలుగా తిరిగి చదువుకోవాలని ప్రయత్నించినా తెలిసి తెలియక వాళ్ళు చేసిన పొరపాటు వారికి ఇబ్బందులు కలిగిస్తుంది. అందుకే ఏ పనైనా చేసేటప్పుడు మంచి చెడులను, భవిష్యత్ పరిణామాలను ఆలోచించుకుని చేయాల్సిన అవసరం ఉంది.