రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యూకే నుంచి వచ్చిన మహిళకు కరోనా స్ట్రెయిన్.. హై టెన్షన్... క్వారంటైన్‌లో ఉమెన్..

|
Google Oneindia TeluguNews

ఎంతలా భయపడితే కరోనా వైరస్ స్ట్రెయిన్ అంత భయపెడుతోంది. ఎక్కడో బ్రిటన్‌లో ఆనవాళ్లు కనిపించగా.. మన పక్కవరకు వ్యాపిస్తోంది. అయితే ఈ నెల 21వ తేదీన బ్రిటన్ నుంచి ఓ ఇంగ్లో ఇండియన్ వచ్చారు. ఆమెతో కుమారుడు కూడా ఉన్నారు. వచ్చి రాగానే పరీక్ష చేయించుకున్నారు. కానీ రిపోర్ట్ వచ్చేవరకు మాత్రం ఆగలేదు.

UK returnee who managed to leave Delhi for Andhra positive

21వ తేదీన ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా భారత్ చేరుకున్నారు. కరోనా వైరస్ టెస్ట్ చేయించుకున్నారు. కానీ ఫలితం రాకముందే కుమారుడితో కలిసి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ బయల్దేరారు. తూర్పు గోదావరి జిల్లాకు బయల్దేరారు. దీంతో ఆమె ఆచూకీ కనుగొనేందుకు అధికారులు నానా తిప్పలు పడ్డారు. చివరికీ విశాఖకు చెందిన రైలులో ప్రయాణిస్తున్నారని కనుగొన్నారు. 24వ తేదీన వారిద్దరూ రాజయండ్రిలో దిగారని.. వారు ప్రస్తుతం ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రంలో ఉన్నారని అధికారులు తెలిపారు. కుమారుడికి పరీక్ష చేయగా నెగటివ్ వచ్చిందని వైద్యాధికారులు తెలియజేశారు.

పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ అధికారులు తెలిపారు. మంగళవారం వరకు బ్రిటన్ నుంచి 11 మంది వచ్చారు. యూకే నుంచి వచ్చినవారి సన్నిహితులను కూడా పరీక్షలు చేస్తున్నారు. అలా 12 మందికి సన్నిహిత పరిచయాలు ఉన్నట్టు గుర్తించారు. డిసెంబర్ 9వ తేదీ నుంచి ఇప్పటివరకు 1200 మంది బ్రిటన్ నుంచి వచ్చారని.. వారందరికీ వైద్య పరీక్షలు చేస్తున్నామని తెలంగాణ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ శ్రీనివాసరావు తెలిపారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేస్తున్నామని వివరించారు.

English summary
Andhra Pradesh-based woman who had arrived from the United Kingdom on December 21 has tested positive for the new UK strain of the coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X