రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హర్షకుమార్‌పై తీవ్రమైన అభియోగాలు: అరెస్ట్ తప్పేలా లేదు!, పరారీలో ఉన్నా..

|
Google Oneindia TeluguNews

రాజమహేంద్రవరం: అమలాపురం మాజీ ఎంపీ, మాజీ మంత్రి హర్షకుమార్ అరెస్ట్ తప్పేలా లేదు. విధి నిర్వహణలో ఉన్న కోర్టు ఉద్యోగులను బెదిరించడం, ప్రజలను తప్పుదోవ పట్టించం, మహిళా ఉద్యోగినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, న్యాయమూర్తులను పరుషపదజాలంతో దూషించిన కేసులో హర్షకుమార్‌ అరెస్ట్ తప్పదని ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్ తేల్చి చెప్పారు.

గరపగర్రుకు వెళ్లి ఇలా చేస్తావా!: జగన్‌పై హర్ష కుమార్ తీవ్ర ఆగ్రహంగరపగర్రుకు వెళ్లి ఇలా చేస్తావా!: జగన్‌పై హర్ష కుమార్ తీవ్ర ఆగ్రహం

తప్పుదోవ పట్టించారు..

తప్పుదోవ పట్టించారు..

మంగళవారం రాత్రి మీడియాతో మాట్లాడిన డీఐజీ.. ఇటీవల జరిగిన బోటు ప్రమాదంలో 93మంది ఉన్నారంటూ ప్రజలను, వ్యవస్థనూ తప్పుదోవ పట్టించారని అన్నారు. హర్షకుమార్ వద్ద పడవ ప్రమాదానికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా ఇవ్వాలని అడిగామని, అయితే అతని నుంచి ఎలాంటి స్పందనా రాలేదని చెప్పారు.

పరుషపదజాలంతో న్యాయమూర్తులను కూడా..

పరుషపదజాలంతో న్యాయమూర్తులను కూడా..

తప్పుడు సమాచారంతో హర్షకుమార్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని డీఐజీ వ్యాఖ్యానించారు. అంతేగాక, సెప్టెంబర్ 28న రాజమహేంద్రవరం కోర్టుకు చెందిన స్థలంలో ఆక్రమణలు తొలగిస్తుండగా.. హర్షకుమార్ వచ్చి.. జిల్లా న్యాయమూర్తిపై పరుషపదజాలం ఉపయోగించారని, అంతేగాక, అక్కడేవున్న కోర్టు ఉద్యోగులను బెదిరింపులకు గురిచేశారని చెప్పారు. మహిళా ఉద్యోగినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు.

హర్షకుమార్ కోసం గాలింపు.

హర్షకుమార్ కోసం గాలింపు.

ఈ మేరకు జిల్లా కోర్టు పరిపాలనాధికారి త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. హర్షకుమార్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. హర్షకుమార్ తన నివాసంలో లేకపోవడంతో నాలుగు బృందాలు ఆయన కోసం గాలిస్తున్నాయని, ఆయనకు సహకరించిన వారిని కూడా అరెస్ట్ చేశామని డీఐజీ తెలిపారు.

హర్షకుమార్‌ను అరెస్టు చేయకపోవడంతో..

హర్షకుమార్‌ను అరెస్టు చేయకపోవడంతో..


ఇది ఇలా ఉండగా, మాజీ ఎంపీ హర్షకుమార్‌ను అరెస్ట్ చేయడంలో అలసత్వం ప్రదర్శించిన త్రీటౌన్ ఇన్‌స్పెక్టర్ ఎం శేఖర్‌బాబును సస్పెండ్ చేసినట్లు డీఐజీ తెలిపారు. అరెస్టుకు జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. సెప్టెంబర్ 29న ఇంట్లోనే ఉన్న మాజీ ఎంపీ హర్షకుమార్‌ను అరెస్ట్ చేయడంలో శేఖర్ బాబు అలసత్వం ప్రదర్శించారని, అందుకే సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

పరారీలోనే హర్షకుమార్

పరారీలోనే హర్షకుమార్


శేఖర్ బాబు అలసత్వం కారణంగా హర్షకుమార్ ఇప్పుడు పరారీలో ఉన్నారని చెప్పారు. కాగా, గత మూడు రోజుల నుంచి కూడా హర్షకుమార్ అరెస్టుకు పోలీసులు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. హర్షకుమార్ ఎప్పుడు వస్తే అప్పుడు అరెస్ట్ చేద్దామని ఆయన ఇంటి వద్ద కూడా పోలీసులు కాపు కాస్తున్నారు.

English summary
Eluru range DIG AS Khan said that former MP of Amalapuram would be arrested in a case where he threatened government employees and abusing female judges.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X