వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోల్‌కత నైట్ రైడర్స్‌ అంటే రోహిత్ శర్మకు ఎంత ప్రేమో: ఏ క్రికెటర్ సాధించని రికార్డు అది..

|
Google Oneindia TeluguNews

అబుధాబి: ఐపీఎల్-2020 సీజన్‌లో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో బుధవారం రాత్రి ముంబై ఇండియన్స్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్.. అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ముంబై ఇండియన్స్ సాధించిన ఒక్క విజయం.. పాత రికార్డులను తుడిచి పారేసింది. వ్యక్తిగతంగా టీమ్ కేప్టెన్ రోహిత్ శర్మ రికార్డులను సవరించింది. అరుదైన క్రికెటర్ల జాబితాలో చేర్చింది. వన్ మ్యాన్ షోగా నడిచిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గ్రాండ్ విక్టరీని సాధించింది. కోల్‌కత కొనసాగుతోన్న వరుస ఓటములకు బ్రేక్ వేసింది.

200 సిక్సుల క్లబ్‌లో రోహిత్

200 సిక్సుల క్లబ్‌లో రోహిత్

కోల్‌కత నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఓ అరుదైన మైల్‌స్టోన్‌ను అందుకున్నాడు. 200 సిక్సులను బాదిన బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు సాధించాడు. 200 సిక్సుల క్లబ్‌లో చేరాడు. ఈ క్లబ్‌లో చేరిన రెండో భారత క్రికెటర్.. రోహిత్ శర్మ. అంతకుముందు- ధనాధన్ ధోనీ.. ఈ ఫీట్‌ను సాధించాడు. విదేశీ బ్యాట్స్‌మెన్లలో క్రిస్‌గేల్, ఏబీ డివిలియర్స్ ఇప్పటికే ఈ మైలురాయిని అందుకున్న వారిలో ఉన్నారు. ఐపీఎల్‌లో ఆడే విదేశీ బ్యాట్స్‌మెన్లలో క్రిస్‌గేల్, ఆ తరువాత ఏబీడీ 200 సిక్సులు కొట్టిన లిస్ట్‌లో ఉన్నారు. మొత్తంగా క్రిస్‌గేల్-326, ఏబీ డివిలియర్స్-214, మహేంద్రసింగ్ ధోనీ-212, రోహిత్ శర్మ-200 సిక్సులను సాధించారు.

కోల్‌కతపై 20 మ్యాచ్‌ల విజయం..

కోల్‌కతపై 20 మ్యాచ్‌ల విజయం..

కోల్‌కత నైట్ రైడర్స్‌పై 20 మ్యాచ్‌లల్లో విజయం సాధించిన తొలి టీమ్‌గా ముంబై ఇండియన్స్ మరో రికార్డును నెలకొల్పింది. ఇప్పటిదాకా ఈ మార్క్‌ను ఏ జట్టు కూడా అందుకోలేదు. ఈ రెండు జట్లు ఇప్పటిదాకా 26 సార్లు తలపడ్డాయి. ఇందులో 20 సార్లు రోహిత్ టీమ్ పైచేయి సాధించింది. ఆరుసార్లు మాత్రమే కోల్‌కత నైట్ రైడర్స్ విజయం సాధించగలిగింది. విదేశీ గడ్డపై నిర్వహించిన ఐపీఎల్ మ్యాచ్‌లల్లో వరుస ఓటములకూ ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో సాధించిన విజయంతో తెర దించినట్టయింది.

కోల్‌కత వరుస గెలుపులకూ బ్రేక్

కోల్‌కత వరుస గెలుపులకూ బ్రేక్


ఐపీఎల్ ఎడిషన్స్ అంటే కోల్‌కత నైట్ రైడర్స్ భలే క్రేజ్. ఆడిన తొలి మ్యాచ్‌లో ఘన విజయాన్ని సాధించడాన్ని కోల్‌కత ఆనవాయితీని పెట్టుకుంది. అలాంటి సంప్రదాయానికీ ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌తో బ్రేక్ పడింది. 2013 నుంచి 2019 దాకా నిర్వహించిన ఐపీఎల్ ఎడిషన్స్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో కోల్‌కోత గ్రాండ్ విక్టరీని సాధిస్తూ వచ్చింది. చివరిసారిగా- సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌ను ఓడిపోవడం 2012 తరువాత మళ్లీ ఇదే. 2012 తరువాత ఆడిన తొలి మ్యాచ్‌ను పోగొట్టుకోవడం కోల్‌కత టీమ్‌కు ఇదే తొలిసారి.

ధోనీని వెనక్కి నెట్టి..

ధోనీని వెనక్కి నెట్టి..

అబుధాబి మ్యాచ్‌తో ముంబై ఇండియన్స్ స్కిప్పర్ రోహిత్ శర్మ మరో ఘనతను సాధించాడు. అత్యధికంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సాధించిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు. ఈ విషయంలో మహేంద్రసింగ్ ధోనీని వెనక్కి నెట్టాడు. మొత్తం 18 సార్లు మ్యాన్ ఆప్ ది మ్యాచ్ అవార్డును రోహిత్ శర్మ తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు- క్రిస్‌గేల్, ఏబీ డివిలియర్స్ ఈ ఘనతను సాధించారు. క్రిస్‌గేల్-21, ఏబీ డివిలియర్స్-20 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు.

కోల్‌కతపై 900లకు పైగా రన్స్

కోల్‌కతపై 900లకు పైగా రన్స్

ఐపీఎల్‌ ఎడిషన్లలో కోల్‌కత నైట్ రైడర్స్‌పై రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డును స్థాపించాడు. ఈ జట్టుపై 900లకు పైగా పరుగులను సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్ అతనే. బుధవారం రాత్రి నాటి మ్యాచ్‌తో ఈ అరుదైన రికార్డును రోహిత్ సాధించాడు. మొత్తం 26 మ్యాచ్‌లల్లో 904 పరుగులను చేశాడు. ఇప్పటిదాకా ఏ బ్యాట్స్‌మెన్ కూడా కోల్‌కత నైట్ రైడర్స్‌పై ఈ స్థాయిలో చెలరేగిపోయి ఆడలేదు. కోల్‌కతతో ఆడిన మెజారిటీ మ్యాచ్‌లల్లో రోహిత్ శర్మ.. భారీ స్కోర్లు సాధించాడనడానికి దీన్ని నిదర్శనంగా తీసుకోవచ్చు.

English summary
Rohit Sharma became the 2nd Indian after MS Dhoni to smash 200 sixes in the IPL with the six maximums he hit against KKR. Among overseas players, only Chris Gayle and AB de Villiers achieved this feat before Rohit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X