సిద్దిపేట వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అడిషనల్ డీసీపీ నర్సింహారెడ్డి అరెస్ట్... చంచల్‌గూడ జైలుకు తరలింపు

|
Google Oneindia TeluguNews

గత రెండురోజులుగా అక్రమాస్తుల విషయంలో సోదాలు ఎదుర్కొంటున్న సిద్దిపేట అడిషనల్ డీసీపీ నర్సింహరెడ్డిని ఏసీబీ అరెస్ట్ చేశారు. అనంతరం ఏసీబీలో కోర్టులో హజరుపరచడంతో 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను చంచల్ గూడ జైలుకు తరలించారు.

సిద్దిపేట లా అండ్ అర్డర్ విభాగంలో అడిషనల్ డీసీపీగా విధులు నిర్వహిస్తున్న నర్సింహారెడ్డి ఆస్తులపై గత రెండు రోజులుగా ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే మహబూబ్‌నగర్‌, జహీరాబాద్‌, అయ్యవారిపల్లె, సిద్దిపేట, హైదరాబాద్‌లో నర్సింహారెడ్డి ఆయన బంధువులు, బినామీల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. దీంతో మొత్తం పదికోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు కనుగొన్నారు.

Additional DCP of Siddipet narasimha reddy was arrested

నర్సింహారెడ్డి స్వంత నివాసంలో కిలోన్నర బంగారం, అయిదు లక్షల రూపాయల నగదు, మరో ఆరులక్షల రూపాయల బ్యాంకు బ్యాలన్స్, తోపాటు గోల్కండ కోట సమీపంలో ఓ విల్లా, మరోవైపు శంకర్‌పల్లి, గొల్లపల్లి, జహీరాబాద్ ఏరియాల్లో మరో 14 ఇంటి ప్లాట్లు, ఉన్నట్టు గుర్తించారు. వీటితోపాటు మహబుబ్‌నగర్, సిద్దిపేట ప్రాంతాల్లో మరో ఇరవై ఎకరాల వ్యవసాయ భూమి, ఉన్నట్టు గుర్తించారు. కాగా సోదాలు పూర్తయిన అనంతరం నేడు సాయంత్రం అరెస్ట్ చేసి, ఏసీబీ కోర్టులో హజరు పరిచారు. కాగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

English summary
Additional SP of Siddipet was arrested in disproportionate assets worth over 10 cr. and sent to jail for remand
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X