సిద్దిపేట వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దుబ్బాక ఫలితంపై ఈసీ ట్విస్ట్ -అధికారికం కాదు -ఈవీఎంలలో లోపాలు -దిమ్మతిరిగేలా లెక్కలు

|
Google Oneindia TeluguNews

సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. 1118 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపొందినట్లు వార్తలు రావడంతో కమలనాథులు సంబురాల్లో మునిగిపోయారు. ఓడిపోయిన టీఆర్ఎస్ సైతం ఓటర్ల తీర్పును శిరసావహిస్తామని చెప్పింది. కానీ ఫలితాలపై ఎన్నికల సంఘం మాత్రం ఊహించని ట్విస్ట్ ఇచ్చింది..

దుబ్బాక ఫలితంపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు -బీజేపీ పేరెత్తకుండా ప్రెస్‌మీట్ దుబ్బాక ఫలితంపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు -బీజేపీ పేరెత్తకుండా ప్రెస్‌మీట్

నాలుగు ఈవీఎంలను లెక్కించలేదు..

నాలుగు ఈవీఎంలను లెక్కించలేదు..


దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో ఇంకా నాలుగు ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కించాల్సి ఉందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) శవాంక్ గోయల్ మీడియాకు చెప్పారు. అందుకే అభ్యర్థి గెలుపుపై తాము ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదన్నారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఫలితాల ప్రక్రియపై మరిన్ని అంశాలు చెప్పారిలా..

చాలా బాధేస్తుంటుంది.. రఘన్నను పంపితే కేసీఆర్ భరతం పడతాం: దుబ్బాకలో రాజా సింగ్ కోరినట్లే ఫలితంచాలా బాధేస్తుంటుంది.. రఘన్నను పంపితే కేసీఆర్ భరతం పడతాం: దుబ్బాకలో రాజా సింగ్ కోరినట్లే ఫలితం

వీవీప్యాట్ స్లిప్పుల ద్వారా..

వీవీప్యాట్ స్లిప్పుల ద్వారా..


‘‘దుబ్బాక అసెంబ్లీ పరిధిలోని పోలింగ్ కేంద్రం 21, పోలింగ్ కేంద్రం 188కి సంబంధించి ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది. ఈ రెండు కేంద్రాల్లోని నాలుగు ఈవీఎంలలో 1669 ఓట్లు నిక్షిప్తం అయ్యాయి. అయితే సాంకేతిక సమస్యల కారణంగా వాటిని లెక్కించలేకపోయాం. దీంతో నాలుగు ఈవీఎంలకు చెందిన వీవీప్యాట్ స్లిప్పులను లెక్కిస్తున్నాం'' అని సీఈఓ వివరించారు. అంతేకాదు..

ఆ తర్వాతే అధికారిక ప్రకటన..

ఆ తర్వాతే అధికారిక ప్రకటన..

పోలింగ్ కేంద్రం 136, పోలింగ్ కేంద్రం 157/ఏ లోనూ మాక్ పోలింగ్ తర్వాత ఈవీఎంలను క్లియర్ చేయలేదని సీఈఓ చెప్పారు. నిబంధనల ప్రకారం ఓట్ల లెక్కింపును చేపడతామని, చివరి ఓటును కూడా గణించిన తర్వాత, అన్నీ సరి చూసుకుని విజేత ఎవరనేది అధికారికంగా ప్రకటిస్తామని సీఈఓ గోయల్ చెప్పారు. ప్రస్తుతం విజేతగా భావిస్తోన్న రఘునందన్ రావు మెజార్టీ కేవలం 1118 ఓట్లే కావడం, ఇంకా లెక్కించాల్సిన ఓట్లు 1669 ఉండటంతో ఫలితం తారుమారయ్యే అవకాశం ఉంటుందా? అనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఇదిలా ఉటే..

Recommended Video

Dubbaka Bypoll Result : BJP's M Raghunandan Rao Leads TRS' Solipeta Sujatha By 1,470
రౌండ్ రౌండ్‌కూ రీసౌండ్..

రౌండ్ రౌండ్‌కూ రీసౌండ్..


దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల్లో రౌండ్ రౌండ్ కు రీసౌండ్ పెరిగేలా, అభ్యర్థులు, ఏజెంట్ల దిమ్మతిరిగేలా ఫలితాలు మారుతూ వచ్చాయి. ఇప్పటిదాకా అందిన సమాచారం మేరకు రఘునందన్‌కు మొత్తం 62420 ఓట్లు రాగా, టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు 61302 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి 21819 ఓట్లు వచ్చాయి. మొత్తం 23 రౌండ్లలో కౌంటింగ్ నిర్వహించగా రౌండ్ల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి..

23వ రౌండ్‌లో బీజేపీ ఆధిక్యం

బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ : 1653 ఓట్లు

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాత : 1241 ఓట్లు

కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి : 580 ఓట్లు

22వ రౌండ్‌లో బీజేపీ‌ ఆధిక్యం

బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ : 2958 ఓట్లు

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాత : 2520 ఓట్లు

కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి : 971 ఓట్లు

21వ రౌండ్‌లో బీజేపీ ఆధిక్యం

బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ : 2428 ఓట్లు

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాత : 2048 ఓట్లు

కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి : 845 ఓట్లు

20వ రౌండ్‌లో బీజేపీ‌ ఆధిక్యం

బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ : 2931 ఓట్లు

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాత : 2440 ఓట్లు

కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి : 1058 ఓట్లు

19వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం

బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ : 2335 ఓట్లు

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాత : 2760 ఓట్లు

కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి : 976 ఓట్లు

18వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం

బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ : 2527 ఓట్లు

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాత : 3215 ఓట్లు

కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి : 852 ఓట్లు

17వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం

బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ : 1946 ఓట్లు

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాత : 2818 ఓట్లు

కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి : 1705 ఓట్లు

16వ రౌండ్‌ కౌంటింగ్‌

బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ : 2408 ఓట్లు

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాత : 3157 ఓట్లు

కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి : 674 ఓట్లు

15వ రౌండ్‌

బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ : 1500 ఓట్లు

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాత : 3027 ఓట్లు

కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి : 1500 ఓట్లు

14వ రౌండ్‌

బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ : 2249 ఓట్లు

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాత : 2537 ఓట్లు

కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి : 784ఓట్లు

13వ రౌండ్‌

బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ : 2540 ఓట్లు

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాత : 2824 ఓట్లు

కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి : 1212 ఓట్లు

12వ రౌండ్ ఫలితాలు

కాంగ్రెస్‌ : 2,080

బీజేపీ : 1997

టీఆర్ఎస్ : 1990 ఓట్లు

11వ రౌండ్‌ ఫలితాలు

బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ : 2965 ఓట్లు

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాత : 2766 ఓట్లు

కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి : 1883 ఓట్లు

పదో రౌండ్ ఫలితాలు ఇవీ

బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ : 2492 ఓట్లు

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాత : 2948 ఓట్లు

కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి : 899 ఓట్లు

తొమ్మిదవ రౌండ్ ఫలితాలు..

బీజేపీ అభ్యర్థి : 3413 ఓట్లు

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి : 2329 ఓట్లు

కాంగ్రెస్‌ అభ్యర్థి : 675 ఓట్లు

ఎనిమిదో రౌండ్ ఫలితాలు..

బీజేపీ అభ్యర్థి : 3116 ఓట్లు

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి : 2495 ఓట్లు

కాంగ్రెస్‌ అభ్యర్థి : 1122 ఓట్లు

ఏడో రౌండ్ ఫలితాలు..

బీజేపీ అభ్యర్థి : 2536 ఓట్లు

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి : 2718 ఓట్లు

కాంగ్రెస్‌ అభ్యర్థి : 749 ఓట్లు

ఆరో రౌండ్ ఫలితాలు..

బీజేపీ అభ్యర్థి : 3709 ఓట్లు

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి : 4062 ఓట్లు

కాంగ్రెస్‌ అభ్యర్థి : 530 ఓట్లు

ఐదో రౌండ్ ఫలితాలు..

బీజేపీ అభ్యర్థి : 3462 ఓట్లు

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి : 3126 ఓట్లు

కాంగ్రెస్‌ అభ్యర్థి : 566 ఓట్లు

నాలుగో రౌండ్ ఫలితాలు

బీజేపీ అభ్యర్థి : 3832 ఓట్లు

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి : 2407 ఓట్లు

కాంగ్రెస్‌ అభ్యర్థి : 227 ఓట్లు

మూడో రౌండ్ ఫలితాలు..

బీజేపీ అభ్యర్థి : 2731ఓట్లు

టీఆర్ఎస్ అభ్యర్థి : 2607 ఓట్లు

కాంగ్రెస్ అభ్యర్థి: 616ఓట్లు

సెకండ్ రౌండ్ ఫలితాలు..

బీజేపీ అభ్యర్థి : 3284ఓట్లు

టీఆర్ఎస్ అభ్యర్థి : 2490 ఓట్లు

కాంగ్రెస్ అభ్యర్థి: 667

ఫస్ట్ రౌండ్ ఫలితాలు..

బీజేపీ అభ్యర్థి : 3,208 ఓట్లు

టీఆర్ఎస్ అభ్యర్థి : 2,867 ఓట్లు

కాంగ్రెస్ అభ్యర్థి : 648 ఓట్లు

English summary
Telangana CEO Shashank Goyal told media on Tuesday that the EC has not yet officially announced the dubbing results. He said 1669 votes would be counted through VVPAT slips due to difficulties in EVMs. Goyal said the final result would be announced after that.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X