సిద్దిపేట వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దుబ్బాక ఫలితంపై ఈసీ డిక్లరేషన్ -రఘునందన్ మెజార్టీ మారింది -0.7% తేడాతో టీఆర్ఎస్ ఓటమి

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో రాజకీయ సంచలనాలకు వేదికగా మారిన సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ఫలితాలను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. మంగళవారం సాయంత్రానికే 1118 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపొందినట్లు వార్తలు రావడం, అన్ని పార్టీలూ ఫలితాలసై వరుస స్పందనలు తెలుపుతుండగా.. ఫలితాలపై ఈసీ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. నాలుగు ఈవీఎంలు ఇంకా లెక్కించాల్సి ఉందని, అప్పటిదాకా గెలుపు అధికారికం కాబోదని చెప్పింది. కాగా..

Recommended Video

Dubbaka Bypoll Result : BJP's M Raghunandan Rao Leads TRS' Solipeta Sujatha By 1,470

దుబ్బాక ఫలితంపై ఈసీ ట్విస్ట్ -అధికారికం కాదు -ఈవీఎంలలో లోపాలు -దిమ్మతిరిగేలా లెక్కలుదుబ్బాక ఫలితంపై ఈసీ ట్విస్ట్ -అధికారికం కాదు -ఈవీఎంలలో లోపాలు -దిమ్మతిరిగేలా లెక్కలు

రఘునందన్ మెజార్టీ 1079 ఓట్లు

రఘునందన్ మెజార్టీ 1079 ఓట్లు

దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల సమయంలో నాలుగు ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తాయని, అందులో 1669 ఓట్లు నిక్షిప్తమై ఉన్నాయని, మిషిన్లను తెరిచే వీలు లేకపోవడంతో వీవీప్యాట్ స్లిప్పుల ఆధారంగా కౌంటింగ్ కొనసాగిస్తామని డిప్యూటీ సీఈఓ తెలిపారు. ఎట్టకేలకు ఆ ప్రక్రియ పూర్తికావడంతో తుది ఫలితాన్ని అధికారికంగా ప్రకటించారు. రఘునందన్ రావు వాస్తవ మెజార్టీ 1079 ఓట్లుగా ఈసీ పేర్కొంది. అంతేకాదు..

ఇవీ ఫైనల్ నంబర్లు..

ఇవీ ఫైనల్ నంబర్లు..

దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 198807 ఓట్లు ఉండగా, ఈ ఉప ఎన్నికలో మొత్తం 164192 ఓట్లు పోలయ్యాయి. ఈసీ అధికారిక లెక్కల ప్రకారం బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు 63,352 ఓట్లు పడ్డాయి. టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సూజాతకు 62,273ఓట్లు లభించాయి. కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ చెరుకు శ్రీనివాసరెడ్డికి 22,196 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్లలో బండారు నాగరాజు(3,570 ఓట్లు) తప్ప మిగతా 20 మంది అభ్యర్థుల్లో ఏ ఒక్కరూ 2వేల పైచిలుకు ఓట్లను సాధించలేకపోయారు. దుబ్బాకలో నోటాకు 554 ఓట్లు పడ్డాయి.

బీహార్ ఫలితాల్లో సంచలనం: మజ్లిస్ పార్టీకి 5సీట్లు -నిర్ణాయక శక్తిగా ఓవైసీ -కట్టర్ కామెంట్లకు కౌంటర్బీహార్ ఫలితాల్లో సంచలనం: మజ్లిస్ పార్టీకి 5సీట్లు -నిర్ణాయక శక్తిగా ఓవైసీ -కట్టర్ కామెంట్లకు కౌంటర్

0.7శాతం తేడాతో ఓటమి..

0.7శాతం తేడాతో ఓటమి..

రౌండు రౌండుకూ ఆధిపత్యం మారుతూ చివరికి దుబ్బాక బీజేపీ వశం అయిపోయింది. ఈసీ లెక్కల ప్రకారం మొత్తం పోలైన ఓట్లలో బీజేపీకి 38.47శాతం ఓట్లు, టీఆర్ఎస్ కు 37.82 శాతం, కాంగ్రెస్ కు 13.48 శాతం ఓట్లు లభించాయి. అంటే కేవలం 0.7 శాతం ఓట్ల తేడాతో టీఆర్ఎస్ ఓటమిపాలైంది. దీనికి తానే బాధ్యత వహిస్తానని మంత్రి హరీశ్ రావు ప్రకటించుకున్నారు. దుబ్బాక ఫలితంపై సీఎం కేసీఆర్ స్పందించలేదు.

English summary
telangana chief election officer (ceo) office officially declares dubbaka assembly by election 2020 result. the bjp candidate raghunandan rao won with 1079 votes majority. the vote percentage between bjp and trs is only 0.07 %.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X