సిద్దిపేట వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హరీష్ రావు సైలెంట్‌గా ఏమి లేడు.. ఏం చేస్తుండో నిన్న బయటపడిందిగా..!

|
Google Oneindia TeluguNews

సిద్ధిపేట : టీఆర్ఎస్‌లో కేసీఆర్ తర్వాత హరీష్ రావుదే కీ రోల్. ఎవరు ఔనన్నా, కాదన్నా.. చాలామంది ఇదే నిజమంటారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానం మొదలు మామ కేసీఆర్‌కు వెన్నంటి ఉన్న అల్లుడిగా హరీష్ రావు ప్రస్థానం అందరికి తెలుసు. అయితే రెండో సారి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. హరీష్ రావుకు మంత్రి పదవి దక్కకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. దాంతో ఎన్నో రకాల కామెంట్లు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి.

హరీష్ రావుకు అన్యాయం జరిగిందా.. హరీష్ రావు పార్టీ మారుతున్నారా.. ఇలాంటి ఎన్నో ఊహాగానాలు పుకార్లుగా షికారు చేశాయి. కానీ, వాటన్నింటినీ ఆయన ఖండిస్తూ వస్తున్నారు. మరోవైపు తన పని తాను సైలెంట్‌గా చేసుకుంటూ ముందుకెళుతున్నారు. ఆ క్రమంలో ఆయన క్షేత్రస్థాయిలో ఏం చేస్తున్నారనేది నిన్న తేలిపోయింది.

హరీష్ రావు రూటే సెపరేటు..!

హరీష్ రావు రూటే సెపరేటు..!

అభివృద్దిలో సిద్దిపేట తెలంగాణకు తలమానికంగా నిలుస్తోంది. అన్నిరంగాల్లో అతివేగంగా వృద్ది సాధిస్తూ శభాష్ అనిపించుకుంటోంది. అయితే దాని వెనుక మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఎనలేని కృషి దాగుంది. తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేటను నెంబర్ వన్ గా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్నారు.

విద్యారంగం అభివృద్ధి సాధిస్తే అన్ని రంగాలు ముందుకెళతాయని భావిస్తారు హరీష్ రావు. ఆ క్రమంలో పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అప్పట్లో లేఖలు రాశారు. మంచి ఫలితాలు సాధించాలని కోరుతూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. అయితే ఆయన ఆశయాలకు అనుగుణంగా పదవ తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా రెండో స్థానం సాధించడం విశేషం.

హైదరాబాద్‌లో ప్లాట్లు కొంటున్నారా.. జర భద్రం.. అక్రమ లే అవుట్లతో పరేషాన్..!హైదరాబాద్‌లో ప్లాట్లు కొంటున్నారా.. జర భద్రం.. అక్రమ లే అవుట్లతో పరేషాన్..!

టాప్ 2.. హరీష్ రావు చొరవ..!

టాప్ 2.. హరీష్ రావు చొరవ..!

తెలంగాణ పదవ తరగతి ఫలితాల్లో 92.43 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 93.68 శాతం ఉత్తీర్ణతతో బాలికలు పైచేయి సాధించారు. బాలురు 91.18 శాతం పాస్ అయ్యారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా 99.73 శాతం ఉత్తీర్ణత సాధించి జగిత్యాల జిల్లా మొదటిస్థానంలో నిలవగా.. 99.33 శాతంతో సిద్దిపేట జిల్లా రెండో స్థానం కైవసం చేసుకుంది. జస్ట్ 0.4 శాతం తేడాతో ఫస్ట్ ప్లేస్ మిస్సయింది.

2016-17 లో సిద్దిపేట జిల్లాకు 9వ స్థానం దక్కింది. ఆ తర్వాత 2017-18 అకాడమిక్ ఇయర్ కు గాను 3వ స్థానం లభించింది. ఈసారి రెండో స్థానం కైవసం చేసుకుంది. అలా క్రమక్రమంగా పదవ తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా సత్తా చాటుతుందంటే దానికి కారణం హరీష్ రావు అంటారు స్థానికులు.

హరీష్ రావు లేఖ.. 10/10 వస్తే 25 వేల నజరానా

హరీష్ రావు లేఖ.. 10/10 వస్తే 25 వేల నజరానా

పదవ తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా టాప్ లో నిలవాలన్న హరీశ్ రావు ప్రయత్నం సఫలీకృతమైంది. పరీక్షలకు ముందు అందర్నీ నేరుగా కలవలేని పరిస్థితుల్లో.. జిల్లాలోని ప్రతి పదవ తరగతి విద్యార్థి కుటుంబాలకు పోస్టు ద్వారా లేఖలు పంపించారు. పదవ తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా నూటికి నూరు శాతం ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. 10/10 జీపీఏ సాధిస్తే పర్సనల్ గా 25వేల రూపాయల చొప్పున నజరానా ఇస్తానని ప్రకటించారు.

తల్లిదండ్రులకు హరీష్ రావు సూచనలు

తల్లిదండ్రులకు హరీష్ రావు సూచనలు

విద్యార్థుల తల్లిదండ్రులకు రాసిన ఆ లేఖల్లో పలు అంశాలు ప్రస్తావించారు హరీష్ రావు. విద్యార్థులు చదువుపై దృష్టి కేంద్రీకరించాలంటే ఇంటి పరిస్థితులు సహకరించేలా చూడాలని కోరారు. పరీక్షలు పూర్తయ్యేంత వరకు టీవీలు కట్టేయాలని సూచించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిని ప్రోత్సహించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

పరీక్షల సమయంలో విందులు, వివాహాలకు వెళదామంటూ పిల్లలను ఇబ్బంది పెట్టొద్దని.. నెల రోజులు సక్రమంగా స్కూలుకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయులతో తమ పిల్లల చదువులకు సంబంధించి ఆరా తీస్తూ పరీక్షలకు వారిని మానసికంగా సిద్ధం చేయాలని సూచించారు.

సీఎం కేసీఆర్ చొరవ.. జూరాలకు చేరుతున్న కృష్ఱా జలాలుసీఎం కేసీఆర్ చొరవ.. జూరాలకు చేరుతున్న కృష్ఱా జలాలు

 ప్రత్యేక శ్రద్ధ.. 13 నుంచి 2వ స్థానానికి..!

ప్రత్యేక శ్రద్ధ.. 13 నుంచి 2వ స్థానానికి..!

పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించిన హరీష్ రావు.. సాయంత్రం పూట స్పెషల్ క్లాసులు నిర్వహించేలా అధికారులను సన్నద్ధం చేశారు. ఆ మేరకు సాయంకాలం విద్యార్థులకు అల్పాహారం, స్నాక్స్ అందించడానికి ప్రత్యేక నిధులు కూడా విడుదల చేశారు. అలా పదవ తరగతి ఫలితాల్లో జిల్లాను మొదటి స్థానంలో నిలిపేందుకు తీవ్రంగా శ్రమించారు.

గతంలో పదవ తరగతి ఫలితాల్లో 13వ స్థానంలో ఉన్న జిల్లాను క్రమక్రమంగా గతేడాది మూడో స్థానానికి తీసుకురావడంలో హరీష్ రావు కృషి ఎంతైనా ఉంది. అయితే ఈసారి మొదటి స్థానం దక్కాలని ఆయన అనుకున్న లక్ష్యానికి దగ్గరగా రెండవ స్థానంలో నిలిచింది. మొత్తానికి వచ్చే ఏడాదైనా ఆయన లక్ష్యానికి అనుగుణంగా సిద్దిపేట జిల్లా మొదటిస్థానంలో నిలవాలని ఆశిద్దాం.

English summary
Siddipet Performs Well Devolopment in All Categories. MLA Harish Rao take step forward to develop the siddipet. He believes, if education department improves, all areas will improve as well. He wrote the letters for all the ssc students before the exams to stand in first place. As per ssc results, siddipet stood in second place.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X