• search
  • Live TV
సిద్దిపేట వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

హరీశ్ రావు కొత్త స్కెచ్.. ఆ ఇలాకాలో అలా.. అక్కడే ఎక్కువగా ఎందుకో తెలుసా?

|

సిద్ధిపేట : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు నియోజకవర్గానికే పరిమితమయ్యారా? రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఆయనకు మంత్రి పదవి దక్కకపోవడంతో తన నియోజకవర్గాన్ని అభివృద్దిలో పరుగులు పెట్టించేందుకు మరింత శ్రమిస్తున్నారా? ఇప్పటికే సిద్దిపేట జిల్లాను వివిధ రంగాల్లో ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దిన హరీశ్ రావు సిద్ధిపేటకు మరింత సొబగులు అద్దేందుకు ప్రయత్నిస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలకు తాజా పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. ఇటీవల ఎక్కువ సమయం సిద్దిపేటలోనే ఉంటూ అభివృద్ధికి బాటలు వేస్తున్నారు హరీశ్ రావు.

ఆదర్శవంతమైన సెగ్మెంట్‌గా తీర్చిదిద్దుతూ..! బిజీబిజీ

ఆదర్శవంతమైన సెగ్మెంట్‌గా తీర్చిదిద్దుతూ..! బిజీబిజీ

సిద్దిపేట నియోజకవర్గం అభివృద్దిలో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే హరీశ్ రావు క‌ృషి అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో ఆదర్శవంతమైన సెగ్మెంట్‌గా తీర్చిదిద్దారు. సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేయడంతో పాటు వివిధ అభివృద్ది పనుల్లో పరుగులు పెట్టిస్తున్నారు. అయితే టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. దాంతో ఆయన ఎక్కువగా నియోజకవర్గానికి పరిమితమవుతున్నట్లు కనిపిస్తోంది. అంతేకాదు నియోజకవర్గంలో పాలు కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ మరింత అభివృద్ది చేసే దిశగా ముందుకెళుతున్నారనే విషయం స్పష్టమవుతుంది.

తెలంగాణలో మహారాష్ట్ర ఎస్సై రచ్చ.. తుపాకీతో హల్‌చల్.. చివరకు..! (వీడియో)

సోషల్ మీడియా వద్దు.. చదువు, ఆటలే ముద్దు.. హరీశ్ రావు పిలుపు

సోషల్ మీడియా వద్దు.. చదువు, ఆటలే ముద్దు.. హరీశ్ రావు పిలుపు

సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని స్టేడియంలో గురువారం నాడు జిల్లా అథ్లెటిక్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో 6వ జిల్లా స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఎంపికకు సంబంధించిన కార్యక్రమం జరిగింది. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే హరీశ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్ధిపేట జిల్లా నుంచి క్రీడాకారులు మరింత రాణించాలని ఆకాంక్షించారు. ఆటల్లో చక్కని ప్రతిభ కనబర్చి రాష్ట్ర క్రీడాకారులుగా ఎదిగి సిద్దిపేట సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఆ క్రమంలో బాగా చదవండి. బాగా ఆడండి.. సోషల్ మీడియా కారణంగా మీ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు.

 విద్య, వైద్యంలో టాప్.. క్రీడల్లో కూడా రాణిస్తే..!

విద్య, వైద్యంలో టాప్.. క్రీడల్లో కూడా రాణిస్తే..!

సిద్ధిపేట జిల్లా విద్య, వైద్యంతో పాటు అన్నిరంగాల్లో రాణిస్తోందని చెప్పుకొచ్చారు హరీశ్ రావు. మొన్నటి పదవ తరగతి పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం పొందామని, అదే తరహాలో క్రీడల్లో కూడా సత్తా చాటి మొదటి స్థానం కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సిద్ధిపేటలో స్విమ్మింగ్ ఫూల్ నిర్మించినట్లు తెలిపారు. ఫుట్ బాల్ కోర్ట్, బాస్కెట్ బాల్ కోర్టు, ఇండోర్ షెడ్, హ్యాండ్ బాల్, జిమ్‌లను ఏర్పాటు చేశామని, వాటిని యువత సద్వినియోగం చేసుకునేలా పీఈటీలు చొరవ చూపాలని సూచించారు.

పీఈటీల కోరిక మేరకు అథ్లెటిక్స్ ట్రాక్ ను త్వరలోనే పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేస్తానని హమీ ఇచ్చారు హరీశ్ రావు. మూడేళ్లుగా జిల్లా అథ్లెటిక్స్ టోర్నీ నిర్వహించడం గొప్ప విషయమని ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందించారు. ఆ క్రమంలో 6వ జూనియర్ స్థాయి అథ్లెటిక్స్ టోర్నమెంట్ జరుపుకోవడం గర్వకారణమని అన్నారు. ఇప్పటికే సిద్ధిపేట జిల్లా నుంచి 28 మంది క్రీడాకారులు జాతీయ స్థాయికి వెళ్లడం అభినందనీయమని.. ఇకపై కూడా మరింత మంతి క్రీడాకారులు తయారుకావాలని ఆకాంక్షించారు.

రేవంత్ రెడ్డి గరం.. గరం..! ఫోన్లు కూడా లిఫ్ట్ చేయరా.. జీహెచ్ఎంసీ అధికారులకు క్లాస్..!!

ఆరోగ్య సిద్ధిపేటకు సహకరించండి.. ఫిట్‌నెస్‌ ముఖ్యం..!

ఆరోగ్య సిద్ధిపేటకు సహకరించండి.. ఫిట్‌నెస్‌ ముఖ్యం..!

అన్ని రంగాల్లో దూసుకెళుతున్న సిద్దిపేట జిల్లాను ఆరోగ్యం విషయంలోనూ నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతామన్నారు. ఆ మేరకు ఆరోగ్య సిద్ధిపేటకు పీఈటీలు సహకరించాలని కోరారు. వారు చొరవ తీసుకుని ప్రతి పౌరుడు ఆరోగ్యవంతంగా ఉండేలా.. యోగా, వాకింగ్‌కు అలవాటుపడేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆరోగ్య సిద్ధిపేట కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులను భాగస్వామ్యం చేస్తూ చైతన్యం కలిగించాలని సూచించారు. త్వరలోనే పీఈటీలతో సమావేశమై ఆరోగ్య సిద్ధిపేటగా తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన ప్రణాళికలపై సమీక్షిస్తానని తెలిపారు. ఏకాగ్రత పెంచడంలో ఫిజికల్ ఫిట్‌నెస్ చాలా ఉపయోగపడుతుందన్న హరీశ్ రావు.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం మంచిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

ఒక్కో రంగంపై దృష్టి పెడుతూ క్రమక్రమంగా సిద్దిపేటను మరింత ఆదర్శవంతంగా తీర్చిదిద్దేలా ఆయన శ్రమిస్తున్నారనే విషయం అర్థమవుతోంది. అందుకేనేమో ఇటీవల నియోజకవర్గానికి ఎక్కువ సమయమిస్తూ అభివృద్ధిపరంగా సిద్దిపేట మెరిసేలా మరింత కృషి చేస్తున్నారు.

English summary
Is the former minister, Siddipet MLA Harish Rao confined to the constituency? Is Harish Rao working hard to put his constituency in development after the TRS comes to power for a second term without minister post? Harish Rao, who has already made the Siddipet district ideal in various fields, is trying to make it more elegant? The latest developments in siddipet answer such questions. Harish Rao has been spent his time in siddipet to process the siddipet development.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more