సిద్దిపేట వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ మాటకు కట్టుబడి ఉన్నా... కేసీఆర్‌ను ఎక్కడికి పంపాలో అక్కడికే.. : రఘునందన్ రావు

|
Google Oneindia TeluguNews

దుబ్బాక గెలుపు బీజేపీ గెలుపు అని... అణగారిన వర్గాల గెలుపు అని ఎమ్మెల్యే రఘునందన్ రావు అభిప్రాయపడ్డారు. దుబ్బాక పొరుగునే ఉన్న కేసీఆర్,హరీశ్ రావు,కేటీఆర్‌ల మధ్య నుంచి తాను గెలిచి వచ్చానన్నారు. ఏ ఆశతో,ఆకాంక్షలతో దుబ్బాక ప్రజలు తనను గెలిపించారో.. ఆ ఆశయ సాధన కోసం తాను పనిచేస్తానన్నారు. తన చివరి రక్తపు బొట్టు వరకూ దుబ్బాక ప్రజల కోసం పనిచేస్తానన్నారు. న్యాయంగా,రాజ్యాంగబద్దంగా తనపై పెట్టిన తప్పుడు కేసులన్నింటిలోనూ గెలుస్తామన్నారు. సోమవారం(నవంబర్ 16) మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో రఘునందన్ రావు మాట్లాడారు.

Recommended Video

Dubbaka MLA Raghunandan Rao : లాయర్ To MLA | TRS లో బహిష్కరణ కు గురై... | Oneindia Telugu
ఆ ప్రశ్నకు సమాధానం లేదు...

ఆ ప్రశ్నకు సమాధానం లేదు...

ఒక చిన్న కంట్రిబ్యూటర్ స్థాయి నుంచి తాను జీవితాన్ని ప్రారంభించానని.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుష్కర కాలం పోరాడానని రఘునందన్ రావు పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ తనను రాత్రికి రాత్రే పార్టీ నుంచి బహిష్కరించిందని.. కారణాలేంటని అడిగితే ఇప్పటికీ సమాధానం లేదన్నారు. బహుశా ఇకముందు కూడా వారి వైపు నుంచి దానికి సమాధానం ఉండబోదన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత దేశానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో బీజేపీలో చేరినట్లు తెలిపారు. ఎవరైనా ఒక వ్యక్తి వరుసగా మూడు ఎన్నికల్లో పోటీ చేయడం మామూలు విషయం కాదని.. అలాంటిది వరుసగా తాను 3 ఎన్నికల్లో పోటీ చేశానని చెప్పారు.

ఏ గాడ్ ఫాదర్ లేకపోయినా...

ఏ గాడ్ ఫాదర్ లేకపోయినా...

'ప్రతీ చోటా తప్పుడు కేసు... ప్రతీ చోటా తప్పుడు ప్రచారం.. సంబంధం లేని చోట్ల డబ్బు దొరికినా... అది రఘునందన్ రావుదేనని కొంతమంది అత్యుత్సాహంతో వార్తలు రాశారు. వ్యక్తిగా మీరు రఘునందన్ రావును ఇష్టపడుతారో.. కష్టపడుతారో... కానీ ఇకనైనా వార్తను వార్తగా రాయండి. మీ వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తిగత అభిప్రాయాలు గానే రాసుకోండి. చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిని నేను. వెనుకా.. ముందు ఎవరు లేకున్నా... ఏ గాడ్ ఫాదర్ లేకపోయినా.. నమ్మిన సిద్దాంతం కోసం పోరాడితే... అనుకున్న లక్ష్యాన్ని సాధించి తీరుతాం. దానికి దుబ్బాక ఫలితమే ఉదాహరణ.' అని రఘునందన్ రావు చెప్పుకొచ్చారు.

ఆ మాటకు కట్టుబడి ఉన్నా...

ఆ మాటకు కట్టుబడి ఉన్నా...

2013లో టీఆర్ఎస్ పార్టీ తనను బహిష్కరించినప్పుడు... ఆనాడు టీఆర్ఎస్ అధ్యక్షుడుగా ఉన్న కేసీఆర్‌కు ఒక మాట చెప్పానని ఆ మాటకు కట్టుబడి ఉన్నానని అన్నారు. ఒక వజ్రాన్ని కోయాలంటే... మరో వజ్రం మాత్రమే కోయగలుగుతుందని ఆనాడు కేసీఆర్‌తో చెప్పానన్నారు. 'పదవులు ఉన్నా.. లేకపోయినా.., రాజకీయంగా ఎదిగినా.. ఎదగకపోయినా.. ఇంతకన్నా ఉన్నత పదవులు వచ్చినా.. రాకపోయినా.. నాకున్న నల్లకోటు.. చంద్రశేఖర్‌ రావుగారిని ఎక్కడికి పంపాలో.. అక్కడికి పంపడానికి ఉపయోపగపడుతుంది. భగవంతుడు ఆశీర్వదించాడు... కార్యకర్తలు బలం ఇచ్చారు.. కేసీఆర్ కూర్చున్న అసెంబ్లీకి వెళ్తున్నాను.. కచ్చితంగా నూటికి నూరు శాతం 2013లో నేను ఏ మాట చెప్పానో.. ఆ మాటకు కట్టుబడి ఉన్నాను. అది జరిగి తీరుతుంది.' అని రఘునందన్ రావు తేల్చి చెప్పారు.

కచ్చితంగా నిధులు తీసుకెళ్తా...

కచ్చితంగా నిధులు తీసుకెళ్తా...


టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి దుబ్బాకకు ఎలా నిధులు తీసుకెళ్తారన్న ప్రశ్నకు.. ఒకప్పుడు హరీశ్ రావు అసెంబ్లీలో చెప్పిన మాటలను రఘునందన్ రావు గుర్తుచేశారు. 'నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్లు... అప్పట్లో హరీశ్ రావు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌ రెడ్డిని.. మీరు చిత్తూరుకే ముఖ్యమంత్రా.. లేక రాష్ట్రానికి ముఖ్యమంత్రా అని అడిగారు. ఇప్పుడు కేసీఆర్‌ గారిని మీరు గజ్వేల్‌కే ముఖ్యమంత్రా అని ప్రశ్నిస్తా.' అన్నారు రఘునందన్ రావు. దుబ్బాక ఉపఎన్నిక స్పూర్తితో గ్రేటర్ ఎన్నికల్లో పనిచేస్తామన్నారు.

English summary
Dubbaka BJP MLA Raghunandan Rao said Dubbaka victory is people's victory and BJP victory.He asserted he did't have any personal agenda other than party's agenda. He said till his last breathe he will serve for dubbaka people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X