• search
  • Live TV
సిద్దిపేట వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మంత్రి హరీష్ ఇలాకాలో అమానుషం .. మహిళను స్తంభానికి కట్టేసి, రాళ్ళు , చెప్పులతో కొట్టి

|

శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతున్న నేటి రోజుల్లోనూ ఇంకా అమానవీయ ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. నాగరికత ముసుగులో అనాగరికత రాజ్యమేలుతుంది . ఏవైనా భూ తగాదాలు ఉంటె చట్టపరంగా చూసుకోవాల్సింది పోయి దాడులకు పాల్పడుతున్న ఘటనలు మనుషుల్లో పెరుగుతున్న నేర ప్రవృత్తికి అద్దం పడుతున్నాయి. ఇక అలాంటి ఘటనే తెలంగాణా రాష్ట్రంలో జరిగింది.

పొలానికి సంబంధించి దారి వివాదం.. మహిళపై అమానుషం

పొలానికి సంబంధించి దారి వివాదం.. మహిళపై అమానుషం

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం పోతిరెడ్డిపల్లిలో తండాలో చోటు చేసుకున్న ఈ అమానుష ఘటన సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేసింది. సాక్షాత్తు మంత్రి హరీష్ రావు నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే పోతిరెడ్డిపల్లి తండాలో ఒక పొలానికి సంబంధించి దారి వివాదంలో జ్యోతి అనే మహిళను స్థంబానికి కట్టేసి చెప్పులతో కొట్టి చాలా అమానుషంగా ప్రవర్తించారు అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు.

 వ్యవసాయ బావులకు వెళ్లే దారి విషయంలో తరచూ ఘర్షణలు

వ్యవసాయ బావులకు వెళ్లే దారి విషయంలో తరచూ ఘర్షణలు

లక్ష్మీపురం గ్రామానికి చెందిన హంస, స్వరూప, రమ అనే ముగ్గురు మహిళలకు పోతిరెడ్డిపల్లి తండాలో వ్యవసాయ భూములు ఉన్నాయి. అయితే అందులోకి వెళ్లే దారి విషయంలో జ్యోతితో వారికి గొడవ జరిగింది. వ్యవసాయ బావులకు వెళ్లే దారి విషయమై తరచూ గొడవలకు దిగే వీరు ఆ కోపాన్ని మనసులో పెట్టుకుని సదరు మహిళలు వారి, వారి భర్తలకు జ్యోతిపై ఫిర్యాదు చేశారు. ఎలాగైనా ఆమెకు బుద్ధి చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే వారు అమానుషానికి దిగారు.

జ్యోతి అనే మహిళను స్తంభానికి కట్టేసి కొట్టిన దారుణ ఘటన

జ్యోతి అనే మహిళను స్తంభానికి కట్టేసి కొట్టిన దారుణ ఘటన

గురువారం సాయంత్రం ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న జ్యోతిని గమనించారు. అనంతరం కృష్ణ అనే వ్యక్తి సాయంతో జ్యోతిని బలవంతంగా ట్రాక్టర్‌లో ఎక్కించుకొని లక్ష్మీపూర్‌కు తీసుకెళ్ళి రెచ్చిపోయిన ముగ్గురు మహిళల భర్తలు జ్యోతిని గ్రామములోని నడి బజారులో స్థంభానికి కట్టేసి కొట్టారు. చెప్పులతో, రాళ్ళతో ఆమెపై దాడి చేశారు. నోటికొచ్చినట్టు తిట్టిపోశారు. ఎవరు ఎంత చెప్పినా వినకుండా అమానుషంగా ప్రవర్తించారు.

జ్యోతిని విడిపించిన పోలీసులు .. కేసు నమోదు

జ్యోతిని విడిపించిన పోలీసులు .. కేసు నమోదు

బాధితురాలి కుంటుంబ సభ్యులు 100కి కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో స్థానిక పోలీసులు జ్యోతిని విడిపించారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం బాధితురాలి భర్త శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు హంస, కృష్ణ, కైలు, రమ, స్వరూప, శంకర్ లపై కేసులు నమోదు చేశారు పోలీసులు.

English summary
This inhumane incident which taken place in Potireddypalli Tanda in Koheda Mandal of Siddipeta district has caused the society to face shame. In the course of this incident in the constituency of Minister Harish Rao, Jyothi, a woman in the village of Potireddipalli Thanda, was tied to a pillar and beaten up with stones and chappal as she was involved in a dispute with some people in the village.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more