• search
 • Live TV
సిద్దిపేట వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఆ తప్పుకు ప్రాయశ్చిత్తంగా .. 50 లక్షలు జరిమానా వేసుకున్న మంత్రి హరీష్ రావు

|
  Minister Harish Rao Fined Himself With Rs.50 Lakh| రూ50లక్షలు జరిమానా విధించుకున్న మంత్రి హరీష్ రావు

  తన్నీరు హరీష్ రావు టిఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలకమైన విలక్షణమైన నేత. ప్రస్తుతం తెలంగాణా ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగుతున్న తన్నీరు హరీష్ రావు మంచి నిబద్ధత ఉన్న నాయకుడని అందరూ అంటుంటారు. అలాంటి హరీష్ రావు తప్పు చేశారు. అందుకు ఆయనకు ఆయనే జరిమానా కూడా విధించుకున్నారట.. ఇక ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 లక్షల రూపాయల జరిమానా విధించుకున్నారు తెలంగాణ ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు .

  ప్లీజ్ నన్ను హైదరాబాద్ లో కలవొద్దు..! ఇబ్బందికర పరిస్థితి ఉంటుందన్న హరీష్ రావు..!

  దుబ్బాకలో మెప్మా రుణాల పంపిణీ కార్యక్రమానికి ఆలస్యంగా వెళ్ళిన హరీష్ రావు

  దుబ్బాకలో మెప్మా రుణాల పంపిణీ కార్యక్రమానికి ఆలస్యంగా వెళ్ళిన హరీష్ రావు

  ఇంతకీ హరీష్ రావు చేసిన తప్పేంటి? ఆయన ఎందుకు జరిమానా విధించుకున్నారు?అంటే తన్నీరు హరీష్ రావు తన సొంత జిల్లా అయిన సిద్దిపేటలో ఒక కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాకలో మంత్రి హరీష్ రావు మహిళలకు మెప్మా రుణాలు అందించటానికి, చెత్త బుట్టల పంపిణీ చేయడానికి నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. అయితే ఉదయం 11 గంటల 30 నిమిషాలకు మంత్రి హరీశ్‌ రావు ఆ కార్యక్రమంలో పాల్గొని, అక్కడ నిర్వహిస్తున్న సభలో మహిళలను ఉద్దేశించి మాట్లాడతారు అన్న షెడ్యూల్ ప్రకారం మహిళలందరూ హరీష్ రాక కోసం ఎదురు చూశారు.

  నాలుగు గంటలపాటు ఎదురుచూసిన మహిళలకు క్షమాపణలు చెప్పిన మంత్రి

  నాలుగు గంటలపాటు ఎదురుచూసిన మహిళలకు క్షమాపణలు చెప్పిన మంత్రి

  కానీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తో కలిసి సభాస్థలికి చేరుకునేసరికి మధ్యాహ్నం 3. 30 నిమిషాలు అయ్యింది. సభకు రాగానే ఉదయం పదకొండున్నర నుండి తన రాక కోసం ఎదురు చూస్తున్న మహిళలకు మంత్రి హరీష్ రావు క్షమాపణ చెప్పారు. నాలుగు గంటలు ఆలస్యంగా వచ్చినందుకు మన్నించమని అడిగారు. అంతేకాదు తనకు తాను, తాను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా జరిమానా కూడా విధించుకున్నారు. తన కోసం ఎదురుచూస్తున్న మహిళలతో ఆలస్యానికి క్షమించమని, పరిహారంగా తనకు జరిమానా విధించమని కోరారు మంత్రి హరీష్ రావు.

  పరిహారం చెల్లిస్తానన్న మంత్రిని మహిళా భవనం కావాలని కోరిన మహిళలు

  పరిహారం చెల్లిస్తానన్న మంత్రిని మహిళా భవనం కావాలని కోరిన మహిళలు

  అయితే మహిళలు మహిళా భవనం కోసం నిధులు మంజూరు చేయాలని మంత్రిని విజ్ఞప్తి చేశారు. దీంతో హరీష్ రావుమహిళా భవన నిర్మాణానికి యాభై లక్షలు మంజూరు చేయిస్తానని చెప్పి తనకు తాను పరిహారం చెల్లించుకుంటున్నట్టు ప్రకటించారు. ఇక ఈ బాధ్యత తనకు తాను జరిమానాగా విధించుకున్నానని సభా ముఖంగా తెలిపారు హరీష్ రావు. ఇక మహిళలకు హామీ ఇచ్చింది తడవుగా వెంటనే ఈఎన్‌సీ కృష్ణారావుతో ఫోన్లో మాట్లాడి నిధులను మంజూరు చేయించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు.

   మహిళా భవన నిర్మాణానికి 50 లక్షలు ... పరిహారం చెల్లిస్తానన్న మంత్రి

  మహిళా భవన నిర్మాణానికి 50 లక్షలు ... పరిహారం చెల్లిస్తానన్న మంత్రి

  ఏది ఏమైనా ఆలస్యంగా వచ్చినా పరిహారంగా తాము కోరిన మహిళా భవనాన్ని మంజూరు చేసిన హరీష్ రావు కు మహిళలు కృతజ్ఞతలు చెబుతున్నారు. మంచి మనసున్న మారాజు మా హరీష్ రావు అంటున్నారు. హరీష్ రావు వైఖరిని స్థానికులు తెగ పొగుడుతున్నారు. మేం వచ్చేదాకా వెయిట్ చెయ్యరా అన్న అహంకారం చూపించే నేతలు ఉన్న నేటి రోజుల్లో ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నేత హరీష్ అని తెగ మెచ్చుకుంటున్నారు. ఇలాంటి నిబద్దత కలిగిన నేతలు ఎంతమంది ఉంటారని కితాబిస్తున్నారు . తన నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు పరిష్కారానికి ఎప్పుడూ ముందుంటారని చెప్పుకుంటున్నారు.

  English summary
  Tanniru Harish Rao, who is currently the Minister of Finance for Telangana, is a well-known leader. Harish Rao made such a mistake. Telangana Finance Minister Taniru Harish Rao has been fined Rs. 50 lakh for his mistake . he came to a program in Dubbaka to distribute MEPMA loans to women four hours late and he fined himself with 50 lakhs .
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
  X