సిద్దిపేట దోపిడీ కేసు ఛేజ్: 4 నిందితుల అరెస్ట్, బైక్ కూడా వారిది కాదట, ఎందుకు చేశారంటే
ఈజీ మనీకి అలవాటు పడి కొందరు దోపిడీలకు పాల్పడుతున్నారు. ఇటీవల సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు వద్ద జరిగిన ఘటన కలకలం రేపింది. ఒకటి కాదు రెండు కాదు రూ.43.50 లక్షలను కాజేశారు. ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. ఎట్టకేలకు పోలీసులు కేసును ఛేజ్ చేశారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు.

ఇలా దోపిడీ..
సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు వద్ద నగదు బదిలీలు చేస్తుంటారు. కొన్నవారి అమ్మినవారికి డబ్బులు ఇస్తుంటారు. దీనిని టార్గెట్ చేసుకున్న కొందరు దుండగులు అలా వచ్చి ఇలా డబ్బులను దోచుకుపోతుంటారు. అడ్డం వస్తే తుపాకీతో బెదిరిస్తారు. కాల్పులు జరుపుతారు. అలా సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద కాల్పులు జరిపి నగదు దోచుకుపోయిన నిందితుల్లో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.34 లక్షల నగదుని రికవరీ చేసామని..వారిపై కేసులు నమోదు చేసిన కోర్టులో హాజరుపరిచామని సీపీ శ్వేత తెలిపారు.

పక్కా ప్లాన్
ప్లాన్ ప్రకారమే దోపిడీ చేశారని తెలిపారు. అప్పులు చేసి వాటిని తీర్చటం కోసం ఇలా దోపిడీలు చేస్తున్నారని తెలిపారు. సిద్ధిపేట సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద కారు డ్రైవర్‌పై కాల్పులు జరిపి భారీగా నగదు దోచుకెళ్లిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. కారు డ్రైవర్ని తుపాకీతో కాల్చి నిందితులు కారులో ఉన్న రూ.43.50 లక్షల నగదు దోపిడీ చేశారు. సీరియస్‌గా తీసుకున్న పోలీసులు 15 స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలించి పట్టుకున్నారు.

43.50 లక్షలు చోరీ
జనవరి 31న సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారు డ్రైవర్‌పై కాల్పులు జరిపి కారులో ఉన్న రూ.43.50 లక్షలు దోచుకెళ్లారు. ప్రధాని నిందితుడు సాయి.. అతనికి సహకరించిన మరో ముగ్గురిని అరెస్టు చేశామని సీపీ చెప్పారు. నిందితులు వాడిన తుపాకీపై ఆరా తీస్తున్నామని వివరించారు. దోపిడీ ఘటనలోవాడిన బైక్ కూడా వారిది కాదని.. దానిని మరోచోటి నుంచి దొంగిలించి తెచ్చారని తెలిపారు.

ఇలా దోపిడీ
ఫ్లాట్
రిజిస్ట్రేషన్
ఉండగా
నర్సయ్య
రిజిస్ట్రేషన్
ఆఫీసుకు
వచ్చారు.
కారులో
డ్రైవర్
కూర్చొని
ఉండగా
అద్దాలు
పగలగొట్టి
డబ్బులు
ఎత్తుకుని
వెళ్లినట్లు
రియల్టర్
నర్సయ్య
చెప్పారు.
ఘటనా
స్థలానికి
సీపీ
వచ్చారు.
వెంటనే
రంగంలోకి
పోలీసులు
దిగారు.
ఆ
ఇద్దరు
పట్టుకునే
పనిలో
బిజీగా
ఉన్నారు.
నగదను
తీసుకెళ్లింది
ఎవరూ...
రిజిస్ట్రేషన్
అవుతుందని
వారికేం
తెలుసు
అనే
సందేహాలు
కలుగుతున్నాయి.
నర్సయ్య..
రియల్టరే
గాక..
దొమ్మాట
మాజీ
సర్పంచ్‌గా
పనిచేశారు.
తన
స్థలాన్ని
విక్రయించాలని
అనుకున్నాడు.
సిద్దిపేటకు
చెందిన
టీచర్
శ్రీధర్
రెడ్డికి
విక్రయించేందుకు
అంగీకారం
కూడా
జరిగింది.
భూమికి
సంబంధించి
64.24
లక్షలు
చెల్లించాలని
ఇద్దరు
మాట్లాడుకున్నారు.
రిజిస్ట్రేషన్
కోసం
సోమవారం
కార్యాలయానికి
వచ్చారు.
ఈ
సమయంలో
శ్రీధర్
రెడ్డి
నగదు
కూడా
ఇచ్చారు.
ఆ
మొత్తాన్ని
కారు
డ్రైవర్
పరశురామ్‌కు
ఇచ్చి
కారులో
కూర్చొవాలని
చెప్పి..
రిజిస్ట్రేషన్
కార్యాలయంలోకి
వెళ్లారు.
ఆ
వెంటనే
దోచుకెళ్లారు.
ఆ
కేసును
పోలీసులు
ఛేజ్
చేశారు.