చాలా బాధేస్తుంటుంది.. రఘన్నను పంపితే కేసీఆర్ భరతం పడతాం: దుబ్బాకలో రాజా సింగ్ కోరినట్లే ఫలితం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరున్నర ఏళ్ల తర్వాత అధికార టీఆర్ఎస్ పార్టీకి ఉప ఎన్నికల్లో తొలి ఓటమి ఎదురైంది. ఒక దశలో ఉప ఎన్నికల కింగ్ అని కూడా టీఆర్ఎస్ ను జాతీయ మీడియా అభివర్ణించింది. 2014 నుంచి తిరుగులేని విజయాలు సాధిస్తూ వచ్చిన గులాబీ దళం ఇవాళ్టి దుబ్బాక ఉప ఎన్నికల్లో మాత్రం బొక్కబోర్లా పడింది. దుబ్బాక ఉపఎన్నికలో హోరాహోరీగా సాగిన పోరులో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. ఈ సందర్భంగా గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలను అందరూ గుర్తుచేసుకుంటున్నారు..

కారు క్రష్ -కమలం జోష్
సమీప చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు తీవ్ర ఉత్కంఠభరితంగా సాగాయి. 23వ రౌండ్ లో చివరి ఈవీఎంలోని ఓట్లను కూడా లెక్కబెట్టే దాకా విజేత ఎవరనేది ఖరారు కాలేదు. కౌంటింగ్ పూర్తయ్యే సమయానికి బీజేపీ క్యాండిడేట్ రఘునందన్ రావుకు 62, 772 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు 61,302 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస రెడ్డికి 21,819 ఓట్లు దక్కాయి. దీంతో 1470 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ విజయంతో..
దుబ్బాక ఫలితంపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు -బీజేపీ పేరెత్తకుండా ప్రెస్మీట్

రెండో బీజేపీ ఎమ్మెల్యే..
రాష్ట్ర విభజన తర్వాత 119 సీట్లతో ఏర్పడిన తెలంగాణ అసెంబ్లీకి తొలి ఎన్నిక 2014లో జరగ్గా, నాడు బీజేపీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. సీఎం కేసీఆర్ ముందస్తు నిర్ణయంతో తెలంగాణ అసెంబ్లీకి 2018 డిసెంబర్ లో రెండోసారి ఎన్నికలుజరిగాయి. ఈ దఫా బీజేపీ మరీ దారుణంగా ఒకే ఒక్క సీటు మాత్రమే దక్కింది. గోషామహల్ స్థానం నుంచి గెలిచిన రాజా సింగ్.. అసెంబ్లీలో ఒంటరి బీజేపీ ఎమ్మెల్యేగా సర్కారుపై పోరాటం చేశారు. మంగళవారం నాటి ఫలితంలో దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించడం ద్వారా ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీలో రెండో బీజేపీ ఎమ్మెల్యేగా రఘునందన్ రావు అవతరించారు. సెప్టెంబర్ 28న దుబ్బాక ఎన్నికల ప్రచారంలో రాజా సింగ్ కోరినట్లుగానే ఫలితాలు వచ్చాయని బీజేపీ శ్రేణులు గుర్తుచేసుకుంటున్నాయి. ఇంతకీ..
బీహార్లో ఈవీఎంల ట్యాంపరింగ్ - షాకింగ్ ఆరోపణలపై ఈసీ వివరణ -ఫలితాలపైనా క్లారిటీ ఇచ్చేశారు

ఇక కేసీఆర్ సర్కారుకు చుక్కలే..
దుబ్బాక ఎన్నికల ప్రచారంలో ప్రజల్ని ఉద్దేశించి ఉద్దేశించి రాజా సింగ్ మాట్లాడుతూ... ‘‘అసెంబ్లీలో బీజేపీ తరఫున నేను ఒక్కడినే ఉన్నాను. చాలా బాధేస్తుంటుంది. అసెంబ్లీలో నేను తెలుగులో చాలా తక్కువగా మాట్లాడుతుంటాను. నేను ఉండే ప్రాంతంలో హిందీ ఎక్కువ మాట్లాడుతుంటారు. తెలంగాణ సమస్యలపై మాట్లాడటానికి నాకు ఇచ్చే సమయం ఒక్క నిమిషం మాత్రమే. బీజేపీ నుంచి ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నందుకే కేసీఆర్ సర్కార్కు అంత భయం ఉంటే.. ఇక రెండో ఎమ్మెల్యేగా రఘునందన్ కూడా తోడు వస్తేనా..'' అంటూ అధికార పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. రాజా సింగ్ కోరుకున్నట్లే రఘునందన్ గెలవడంతో ఇద్దరి జోడీ అసెంబ్లీలో హిట్ అవుతుందని, ఇక కేసీఆర్ సర్కారుకు చుక్కలేనని బీజేపీ శ్రేణులు నినాదాలు చేశాయి.