సిద్దిపేట వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సాహితీతో వెలుగు, సోషల్ మీడియా వీక్‌నెస్ కావొద్దన్న హరీశ్‌రావు

|
Google Oneindia TeluguNews

సిద్దిపేట : సాహిత్యంతో సమాజంలో మార్పు తీసుకురావచ్చన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. యువత సామాజిక బాధ్యతను గుర్తుచేసేలా పద్యాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. భాష, చరిత్రను యువతరం తెలుసుకుంటూ .. భావితరానికి స్ఫూర్తిని అందించే బాధ్యత తీసుకోవాలని కోరారు. శుక్రవారం సిద్దిపేటలో సాహితీ సదస్సులో పాల్గొన్నారు హరీశ్ రావు.

social media is youth weakness : harish rao

తెలంగాణ ఉద్యమంలో సాహితీ వేత్తల సేవ మరవలేనివని అభిప్రాయపడ్డారు హరీశ్ రావు. ఆరోగ్య తెలంగాణ దిశగా రచనలు సాగాలన్నారు. యువత మంచి మార్గం వైపు నడవడానికి సాహిత్యం తోడుగా నిలువాలన్నారు. అయితే యువత మొబైళ్లతో ఏకాగ్రత కోల్పోతున్నామని గుర్తుచేశారు. వారి వీక్ నెస్ సోషల్ మీడియా అవుతుందని పేర్కొన్నారు. కానీ అదీ బలహీనం కాకుడదన్నారు. యువత మంచి వైపు పయనించాలని కోరారు. కానీ ప్రస్తుత సమాజంలో యువత మొబైళ్లతో కాలక్షేపం చేస్తూ సమయం వృధా చేసుకుంటున్నారని ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారిని అంతలా సోషల్ మీడియా అట్రాక్ట్ చేస్తుందని గుర్తుచేశారు కానీ అదే వారి జీవితాన్ని ఛిద్రం చేసే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు.

English summary
Former minister Harish Rao has brought about a change in society with literature. It is believed that poems should be a reminder of youth's social responsibility. Young people are aware of language and history .. urged to take responsibility to inspire the posterity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X