సిద్దిపేట వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిద్దిపేటలో లక్షకు పైగా మెజార్టీ, హరీష్ రావు డబుల్ హ్యాట్రిక్ రికార్డ్: 14 ఏళ్లలో 6సార్లు

|
Google Oneindia TeluguNews

సిద్దిపేట: తెలంగాణ రాష్ట్ర సమితి నేత, ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు భారీ మెజార్టీ సాధించారు. ఆయన లక్ష రెండు వేలకు పైగా మెజార్టీ సాధించారు. సమీప ప్రత్యర్థి, తెలంగాణ జన సమితి అభ్యర్థి భవానీ రెడ్డిపై విజయం సాధించారు. 2004లో హరీష్ రావు తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అప్పటి నుంచి వరుసగా ఆరుసార్లు గెలిచారు. డబుల్ హ్యాట్రింక్ సాధించారు.

ఏటికేడు హరీష్ రావు మెజార్టీ భారీగా పెరుగుతోంది. 2004, 2008, 2010 ఉప ఎన్నికలతో పాటు 2009, 2014 ఎన్నికల్లో గెలిచారు. 2018లో మరోసారి గెలిచి డబుల్ హ్యాట్రిక్ సాధించారు. 2004లో చార్మినార్ మజ్లిస్ పార్టీ అభ్యర్థికి లక్షా 7వేల మెజార్టీ వచ్చింది. ఇప్పుడు హరీష్ రావుకు లక్షకు పైగా వచ్చింది.

14 ఏళ్ల వ్యవధిలో ఆరుసార్లు గెలిచి డబుల్ హ్యాట్రిక్

14 ఏళ్ల వ్యవధిలో ఆరుసార్లు గెలిచి డబుల్ హ్యాట్రిక్

ఇప్పటికే ఐదుసార్లు గెలిచిన హరీష్ రావు కేవలం 14 ఏళ్ల వ్యవధిలోనే ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచి రికార్డ్ సృష్టించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ జేఏసీ, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఆయన రెండుసార్లు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మొదటి నుంచి సిద్దిపేట నుంచే గెలుస్తున్నారు. మెజార్టీలో రికార్డులు సృష్టిస్తున్నారు. కేసీఆర్ కేంద్రమంత్రిగా అవడంతో గతంలో సిద్దిపేట నుంచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. నాటి నుంచి హరీష్ పోటీ చేస్తున్నారు.

ఇలా గెలిచారు

ఇలా గెలిచారు

2004లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేశాయి. కేసీఆర్ కేంద్రమంత్రి అయ్యాక రాజీనామా చేయడంతో హరీష్ పోటీ చేసి, గెలిచారు. నాడు హరీష్ రావు ఎమ్మెల్యేగా గెలవడానికి ముందే వైయస్ రాజశేఖర రెడ్డి ఆయనను తన కేబినెట్లోకి తీసుకున్నారు. అప్పటి నుంచి హరీష్ వరుసగా 5సార్లు గెలిచారు. 2004 ఉప ఎన్నికల్లో, 2008 ఉప ఎన్నికల్లో, 2009 సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో, 2010 ఉప ఎన్నికల్లో, 2014 సాధారణ ఎన్నికల్లో గెలుస్తూ వచ్చారు. 2018లో ఆయన మరోసారి గెలుస్తారని ధీమాగా ఉన్నారు. ఈసారి కూడా గెలిస్తే హరీష్ రావు రికార్డ్ సృష్టించనున్నారు. ఒకటి 14 ఏళ్ల వ్యవధిలో ఆరుసార్లు గెలవడం. మరొక కీలకమైన రికార్డ్ ఉంది. 46 ఏళ్లకే ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచి జాతీయస్థాయి రికార్డ్ సృష్టించనున్నారు.

గతంలో వీరు డబుల్ హ్యాట్రిక్

గతంలో వీరు డబుల్ హ్యాట్రిక్

గతంలో తెలంగాణకు చెందిన నేతలు బాగారెడ్డి (కాంగ్రెస్) - జహీరాబాద్ నుంచి, జానారెడ్డి (కాంగ్రెస్) నాగార్జున సాగర్ నుంచి, కే చంద్రశేఖర రావు (టీఆర్ఎస్) సిద్దిపేట, గజ్వెల్ నియోజకవర్గాల నుంచి ఆరుసార్లు గెలిచారు. జీవన్ రెడ్డి కూడా ఆరుసార్లు గెలిచారు. బాగారెడ్డి 53, జానారెడ్డి 63, కేసీఆర్ 50 ఏళ్ల వయస్సుల్లో ఆరోసారి గెలిచారు. కేసీఆర్ సిద్దిపేట నుంచి వరుసగా ఆరుసార్లు గెలిచారు. కానీ అంతకుముందు, 1983లో తొలిసారి ఓడిపోయారు.

జాతీయస్థాయిలో వీరే

జాతీయస్థాయిలో వీరే

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి 13సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన 60 ఏళ్లకు పైగా శాసన సభ్యుడిగా ఉన్నారు. కరుణానిధి 1980లో ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడు ఆయన వయస్సు 56. కేరళకు చెందిన కేఎం మణి 1982లో 49 ఏళ్ల వయస్సులో ఎమ్మెల్యేగా ఆరోసారి గెలిచారు. 23 ఏళ్ల పాటు పశ్చిమ బెంగాల్ సీఎంగా ఉన్న జ్యోతిబసు 11సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన 56 ఏళ్ల వయస్సులో ఆరోసారి గెలిచారు. గణపతిరావు దేశ్‌ముఖ్ మహారాష్ట్ర నుంచి 11సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయన 50 ఏళ్ల వయస్సులో ఆరోసారి గెలిచారు. మల్లికార్జున ఖర్గే గుల్బర్గా నుంచి తొమ్మిదిసార్లు గెలిచారు. 1972 నుంచి 2009 వరకు గెలిచారు. ఇతను 52 ఏళ్ల వయస్సులో ఆరోసారి గెలిచారు.

English summary
TRS leader and incumbent Irrigation Minister T Harish Rao won from the Siddipet constituency with a massive margin for the sixth consecutive time. Harish Rao, the nephew of K Chandrasekhar Rao, didn’t have a contest with no strong candidates put up against him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X