సిద్దిపేట వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మీటర్లు కావాలా.. సంక్రాంతికి గంగిరెద్దులా, బీజేపీపై మంత్రి హరీశ్ రావు ఫైర్

|
Google Oneindia TeluguNews

దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ప్రధాన పార్టీలు పనిచేస్తున్నాయి. వాస్తవానికి పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించలేదు. కానీ సమయం దొరికప్పుడల్లా తాము చేసిన పనులను ప్రస్తావిస్తున్నారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్-బీజేపీ-కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉంది. అయితే మంత్రి హరీశ్ రావు విపక్షాలపై మండిపడ్డారు. ముఖ్యంగా బీజేపీ లక్ష్యంగా విమర్శలు చేశారు.

మీటర్లు కావాలా..?

మీటర్లు కావాలా..?


సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు, వర్షాలకు కూలిన ఇళ్లకు నష్టపరిహారం చెక్కులను మంత్రి హరీశ్ రావు పంపిణీ చేశారు. మీటర్లు కావాలనుకుంటే బీజేపీకి, వద్దు అనుకుంటే టీఆర్ఎస్ కారుకు ఓటేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పిటీ నుంచి టీఆర్ఎస్ పార్టీ రైతుల కోసమే పనిచేసిందని వివరించారు. కానీ బీజేపీ మాత్రం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని దుయ్యబట్టారు.

బాంబులు వేస్తోన్న బీజేపీ..

బాంబులు వేస్తోన్న బీజేపీ..

బీజేపీ మాత్రం రైతులకు మేలు చేయడం లేదని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. కానీ వారికి వ్యతిరేకంగా బాంబులు వేస్తోందని విమర్శించారు. బావుల వద్ద, బోర్ల వద్ద మీటర్లు ఏర్పాటు చేస్తోందట అని దుయ్యబట్టారు. బిల్ కలెక్టర్లతో వసూళ్లు చేస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. సంక్రాంతికి గంగిరెద్దులు వచ్చినట్టు ఓట్ల కోసం వచ్చే వారెవరో, కష్టపడి పనిచేస్తున్నది ఎవరో గుర్తించాలని ఆయన సూచించారు. కరోనా లాంటి సంక్షోభ సమయంలోనూ తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నిలిచిపోలేదని స్పష్టం చేశారు.

Recommended Video

#JEEMainResult2020: 8 Students From Telangana Among 24 Toppers | Oneindia Telugu
అభ్యర్థులు వీరే..

అభ్యర్థులు వీరే..

మరోవైపు దుబ్బాకలో అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాతకు టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. తనకు బదులు కుమారుడు సతీశ్ రెడ్డి టికెట్ ఇవ్వాలని కోరుతున్న.. హైకమాండ్ మాత్రం సుముఖంగా లేదు. బీజేపీ నుంచి రఘునందన్ రావు బరిలో దిగే ఛాన్స్ ఉంది. ఆయన ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారం చేయడంతో అభ్యర్థిత్వం ఖాయమని అంతా అనుకుంటున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఫైర్ బ్రాండ్ రాములమ్మ విజయశాంతి పేరు వినిపిస్తోంది. ఈ ముగ్గురు నేతల పోటీ చేయడంతో.. దుబ్బాక ఉప ఎన్నిక రసవత్తరంగా మారనుంది.

English summary
if u want meters.. or not minister harish rao asked dubbaka voters. he angry on central government
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X