తాగి లారీని రోడ్డుపైనే నిలిపిన డ్రైవర్, లారీ నడిపి ట్రాఫిక్ క్లియర్ చేసిన మంత్రి

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: మహరాష్ట్రలో ఓ ట్రక్కు డ్రైవర్ పీకలదాకా తాగి రోడ్డు మధ్యలోనే ట్రక్కును నిలిపివేశాడు.దీంతో ట్రాఫిక్ జాం ఏర్పడింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.అయితే ఈ ట్రక్కును రోడ్డు పక్కకు తీసుకెళ్ళి నిలిపాడు మంత్రి గిరీష్ మహాజన్.

మహరాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి గిరీష్ మహాజన్ ఆదివారం నాడు జల్ గావ్ ప్రాంతంలో వెళ్తున్నాడు.అయితే మంత్రి పర్యటన సమయంలోనే జల్ గావ్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

అయితే ట్రాఫిక్ జామ్ కావడానికి రోడ్డు మద్యలోనే 14 టైర్ల లారీ నిలిపి ఉంచడమే కారణంగా గుర్తించాడు.అయితే డ్రైవర్ లారీని నడిపే స్థితిలో లేడు.

girish mahajan

పీకల దాకా మద్యం తాగి ఉన్న డ్రైవర్ కనీసం డ్రైవింగ్ సీట్లో కూడ కూర్చోనే పరిస్థితిలో లేడు.ఈ విషయాన్ని గమనించిన మంత్రి వెంటనే తన కాన్వాయ్ ను నిలిపివేశాడు.

లారీ క్యాబిన్ నుండి డ్రైవర్ ను కిందకు దించాడు. తానే లారీని రోడ్డు పక్కకు తీసుకెళ్ళి ఆపాడు. లారీని పక్కకు తీసుకెళ్ళడంతో ట్రాఫిక్ క్లియరైంది.

అయితే మంత్రి ట్రక్కును నడిపే సమయంలో కొందరు స్థానికులు వీడియో తీశారు.ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రజలు ట్రాఫిక్ జాంతో ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించి ఈ సమస్య పరిష్కరించేందుకు కృషి చేసిన మంత్రిని పలువురు అభినందలతో ముంచెత్తారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Maharashtra minister Girish Mahajan on Friday drove a truck in Jalgaon in order to clear traffic.Mahajan had to drive the vehicle after the truck driver was detained for drunken driving. The driver left the truck on the road, causing a massive traffic jam.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి