రెజ్లింగ్‌లో మెరిసిన ఫోగట్ సిస్టర్స్: వినేశ్‌కు వెండి, రితూకి కాంస్యం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఫోగట్ సిస్టర్స్ మరోసారి దేశం గర్వించే పని చేశారు. ఢిల్లీలో జరిగిన ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో భారత్‌కు రెండు పతకాలు సాధించి పెట్టారు. శుక్రవారం జరిగిన పోటీల్లో వినేశ్ ఫోగట్ వెండి పతకం సాధించగా, రితూ ఫోగట్ కాంస్య పతకం సాధించింది.

కాంస్యం కోసం జరిగిన పోరులో ప్రత్యర్థి యనన్‌ సున్‌ (చైనా) గాయంతో మధ్యలోనే తప్పుకోవడంతో రితూను విజేతగా ప్రకటించారు. పైనల్స్‌లో ఓటమి పాలైన వినేశ్ ఫోగట్ 55 కేజీల విభాగంలో వెండి పతకం సాధించింది. పైనల్స్‌లో జపాన్‌కు చెందిన నాంజో సే చేతిలో 4-8 తేడాతో వినేశ్ ఫోగట్ ఓటమి పాలైంది.

 Vinesh Phogat

ఫైనల్లో ఈ ముగ్గురినీ జపాన్‌ క్రీడాకారులే ఓడించడం గమనార్హం. అంతకముందు వినీశ్‌ ఫొగట్‌ 55 కిలోల విభాగంలో క్వి ఝాంగ్‌ (చైనా)ను 4-0తో మట్టికరిపించి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇక రితూ పొగట్ 48 కిలోల విభాగంలో చైనా రెజ్లర్ సున్ యనన్‌పై గెలిచి కాంస్యం సాధించింది.

రజత పతకంతో సరిపెట్టుకున్న సాక్షిమాలిక్

శుక్రవారం జరిగిన మహిళల 60 కిలోల ఫైనల్లో రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సాక్షి 0-10తో రిసాకో కవై (జపాన్‌) చేతిలో పరాజయం పాలైంది. 2.44 నిమిషాల పోరులో ప్రత్యర్థికి సాక్షి ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India's Phogat sisters, Vinesh and Ritu, have once again made the country proud as they bagged two medals at the ongoing Asian Wrestling Championships here on Friday (May 12).
Please Wait while comments are loading...