న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అత్యుత్తమ సెంచరీల్లో సెహ్వాగ్ 195కి 13వ స్ధానం

By Nageswara Rao

మెల్‌బోర్న్: 2003లో ఆస్టేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ సాధించిన 195 పరుగులు '2000 నుంచి ఆస్టేలియాలో అత్యుత్తమ సెంచరీలు' జాబితాలో ఒకటిగా నిలిచింది.

మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో 2003లో జరిగిన ఈ బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌లో ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 233 బంతుల్లో 195 పరుగులు (25 ఫోర్లు, 5 సిక్సులు) సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆస్టేలియా 9 వికెట్ల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది.

ఆస్టేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా ఫేర్‌వెల్ సిరిస్ అది. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరిస్‌లో భాగంగా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో 1-0 తేడాతో టీమిండియా అడుగు పెట్టింది. ఈ సిరిస్‌లో మెల్‌బోర్న్ మ్యాచ్ మూడోది.

'Best Test Tons in Australia since 2000': Virender Sehwag's 195 at 13th spot

బ్రిస్బేన్‌లో జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. సిడ్నీలో జరిగిన చివరి టెస్టు కూడా డ్రాగా ముగియడంతో సిరిస్ 1-1తో సమమైంది. ఈ టెస్టు సిరిస్‌లో ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బ్రెట్ లీ, బ్రాడ్ విలిమయ్స్, స్టువర్ట్ మెక్‌గిల్ లాంటి బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు.

క్రికెట్ ఆస్టేలియా వెబ్‌సైట్ ఆస్టేలియా గడ్డపై 15 అద్భుతమైన సెంచరీల జాబితాను అందులో ఉంచింది. ఈ జాబితాలో టీమిండియా ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సెంచరీకి 13వ స్ధానం దక్కింది. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్, సైమన్ కటిచ్, హషీం ఆమ్లా, కుమార సంగక్కర, ఏబీ డెవిలియర్స్ ఉన్నారు.

క్రికెట్ ఆస్టేలియా వెబ్‌సైట్ ఇప్పటి వరకు 15 నుంచి 10 సంఖ్య వరకు మాత్రమే సెంచరీల జాబితాను విడుదల చేసింది. 9 నుంచి 1 వరకు ఇంకా విడుదల చేయాల్సి ఉంది. టాప్ 9 జాబితాలో ఇంకా టీమిండియాక చెందిన క్రికెటర్లు ఉంటారో చూడాలి మరి.

15. డేవిడ్ వార్నర్ (Australia) 123 not out Vs New Zealand (Bellerive Oval, Hobart, December 2011)
14. సైమన్ కటిచ్ (Australia) 131 not out Vs New Zealand (Gabba, Brisbane, November 2008)
13. వీరేంద్ర సెహ్వాగ్ (India) 195 Vs Australia (MCG, Melbourne, 2003)
12. హషీం ఆమ్లా (South Africa) 196 Vs Australia (WACA Ground, December 2012)
11. కుమార సంగక్కర (Sri Lanka) 192 Vs Australia (Bellerive Oval, Hobart, November 2007)
10. ఏబీ డెవిలియర్స్ (South Africa) 106 not out Vs Australia (WACA Ground, December 2008)

Note: Best knocks from 9 to 1 are yet to be released.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X