న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

7,000: డివిల్లియర్స్ రికార్డుని కోహ్లీ అధిగమిస్తాడా?

By Nageswara Rao

పెర్త్: దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిల్లియర్స్ పేరిట ఉన్న బ్యాటింగ్ రికార్డుని విరాట్ కోహ్లీ అధిగమించే అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు. ఆస్టేలియాతో టీమిండియా ఆడనున్న ఐదు వన్డేల సిరిస్‌‌ను మంగళవారం నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా టీమిండియా తొలి మ్యాచ్ పెర్త్‌లోని వాకా గ్రౌండ్‌లో ఆస్టేలియాతో తలపడనుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో తక్కువ మ్యాచ్‌ల్లో అత్యంత వేగంగా 7,000 పరుగులు చేసిన ఆటగాడిగా ఏబీ డివిల్లియర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ రికార్డని విరాట్ కోహ్లీ అధిగమించే ఛాన్స్ దక్కింది.

166 ఇన్నింగ్స్‌లో అత్యంత వేగంగా 7,000 పరుగుల మైలురాయిని ఏబీ డివిల్లియర్స్ అందుకున్నాడు. కాగా, టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ 158 ఇన్నింగ్స్‌ల్లో 6,831 పరుగులు సాధించాడు. ఇదే మైదానంలో ఆస్టేలియాపై జరిగిన వన్డే మ్యాచ్‌లో ఏబీ డివిల్లియర్స్ నవంబర్ 2014న ఈ రికార్డుని సాధించాడు.

Chance for Virat Kohli to break AB de Villiers' record in Australia

అయితే ఇప్పుడు ఈ రికార్డుని అధిగమించేందుకు విరాట్ కోహ్లీ కేవలం 169 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. ఆస్టేలియా పర్యటనలో కోహ్లీ ఐదు వన్డేల్లో రాణిస్తే ఏబీ డివిల్లియర్స్ రికార్డును తప్పక అధిగమిస్తాడు. ఏబీ డివిల్లియర్స్ రికార్డుని అధిగమించడానికి విరాట్ కోహ్లీకి ఇంకా ఏడు ఇన్నింగ్స్‌లు అవసరం.

అత్యంత వేగంగా వన్డేల్లో 7,000 పరుగులను సాధించిన ఆటగాళ్లు:

AB de Villiers (South Africa) - 166 innings (172 matches)
Sourav Ganguly (India) - 174 (180)
Brian Lara (West Indies) - 183 (187)
Desmond Haynes (West Indies) - 187 (188)
Jacques Kallis (South Africa) - 188 (197)

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X