6 బంతుల్లో 6 వికెట్లు: క్రికెట్‌లో 13 ఏళ్ల బాలుడి ప్రపంచ రికార్డు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: క్రికెట్‌లో వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు పడిగొట్టడం తరచూ చూస్తూనే ఉన్నాం. ఇక ఒకే ఓవర్‌లో నాలుగు లేదా ఐదు వికెట్లు తీసిన సందర్భాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. అదే ఒక ఓవర్‌లో ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీస్తే... అది కూడా క్లీన్‌బౌల్డ్‌ అయితే, నిజంగా ఇదొక గొప్ప ఫీట్ అనాల్సిందే.

ఇంగ్లండ్‌కు చెందిన 13 ఏళ్ల స్కూల్‌ క్రికెటర్‌ లూక్‌ రాబిన్‌సన్‌ ఈ ఘనత సాధించి శభాష్‌ అనిపించుకున్నాడు. అతను సాధించిన ఘనతపై బ్రిటన్ పత్రికలు పెద్ద ఎత్తున కథనాలను ప్రచురించాయి. వివరాల్లోకి వెళితే ఫిలిడెల్ఫియా క్రికెట్‌ క్లబ్‌ తరఫున అండర్‌-13 క్రికెట్‌ టోర్నీలో బరిలోకి దిగిన రాబిన్‌సన్‌ ఆరు బంతుల్లో ఆరు వికెట్లు కూల్చి సంచలనం సృష్టించాడు.

13-year-old bowler takes six wickets in an over
India vs Sri Lanka : Ashwin grabs five wickets And overtakes Harbhajan Singh

అంతేకాదు రాబిన్‌సన్ వరుసగా ఆరుగురు బ్యాట్స్‌మన్‌నూ క్లీన్‌బౌల్డ్ చేయడం మరో విశేషం. ఈ సమయంలో అతని తల్లి హెలెన్‌ స్కోరర్‌గా వ్యవహరిస్తుండగా.. తండ్రి స్టీఫెన్‌ అంపైరింగ్‌ చేస్తూ అతి దగ్గరినుంచి ఈ ఫీట్‌ను చూశాడు. బాలుడి తాత గ్లెన్ మ్యాచ్‌ని స్వయంగా వీక్షించి మనవడి అద్భుత రికార్డును ఆస్వాదించాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Luke Robinson produced his match-winning performance this week for Philadelphia Cricket Club's Under-13s, based near Houghton-le-Spring, Tyne and Wear in north-east England.
Please Wait while comments are loading...