ఒకే రోజు 17 వికెట్లు: డ్రాగా ముగిసిన యూత్ టెస్టు

Posted By:
Subscribe to Oneindia Telugu
హైదరాబాద్: నాగ్‌పూర్ వేదికగా యూత్ టెస్టు సిరిస్‌లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ అండర్-19 జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 238 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యువ భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 8 వికెట్లకు 189 పరుగులు చేసి ఓటమి నుంచి తప్పించుకుంది.

జట్టు సహచరు ఆటగాళ్లు వెంటవెంటనే వెనుదిరుగుతున్నా వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ లోకేశ్వర్‌ (92 నాటౌట్‌) కీలక ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థికి అడ్డునిలిచాడు. అతనికి తోడు డారిల్‌ ఫెరారియో (37) పరుగులతో రాణించాడు.

17 wickets tumble on last day as India-England Youth Test ends in adraw

అంతకముందు 23/1 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజైన గురువారం ఆటను కొనసాగించిన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 53 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ ఆటగాళ్లలో బార్ట్‌లెట్ (68), బ్రూక్ (29), పోప్ (26) ఫర్వాలేదనిపించారు.

భారత బౌలర్లలో సిజోమన్‌ జోసెఫ్‌ 6 వికెట్లు తీసుకుని 62 పరుగులతో విజృంభించడంతో ఇంగ్లాండ్ 167 పరుగులకే ఆలౌటై ఆతిథ్య జట్టుకు స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం స్వల్ప లక్ష్య చేధనకు బరిలోకి దిగిన యువ భారత్ తడబాటుకు గురైంది.

తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 501/5, భారత 431/8 స్కోర్లు చేశాయి. ఈ టెస్టులో చివరిరోజైన గురువారం బౌలర్లు 17 వికెట్లు తీసుకున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A staggering 17 wickets fell on the fourth and final day of the first Youth Test match between Under-19 cricket teams of India and England today (February 16) which saw wildly fluctuating fortunes before the game ended in a draw here.
Please Wait while comments are loading...