న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధర్మశాల వన్డే విజయం వెనుక ఆ ముగ్గురు?: ధోని కితాబు

By Nageshwara Rao

ధర్మశాల: ధర్మశాల వన్డేలో టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శనను కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కొనియాడారు. ఆదివారం ధర్మశాల వన్డే మ్యాచ్ విజయం అనంతరం ధోని మీడియాతో మాట్లాడారు. ఈ మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్లు అద్భుతమైన బౌలింగ్ చేశారని ప్రశంసించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ధర్మశాల వన్డేతో అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన హార్దిక్ పాండ్యా నిలకడగా 135 కి.మీ కంటే వేగంతో బౌలింగ్ చేస్తున్నాడని తెలిపారు. ఇక ఉమేష్ యాదవ్ కూడా నిలకడగా రాణిస్తూ తన ఫిట్‌నెస్‌ను మరింతగా పెంచుకోవడం మంచి పరిణామమని అన్నాడు.

1st ODI: MS Dhoni lauds Indian bowlers for 'fantastic performance'

ఇంగ్లాండ్ పిచ్‌లు అతనికి బాగా అనుకూలిస్తాయన్నాడు. ఇక ఇతర బౌలర్లతో పోలిస్తే పాండ్యా స్వింగ్ రాబడతాడని, ఇకపై పాండ్యాకు కొత్త బంతిని ఇవ్వాలని అనుకుంటున్నామని ధోని అన్నాడు. ఇక అక్షర పటేల్, మిశ్రా ఇద్దరూ చక్కగా బౌలింగ్ వేశారని వెల్లడించాడు.

900వ వన్డే భారత్‌‌దే: ధోని ఔట్, బాధపడి బ్యాట్‌ను నేలకేసి కొట్టిన కోహ్లీ

ధర్మశాల వన్డేలో త్వరగా వికెట్‌ను తీసుకోకపోతే 280-300 టార్గెట్ అయ్యేదని తెలిపాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీకి ముందు మేం ఎనిమిది మ్యాచ్‌లు మాత్రమే ఆడబోతున్నామని, కాబట్టి పరిస్థితులను బట్టి బౌలర్లు ఎలా ఆడగలరో పరీక్షించేందుకు పాండ్యాకు అవకాశం ఇచ్చామని తెలిపాడు.

కొత్త బంతిని సమర్ధంగా ఉపయోగించి, అతడు ఇదే విధంగా ప్రదర్శన కొనసాగిస్తే, ముగ్గురు పేసర్లలో మొదటివాడిగా అతణ్ని తీసుకుంటామని చెప్పాడు. కాగా, అవసరం ఉన్న సమయంలో రెగ్యులర్ బౌలర్లకు ప్రత్యామ్నాయంగా ప్రాక్టీస్ ఉండాలనే పార్ట్ టైమర్లతో బౌలింగ్ చేరుుంచానని తెలిపాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X