న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలి టీ20 ఇంగ్లాండ్‌దే: 7 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం

మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా కాన్పూర్ వేదికగా జరుగుతున్న తొలి టీ20లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ టీమిండియాను బ్యాటింగ్‌ను ఆహ్వానించింది.

By Nageshwara Rao

హైదరాబాద్: కాన్పూర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో కోహ్లీ సేన 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లకు 147 పరుగులు చేసింది. 148 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 18.1 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది.

ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 51 పరుగులు చేయగా, జోరూట్ 46, బిల్లింగ్స్ 22, జాసన్ రాయ్ 19 పరుగులు చేశారు. దీంతో మూడు వన్డేల సిరిస్‌ను 1-0తో ఇంగ్లాండ్ ఆధిక్యంలో నిలిచింది. భారత బౌలర్లలో యుజువేంద్ర చాహల్ 2 వికెట్లు తీసుకోగా, పర్వేజ్ రసూల్ ఒక వికెట్ తీసుకున్నాడు.

England won the toss, invite India to bat first

51 పరుగుల వద్ద మోర్గాన్ అవుట్
148 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ రూపంలో మూడో వికెట్ కోల్పోయింది. పర్వేజ్ రసూల్ వేసిన 16వ ఓవర్ రెండో బంతికి మోర్గాన్ కొట్టిన బంతిని రైనా అందుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు 16 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది.

రైనా సూపర్ ఫీల్డింగ్

148 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 14 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. కెప్టెన్ మోర్గాన్ 41, రూట్ 27 పరుగులుతో కొనసాగుతున్నారు. అయితే 15వ ఓవర్ రెండో బంతికి రైనా అద్భుతంగా ఫీల్డింగ్ చేశాడు. మోర్గాన్ కొట్టిన భారీ షాట్‌ను బౌండరీ లైన్ వద్ద క్యాచ్ అందుకున్నాడు. కానీ అంతలోనే బౌండరీ లైన్‌పై పడిపోతుండగా చివరి నిమిషంలో బంతిని మైదానంలోకి విసిరేశాడు.

England won the toss, invite India to bat first

ఇంగ్లాండ్ టార్గెట్: 24 బంతుల్లో 19 పరుగులు
తొలి టీ20లో ఇంగ్లాండ్ జట్టు గెలుపుదిశగా పయనిస్తోంది. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన కోహ్లీ సేన 147 పరుగులు చేసింది. 148 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 16 ఓవర్లు ముగిసే సమయానికి 129 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ గెలవాలంటే ఇంకా 24 బంతుల్లో 19 పరుగులు చేయాలి.

10 ఓవర్లకు 76 పరుగులు చేసిన ఇంగ్లాండ్
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టీ20 రసవత్తరంగా మారింది. 148 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ పది ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ విజయం సాధించేందుకు ఇంగ్లాండ్ 60 బంతుల్లో 72 పరుగులు చేయాల్సి ఉంది. ఓపెనర్లు పెవిలియన్‌కు చేరిన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(22), రూట్‌(13) పరుగులతో ఉన్నారు.

England won the toss, invite India to bat first

ఇంగ్లాండ్ నడ్డి విరిచిన యుజువేంద్ర చహల్

తొలి టీ20 మ్యాచ్‌లో భారత లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చహల్ విజృంభించాడు. తాను వేసిన మొదటి ఓవర్లోనే ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. దూకుడుగా ఆడుతున్న ఇంగ్లండ్ ఓపెనర్లను వరుసగా పెవీలియన్‌కు పంపాడు. నాలుగో ఓవర్ రెండో బంతికి ఓపెనర్ జాసన్ రాయ్ 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వెంటనే బిల్లింగ్స్‌ను 22 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో 3.5 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 43 పరుగులు చేసింది.

3 ఓవర్లకు ఇంగ్లాండ్ 36
148 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 3 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లాండ్ వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఇదే సమయానికి 22 పరుగులు చేయడం విశేషం. ఈ మ్యాచ్ గెలిచేందుకు ఇంగ్లాండ్‌కు ఇంకా 17 ఓవర్లలో 112 పరుగులు చేయాల్సి ఉంది.


భారత్ ఇన్నింగ్స్ సాగిందిలా:

కాన్పూర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్‌కు 148 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. చివరి ఓవర్‌లో ధోని వరుసగా రెండో ఫోర్లు సాధించాడు.

దీంతో ధోని 36 పరుగులు సాధించాడు. నాలుగో బంతికి పర్వేజ్ రసూల్ అవుటవ్వడంతో టీమిండియా ఏడో వికెట్‌ను కోల్పోయింది. పర్వేజ్ రసూల్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన జస్‌ప్రీత్ బుమ్రా పరుగులేమీ చేయలేదు. ఇంగ్లాండ్ బౌలర్లలో మెయిల్ అలీ 2 వికెట్లు తీసుకోగా, మిల్స్, జోర్డాన్, ఫ్లంకెట్, స్టోక్స్ తలో వికెట్ తీసుకున్నారు.

Dhoni

రసూల్ రనౌట్: ఏడో వికెట్ కోల్పోయిన భారత్

ఆఖరి ఓవర్‌లో నాలుగో బంతికి పర్వేజ్ రసూల్ రనౌట్ అయ్యాడు. ధోనీ కొట్టిన భారీ షాట్‌ను మిడ్ ఆఫ్‌లో ఉన్న ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఆపేశాడు. కానీ ఈలోపే పర్వేజ్ రన్‌కు ప్రయత్నించాడు ధోనీ వద్దకు వెళ్లిపోయాడు. ధోని వద్దని వారించడంతో వెనక్కు వెళ్లడానికి ప్రయత్నించాడు కానీ అంతలోనే రనౌట్ అయ్యాడు. దీంతో భారత్ 7 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది.

పాండ్యా అవుట్: ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. 9 పరుగుల వ్కక్తిగత స్కోరు వద్ద మిల్స్ బౌలింగ్‌లో బిల్లింగ్స్‌కు క్యాచ్ ఇచ్చి పాండ్యా పెవిలియన్‌కు చేరాడు. దీంతో 17 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. పాండ్యా అవుటైన తర్వాత పర్వేజ్ రసూల్ బ్యాటింగ్‌కు వచ్చాడు. ప్రస్తుతం క్రీజులో ధోని(17), రసూల్(3) పరుగులతో ఉన్నారు.

Pandya

3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పాండే అవుట్
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా కష్టాల్లో పడింది. ఐదో వికెట్ కోల్పోయింది. 34 పరుగుల వద్ద సురేష్ రైనా ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన మనీష్ పాండే 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. మోయిన్ అలీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. దీంతో 14 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ధోని(7), హర్థిక్ పాండ్యా(4) పరుగులతో ఉన్నారు.

రైనా అవుట్: నాలుగో వికెట్ కోల్పోయిన భారత్

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా నాలుగో వికెట్‌ను కోల్పోయింది. బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో 13వ ఓవర్ రెండో బంతిని భారీ సిక్సర్ కొట్టిన రైనా తర్వాత బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 34 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రైనా పెవిలియన్‌కు చేరాడు. రైనా అవుటైన తర్వాత మనీష్ పాండే క్రీజులోకి వచ్చాడు. 13 ముగిసే సరికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది.

Raina

యువరాజ్ అవుట్: మూడో వికెట్ కోల్పోయిన భారత్

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ఫ్లంకెట్ బౌలింగ్‌లో 11వ ఓవర్ మొదటి బంతికి యువరాజ్ సింగ్ లాంగ్ షాట్ కొట్టాడు. అయితే బౌండరీ లైన్ వద్ద ఉన్న అదిల్ రషీద్ దాన్ని క్యాచ్ అందుకున్నాడు. దీంతో రషీద్ బంతిని నేలకు తగిలించినట్టు ఉండటంతో టీవీ అంపైర్ వీడియోను నిశితంగా పరిశీలించి చివరకు యువీని ఔట్‌గా ప్రకటించారు. 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద యువీ వెనుదిరిగాడు. దీంతో 10.1 ఓవర్లకు గాను టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది.

YUvaraj singh

29 పరుగుల వద్ద కోహ్లీ అవుట్
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా రెండో వికెట్‌ను కోల్పోయింది. ఇంగ్లండ్ బౌలర్ మోయిన్ అలీ తన మొదటి బంతికే కోహ్లీని ఔట్ చేశాడు. హుక్ షాట్ కొట్టిన కోహ్లీని బౌలింగ్ పాయింట్ వద్ద ఎదురుగా ఫీల్డింగ్ చేస్తున్న ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ క్యాచ్ అందుకున్నాడు. కోహ్లీ 26 బంతుల్లో 29 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా 7.1 ఓవర్లు ముగిసే 2 వికెట్లుకోల్పోయి 55 పరుగులు చేసింది. కోహ్లీ అవుటైన తర్వాత యువీ క్రీజ్‌లోకి వచ్చాడు.

Kohli

టీ20ల్లో కోహ్లీ ఓపెనర్‌గా రెండోసారి
ట్వంటీ 20ల్లో కెప్టెన్ కోహ్లీ ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు దిగడం రెండో సారి. 2012లో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20లో కోహ్లీ తొలిసారి ఓపెనర్‌గా దిగాడు. ఆ తర్వాత జాతీయ జట్టు ఆడే ట్వంటీ 20ల్లో విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా ఇన్నింగ్స్ ఆరంభించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

50 పరుగులు దాటిన భారత స్కోరు

కాన్పూర్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టీ20లో భారత స్కోరు 50 పరుగులు దాటింది. జోర్డాన్ బౌలింగ్‌లో లోకేష్ రాహుల్ రూపంలో తొలి వికెట్‌ను భారత్ కోల్పోయింది. దీంతో కోహ్లీకి జతగా సురేశ్ రైనా క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం 6.2 ఓవర్లకు గాను టీమిండియా వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. కోహ్లీ 27 పరుగులు చేయగా, సురేశ్ రైనా 12 పరుగులతో క్రీజులో ఉన్నారు.

తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా

కాన్పూర్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టీ20లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 34 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ జోర్డాన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. దీంతో టీమిండియా 4.3 ఓవర్లకు గాను వికెట్ నష్టానికి 34 పరుగులు చేసింది. రాహుల్ అవుటైన తర్వాత సురేశ్ రైనా బ్యాటింగ్‌కు వచ్చాడు.

KL Rahul

తొలి టీ20: ఓపెనర్‌గా కోహ్లీ
కాన్పూర్ వేదికగా జరుగుతున్న తొలి టీ20లో 2 ఓవర్లు గాను టీమిండియా 16 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా కెప్టెన్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌లు బరిలోకి దిగారు. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ 10, రాహుల్ 4 పరుగులతో ఉన్నారు. తాను ఓపెనింగ్‌కు దిగే అవకాశాలున్నాయని తొలి వన్డేకి ముందు కోహ్లీ మీడియాతో చెప్పిన సంగతి తెలిసిందే. అన్ని ఫార్మాట్లలోనూ సారథ్యం చేపట్టిన విరాట్‌కు కెప్టెన్‌గా ఇదే తొలి టీ20 కావడం గమనార్హం. ఐపీఎల్‌‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు ఓపెనర్‌గా రాణించిన సంగతి తెలిసిందే.

టాస్ నెగ్గితే ఫీల్డింగ్ ఎంచుకునే వాడిని: విరాట్ కోహ్లీ
జాతీయగీతం ఆలపించిన తర్వాత మ్యాచ్‌ ప్రారంభమైంది. టాస్ ఓడిన అనంతరం కోహ్లీ మాట్లాడుతూ తాను కూడా టాస్ నెగ్గితే ఫీల్డింగ్ ఎంచుకునే వాడినని చెప్పాడు. టాస్ అనేది మన కంట్రోల్‌లో ఉండదని, ఇది బ్యాటింగ్ పిచ్ అని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.

Kohli

మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా కాన్పూర్ వేదికగా జరుగుతున్న తొలి టీ20లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియాను బ్యాటింగ్‌ను ఆహ్వానించింది. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన స్పిన్నర్‌ పర్వేజ్‌ రసూల్‌ ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేస్తున్నాడు. సురేశ్‌రైనా, మనీశ్‌పాండే తుది జట్టులో స్థానం దక్కించుకొన్నారు.

కోహ్లీ నేతృత్వంలో తొలి టీ 20కి సిద్ధమైన టీమిండియా ఈ సిరీస్‌ను విజయంతో ఆరంభించాలని భావిస్తోంది. మరోవైపు మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా కోల్ కతాలో జరిగిన చివరి వన్డేలో గెలిచిన ఇంగ్లాండ్ అదే జోరుని తొలి టీ20లో కొనసాగించాలనే పట్టుదలగా ఉంది.

జట్ల వివరాలు:

టీమిండియా

ఇంగ్లాండ్:

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X