2013 రివైండ్, జోకర్లలా కనిపించాం: తెలుపు రంగు జాకెట్‌పై కోహ్లీ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐసీసీ నిర్వహించే టోర్నీల్లో వరల్డ్ కప్ తర్వాత అంతలా అభిమానులు ఆదరించే టోర్నీల్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఒకటి. అలాంటి ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న విజేతలకు ట్రోఫీతో పాటు తెలుపు రంగు జాకెట్‌ని ఇవ్వడం గత కొంతకాలంగా వస్తోంది.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్  | ఫోటోలు  | స్కోరు కార్డు 

ఛాంపియన్స్ హోదాలో ఐసీసీ ఇచ్చే ఆ తెలుపు రంగు జాకెట్‌ని ధరించడం క్రికెటర్లు ఎంతో గౌరవంగా భావిస్తారు. 2013లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ధోని నేతృత్వంలోని టీమిండియా విజేతగా నిలిచింది. దీంతో కోహ్లీతో సహా ఆటగాళ్లంతా వాటిని ధరించారు.

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ప్రస్తుతం లండన్‌లో ఉన్న టీమిండియా విరాళాల సేకరణ కార్యక్రమంలో పాల్గొంది. ఈ కార్యక్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలుపు రంగు జాకెట్‌పై స్పందించారు.

తెలుపు రంగు జాకెట్‌ ఉండటం గౌరవానికి చిహ్నం

తెలుపు రంగు జాకెట్‌ ఉండటం గౌరవానికి చిహ్నం

‘నా వార్డ్‌రోబ్‌లో తెలుపు రంగు జాకెట్‌ ఉండటం గౌరవానికి చిహ్నం. దానిని ధరించే అవకాశం వస్తుందనుకోలేదు. ఛాంపియన్స్‌ ట్రోఫీకి ముందు (2013లో) టీమిండియా కఠిన పరిస్థితుల్లో ఉంది. టోర్నీలో మేమెలా ఆడతామో? అని అందరూ సందేహించారు' అని ధోని ఈ సందర్భంగా అన్నాడు.

జోకర్లలా కనిపించాం

జోకర్లలా కనిపించాం

అయితే ఈసారి కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఛాంపియన్స్ ఆడుతోంది. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఛలోక్తి విసిరాడు. ‘అవును, ఈసారి అవి (తెలుపు జాకెట్‌) బాగా సరిపోతే కచ్చితంగా వేసుకొంటా. గతసారి మేము అందులో జోకర్లలా కనిపించాం. ఎందుకంటే అవి చాలా లూజ్‌గా ఉన్నాయి మరి' అని కోహ్లీ అన్నాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ ఎంతో ప్రత్యేకం

ఛాంపియన్స్ ట్రోఫీ ఎంతో ప్రత్యేకం

అనంతరం ధోని మాట్లాడుతూ 2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఎంతో ప్రత్యేకమని చెప్పాడు. ఎందుకంటే టోర్నీలో సత్తా చాటేందుకు ఎక్కువ సమయం ఉండదని, వర్షంతో మ్యాచ్‌లు నిలిపివేస్తున్న పరిస్థితుల్లో ట్రోఫీ గెలవడం చాలా కష్టమని ధోనీ అభిప్రాయపడ్డాడు.

రెండో సెమీఫైనల్లో బంగ్లాతో తలపడనున్న టీమిండియా

రెండో సెమీఫైనల్లో బంగ్లాతో తలపడనున్న టీమిండియా

ఇక, సెమీస్‌కు చేరాలంటో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. జూన్ 15 (గురువారం) జరిగే రెండో సెమీఫైనల్లో గ్రూప్‌-ఎలో ఉన్న బంగ్లాతో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే టీమిండియా ఫైనల్‌కి చేరుకుంది. మరోవైపు తొలి సెమీఫైనల్లో ఆతిథ్య ఇంగ్లాండ్‌ జట్టు పాక్‌తో తలపడనుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
"The white jacket has a place of pride in the wardrobe. After all the champagne, I don't think it is there to be worn again," said he. Dhoni led the team to the 2013 victory. Looking back, he added, "Before that Champions Trophy [in 2013], we weren't going through a good phase. I think a lot of people doubted how well we would do."
Please Wait while comments are loading...