ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ: ఆ రెండు జట్లతో భారత్ వార్మప్ మ్యాచ్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లాండ్‌లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో జరిగే వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ షెడ్యూల్ ప్రకారం టీమిండియా రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌లను ఓవల్‌ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌తో భారత్ తలపడుతుంది.

భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల నుంచి జరిగే ఈ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అన్ని జట్లకు కలిపి మే 26 నుంచి 30 వరకు మొత్తం ఆరు ప్రాక్టిస్ మ్యాచ్‌లు లండన్, బర్మింగ్‌హామ్‌ స్టేడియంలలో జరగనున్నాయి. ఈ ఏడాది జూన్ 1 నుంచి 18 వరకు జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంగ్లాండ్, వేల్స్ ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే.

2017 ICC Champions Trophy: Virat Kohli and co to play NZ, Bangladesh in warm-up games

2006 తర్వాత తొలిసారిగా బంగ్లాదేశ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడుతోంది. ఈ టోర్నీలో టాప్ 8 జట్లనే ఆడేందుకు అనుమతిచ్చే సంగతి తెలిసిందే. ఐసీసీ వన్డే ర్యాంకుల్లో వెస్టిండిస్‌ను వెనక్కినెట్టి బంగ్లాదేశ్ ఎనిమిదో స్ధానంలో నిలిచింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వార్మప్ మ్యాచ్ షెడ్యూల్:

మే 26: ఆస్ట్రేలియా Vs శ్రీలంక, ది ఓవల్ స్టేడియం (లండన్)
మే 27: బంగ్లాదేశ్ Vs పాకిస్థాన్, ఎడ్జిబస్టన్ (బర్మింగ్‌హామ్‌)
మే 28: భారత్ Vs న్యూజిలాండ్, ది ఓవల్ స్టేడియం (లండన్)
మే 29: ఆస్ట్రేలియా Vs పాకిస్థాన్, ఎడ్జిబస్టన్ (బర్మింగ్‌హామ్‌)
మే 30: న్యూజిలాండ్ Vs శ్రీలంక, ఎడ్జిబస్టన్ (బర్మింగ్‌హామ్‌)
మే 30: భారత్ Vs బంగ్లాదేశ్, ది ఓవల్ స్టేడియం (లండన్)

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The top cricketing sides from around the world are set to play a few warm-up games in the United Kingdom, before the 2017 edition of the ICC Champions Trophy gets underway in June.
Please Wait while comments are loading...