విషాదం: బ్యాట్ తలకు తగిలి హైదరాబాద్‌లో ఫీల్డర్ మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: క్రికెట్ ఆడుతూ ఆటగాళ్లు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు రోజు రోజుకూ ఎక్కవవుతున్నాయి. కొన్ని వారాల క్రితం బంగ్లాదేశ్‌లో జరిగిన స్థానిక మ్యాచ్‌లో వికెట్ కీపర్ తలపై బ్యాట్స్‌మెన్ స్టంప్‌తో బలంగా కొట్టడంతో వికెట్ కీపర్ తీవ్రంగా గాయపడ్డాడు.

వెంటనే గాయపడిన అతడిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించగా మృత్యువుతో పోరాడుతూ చనిపోయాడు. ఈ సంఘటన మరిచిపోకముందే తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ స్థానిక మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్‌కు సమీపంలోని షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఫీల్డర్ తలకి పొరపాటున బ్యాట్ తలగడంతో 22 ఏళ్ల కుర్రాడు మృతి చెందాడు.

22-year-old loses life in a friendly contest being played at Hyderabad

వివరాల్లోకి వెళితే హైదరాబాద్ నగరంలోని బహదూర్‌పురలోని మిర్ అలమ్ ఈద్గ్ వద్ద ఆదివారం స్ధానిక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్‌కి అతి సమీపంలో అబ్దుల్ వజీద్ అనే కుర్రాడు ఫీల్డింగ్ చేస్తుండగా.. హిట్టింగ్ చేసేందుకు క్రీజు వెలుపలికి వచ్చిన బ్యాట్స్‌మెన్ షాట్ కొట్టే ప్రయత్నంలో పొరపాటున వజీద్ తలపై కొట్టేశాడు.

దీంతో తీవ్రంగా గాయపడిన వజీద్‌ని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అతడు బుధవారం మృతి చెందినట్లు బహదూర్‌పుర పోలీసులు వెల్లడించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేసే ఫీల్డర్లు హెల్మెట్‌ను ధరిస్తారు. కానీ.. ఇది స్థానిక మ్యాచ్ కావడంతో ఫీల్డర్ అలాంటి జాగ్రత్తలు ఏమీ తీసుకోకపోవడంతోనే ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Certainly this is not the first such instance of a player losing his life on the 22-yard pitch and a 22-year-old passed away after being accidentally hit by a bat by a fellow player. All this happened in a friendly contest Bahadurpura (Hyderabad).
Please Wait while comments are loading...