న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కివీస్ చిత్తు: పాక్ నుంచి నెం.1 ర్యాంక్ లాగేసిన భారత్

కోల్‌కతా: సొంతగడ్డపై 250 టెస్టులో టీమిండియా సత్తా చాటింది. భారత బౌలర్ల ధాటికి న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ చాపచుట్టేశారు. దీంతో రెండో టెస్టులో 178 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంక్ సాధించేసింది. దీంతో ఇంతకుముందు అగ్రస్థానంలో ఉన్న పాకిస్థాన్ రెండో స్థానానికి పడిపోయింది.

India set New Zealand

భారత గెలుపు ఇలా..

376 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌.. భారత బౌలర్ల ధాటికి విలవిలలాడుతోంది. ఓపెనర్ 55 పరుగుల వద్ద గుప్తిల్ అశ్విన్ బౌలింగ్‌లో ఔటై వెనుదిరిగాడు. ఆ తర్వాత 104 పరుగుల వద్ద నికోల్స్ జడేజా బౌలింగ్‌లో ఔటవగా, 115 పరుగుల వద్ద టేలర్.. అశ్విన్ బౌలింగ్‌లో పెవిలియన్ బాట పట్టాడు. 141 పరుగుల వద్ద లాథమ్‌ను 74 పరుగులతో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పుతున్న తరుణంలో అశ్విన్ ఔట్ చేసి న్యూజిలాండ్‌కు కోలుకోలేని దెబ్బతీశాడు.

ashwin and kohli

ఆ తర్వాత 154 పరుగల వద్ద సత్నర్‌ను, 156 పరుగుల వద్ద వాట్లింగ్‌ను షమీ ఔట్ చేశాడు. దీంతో న్యూజిలాండ్ 6 వికెట్ల నష్టానికి 162 పరుగులతో ఆట కొనసాగిస్తోంది. ప్రస్తుతం రోంచి 26, హెన్రీ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఆ తర్వాత ఏడో వికెట్‌గా రోంచి (32 పరుగులు) వెనుదిరిగాడు. ఆ వెంటనే 178 పరుగుల వద్ద జేఎస్ పటేల్ అవుటయ్యాడు. అనంతరం 190 పరుగుల వద్ద హెన్రీ.. జడేజా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత పటేల్.. భువనేశ్వర్ బౌలింగ్ లో, బోల్ట్ షమీ బౌలింగ్‌లో వెనుదిరగడంతో భారత విజయం ఖరారైంది.

అంతకుముందు ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో జరిగిన రెండో టెస్టులో భారత్‌ 376 పరుగుల భారీ లక్ష్యాన్ని న్యూజిలాండ్‌కు నిర్దేశించింది. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ వృద్ధిమాన్‌ సాహా 58 నాటౌట్‌ (120 బంతుల్లో 6ఫోర్లు) అర్ధశతకం బాదడంతో ఓవర్‌నైట్‌ స్కోరు 227/8తో సోమవారం రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్‌ 263 పరుగులకు ఆలౌటైంది.

భువనేశ్వర్‌ కుమార్‌ (23), షమీ (1) చివర్లో సాహాకు చక్కని సహకారం అందించారు. భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగుల ఆధిక్యం లభించిన విషయం తెలిసిందే. కాగా, రోహిత్ శర్మ కూడా 132 బంతుల్లో 82 పరుగులు చేసి భారత్‌ మంచి స్కోరు చేసేలా సహకారం అందించాడు.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 316
న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 204
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 263

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X