ఫోటోలు: షమీ బౌన్సర్లకు ఇంగ్లాండ్ ఆటగాళ్లు బెంబేలు

Posted By:
Subscribe to Oneindia Telugu

మొహాలి: ఇంగ్లాండ్‌తో మొహాలిలో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. 78/4 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆటలో భాగంగా మంగళవారం ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించింది.

మొహాలి టెస్టు: గెలుపు ముంగిట భారత్‌, విజయలక్ష్యం 103

రూట్‌ (36), బ్యాటీ (0) బ్యాటింగ్‌‌కు దిగారు. మ్యాచ్ ప్రారంభమైన రెండో ఓవర్ లోనే ఆల్ రౌండర్ జడేజా బ్యాటీని ఔట్ చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బట్లర్‌ను 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జయంత్ యాదవ్ పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత జట్టు స్కోరు 152 పరుగుల వద్ద జో రూట్‌ని జడేజా పెవిలియన్‌కు పంపాడు.

 పుల్ లెంగ్త్ బంతులతో పాటు బౌన్సర్లు

పుల్ లెంగ్త్ బంతులతో పాటు బౌన్సర్లు


దీంతో ఇంగ్లాండ్ ఏడో వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు హమిద్(59 నాటౌట్), వోక్స్(30)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే ఈ సమయంలో బౌలింగ్‌కు వచ్చిన షమీ పదునైన పుల్ లెంగ్త్ బంతులతో పాటు బౌన్సర్లు వేసి ఇంగ్లాండ్ ఆటగాళ్లను భయపెట్టాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 3, రెండో ఇన్నింగ్స్‌లో 2

తొలి ఇన్నింగ్స్‌లో 3, రెండో ఇన్నింగ్స్‌లో 2

మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసిన షమీ, రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీసుకున్నాడు. ఈ రెండు వికెట్లు కూడా బౌన్సర్లు సంధించిన తీసుకోవడం విశేషం. ముఖ్యంగా 84వ ఓవర్‌ను వేసిన షమీ తొలి బంతినే క్రీజులో ఉన్న వోక్స్‌కు బౌన్సర్‌గా వేశాడు.

 వోక్స్ హెల్మెట్‌ను తాకిన షమీ బౌన్సర్

వోక్స్ హెల్మెట్‌ను తాకిన షమీ బౌన్సర్


ఈ బంతికి వోక్స్ తడబడటంతో పాటు వోక్స్ హెల్మెట్‌ను బలంగా తాకింది. అంతేకాదు వోక్స్ హెల్మెట్ కు ఉన్న నెక్‌గార్డ్ ఎగిరి కిందపడింది. అయితే ఈ బంతికి వోక్స్‌కు ఎటువంటి గాయం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక రెండో బంతిని కూడా షమీ బౌన్సర్ రూపంలోనే సంధించాడు.

 తడబడిన వోక్స్ 30 పరుగుల వద్ద ఔట్

తడబడిన వోక్స్ 30 పరుగుల వద్ద ఔట్


ఈ బంతిని ఆడటంతో తడబడిన వోక్స్ 30 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వికెట్ కీపర్ పార్ధీవ్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన రషీద్‌ను అదే ఓవర్‌లో నాలుగో బంతిని ఆడబోయి ఉమేశ్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

 238 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్

238 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్


దాంతో ఇంగ్లాండ్ జట్టు 195 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన జేమ్స్ అండర్సన్(5) రనౌట్ కావడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో రవి చంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు తీసుకోగా, షమీ, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్‌లకు తలా రెండు వికెట్లు తీసుకున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The third Test between India and England ebbed and flowed, just when India looked to be completely on top, England were right there, staying in contention. On day 4, there was a similar phase of play.
Please Wait while comments are loading...