పాఠాలు: 'ఫ్యూచర్ స్టార్' అంటూ కోహ్లీ నుంచి ప్రశంస

Posted By:
Subscribe to Oneindia Telugu

మొహాలి: ఇంగ్లాండ్ ఓపెనర్ హసీబ్ హమీద్‌ను 'ప్యూచర్ స్టార్' అంటూ టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసలతో ముంచెత్తాడు. బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోని మెలకువలను తన సహచర ఆటగాళ్లకు సలహాలిచ్చే కోహ్లీ వద్ద ఓ ఇంగ్లీషు ఆటగాడు పాఠాలు నేర్చుకున్నాడు.

మొహాలి విజయం: కోహ్లీకి 12, నమోదైన రికార్డులివే

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. మొహాలి వేదికగా ఇరు జట్ల మధ్య జరిగిన మూడో టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భారత్ 2-0తో ఆధిక్యాన్ని సాధించింది.

3rd Test: Virat Kohli praises 'future star' Haseeb Hameed

ఈ క్రమంలో మొహాలి టెస్టు ముగిసిన అనంతరం ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇంగ్లాండ్ ఓపెనర్ హసీబ్ హమీద్ టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని కలిశాడు. కోహ్లీ నుంచి బ్యాటింగ్‌లో పలు సూచనలు కూడా అందుకున్నాడు. ఈ సందర్భంగా వీరిద్దరూ కాసేపు బ్యాటింగ్‌పై చర్చించుకున్నారు.

ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఇదిలా ఉంటే గాయం కారణంగా ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్‌కు దిగిన హమీద్ 156 బంతులను ఎదుర్కొని 59 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్ స్కోరు 200 పరుగుల మార్కుని చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.

ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్‌కు దిగిన హమీద్ ప్రారంభం నుంచే నెమ్మదిగా ఆడుతూ వికెట్ల మధ్య పాతుకుపోయాడు. 19 బంతులకు ఖాతా తెరిచిన హమీద్ ఏడో వికెట్‌కు జో రూట్‌తో కలిసి 45 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో మొహాలి టెస్టులో నాలుగో రోజు భారత్ విజయం మరికాస్త ఆలస్యం అయింది.

సిరిస్ నుంచి హమీద్ ఔట్: తిరిగి ఇంగ్లాండ్‌కు పయనం

రాజ్ కోట్‌ టెస్టులో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన హమీద్ తొలి టెస్టులోనే తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. మూడో టెస్టు తొలిరోజు బ్యాటింగ్ సందర్భంగా భారత పేసర్ ఉమేశ్ యాదవ్ వేసిన బౌన్సర్ హామీద్ ఎడమ చేతి భుజానికి తగిలడంతో అతడు గాయపడ్డాడు. భారత పర్యటనలో హమీద్ రెండు అర్ధ సెంచరీలు సాధించాడు.

3rd Test: Virat Kohli praises 'future star' Haseeb Hameed

మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 9 పరుగులకే ఔటైనా, రెండో ఇన్నింగ్స్‌లో 59 పరుగులతో అర్ధసెంచరీ సాధించి నాటౌట్‌గా నిలిచాడు. గాయం కారణంగా సిరిస్‌కు దూరమయ్యాడు. దీంతో సిరిస్‌లోని మిగతా రెండు టెస్టుల్లో అతడు ఆడటం లేదు. 19 ఏళ్ల హమీద్ తిరిగి ఇంగ్లాండ్ వెళ్లి పోనున్నాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Indian captain Virat Kohli today (November 29) heaped praise on England's young opener Haseeb Hameed and predicted he would be a "future star" in all forms of the game.
Please Wait while comments are loading...