స్మిత్‌ను అవుట్ చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పిన అశ్విన్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ధర్మశాల వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రపంచ రికార్డుని నెలకొల్పాడు. ఒక సీజన్‌లో అత్యధిక వికెట్లు (79) తీసిన బౌలర్‌గా అవతరించాడు.

ధర్మశాల టెస్టుకు ముందు 2016-17 సీజన్‌లో 78 వికెట్లు తీసి అశ్విన్ అగ్రస్థానాన్ని దక్షిణాఫ్రికా ఆటగాడు డెల్ స్టెయిన్‌తో పంచుకున్నాడు. 2007-08 సీజన్‌లో డేల్ స్టెయిన్ 78 వికెట్లు తీశాడు. ధర్మశాల వేదికగా శనివారం ప్రారంభమైన చివరి టెస్టులో సెంచరీ చేసిన కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను 111 పరుగుల వద్ద అశ్విన్ పెవిలియన్‌కు చేర్చాడు.

59వ ఓవర్‌లో అశ్విన్‌ వేసిన ఐదో బంతికి ఆడిన స్మిత్‌ స్లిప్‌లో రహానేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. కీలక బ్యాట్స్‌మెన్‌ వెనుదిరిగడంతో ఆసీస్‌ కష్టాల్లో పడింది. స్టీవ్ స్మిత్ వికెట్‌ తీయడంతో ఒక సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్(79) ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

4th Test, Dharamsala, Day 1: Kuldeep shines, Ashwin gets Smith

కాగా ధర్మశాల టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో లంచ్ వరకు నిలకడగా రాణించిన ఆసీస్ బ్యాట్స్‌మెన్లు లంచ్ విరామ అనంతరం వరుసగా వికెట్లు కోల్పోయింది. లంచ్‌ విరామం నుంచి రెండో సెషన్‌ ముగిసేలోపు ఐదు కీలక వికెట్లు కోల్పోవడం విశేషం.

రెన్ షా రూపంలో తొలి వికెట్‌ను 10 పరుగుల వద్ద కోల్పోయిన ఆసీస్‌ ఆ తర్వాత 144 పరుగుల దాకా వికెట్‌ కోల్పోలేదు. ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌-స్టీవ్ స్మిత్‌తో కలిసి రెండో వికెట్‌కు 134 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ సమయంలో అర్ధసెంచరీ డేవిడ్ వార్నర్ (56)ని కుల్దీప్ అవుట్ చేశాడు.

ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ అద్భుత బౌలింగ్‌తో ఆసీస్‌ను కష్టాల్లోకి నెట్టాడు. మిగతా నలుగురు బ్యాట్స్‌మెన్ 208 పరుగుల లోపే పెవిలియన్కు చేరారు. టీ విరామానికి ఆరు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. భారత్ బౌలర్లలో కుల్దీప్ మూడు, ఉమేశ్ యాదవ్‌ 2, అశ్విన్ ఒక వికెట్ తీసుకున్నారు. వరుసగా వికెట్లు పడుతుండటంతో ఆసీస్ ఆటగాళ్లు ఆచితూచి అడుగులేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Kuldeep Yadav’s three wickets and Umesh Yadav’s two have been the highlight of India’s fightback in the post lunch session against Australia on Day 1 of the fourth Test in Dharamsala.
Please Wait while comments are loading...