ఐపీఎల్: సన్‌రైజర్స్ ఓటమికి అసలు కారణం చెప్పిన ముత్తయ్య

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో బుధవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో హైదరాబాద్ ఓటమికి ప్రధాన కారణం ఆట 20 ఓవర్ల పాటు ఆడకపోడమేనని సన్ రైజర్స్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ అభిప్రాయపడ్డాడు.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ గౌతం గంభీర్ సన్ రైజర్స్‌ని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 128 పరుగులు చేసింది. సన్ రైజర్స్ ఇన్నింగ్స్‌ ముగిశాక వర్షం కారణంగా ఆటకు మూడున్నర గంటలు అంతరాయం కలిగింది.

ఆ తర్వాత డక్‌వర్త్‌ లూయిస్ పద్ధతి ప్రకారం కోల్‌కతా లక్ష్యాన్ని ఆరు ఓవర్లలో 48 పరుగులుగా నిర్దేశించారు. దీంతో ఆ లక్ష్యాన్ని కోల్‌కతా 5.2 ఓవర్లలోమూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.

కొంపముంచిన వర్షం: ఐపీఎల్ నుంచి సన్‌రైజర్స్ ఔట్, క్వాలిఫయర్‌-2కు కోల్‌కతా

A full 20-over game would have helped us: Muralitharan

ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ ఓటమిపై ముత్తయ్య గురువారం మీడియాతో మాట్లాడాడు. వర్షం రాకతో మ్యాచ్ పూర్తిగా సాధ్యం కాలేదని, ఒకవేళ ఆట మొత్తం జరిగిన పక్షంలో సన్ రైజర్స్ విజయం సాధించే అవకాశం ఉండేదని చెప్పాడు. 20 ఓవర్ల పాటు ఆట జరిగి ఉంటే అది తమకు లాభించేదని ముత్తయ్య అన్నాడు.

'ఈ సీజన్‌లో బెంగళూరు పిచ్‌ను చాలా స్లోగా ఉంది. అక్కడ నమోదైనవన్నీ తక్కువ స్కోర్లే. మేము ముందుగా బ్యాటింగ్ చేసి 128 పరుగులు చేశాం. కానీ మరో 10 పరుగులు చేసి ఉండాల్సింది. మ్యాచ్ పూర్తిగా జరిగి ఉంటే మేము చేసిన పరుగుల్ని కచ్చితంగా కాపాడుకునే వాళ్లం' అని చెప్పాడు.

ఎలిమినేటర్ హైలెట్స్: రికార్డు సృష్టించిన వార్నర్, డక్‌వర్త్‌-లూయిస్‌‌లో కోల్‌కతా విజయం

'మా ఇన్నింగ్స్ ముగిసిన తరువాత వర్షం పడటం, మ్యాచ్ ఫలితాన్ని ఆరు ఓవర్లకు కుదించటం మా అవకాశాల్ని దెబ్బతీసింది. మొత్తంగా చూస్తే మ్యాచ్ పూర్తిగా జరిగి ఉంటే ఫలితం వేరుగా ఉండేది' అని ముత్తయ్య తెలిపాడు. ఇదిలా ఉంటే శుక్రవారం జరిగే క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్‌తో కోల్‌కతా తలపడనుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Content with his team's performance, Sunrisers Hyderabad coach Muttiah Muralitharan said the franchise had a good chance of making the IPL final if its Qualifier against Kolkata Knight Riders had not been truncated due to rain.
Please Wait while comments are loading...