శ‌రీర రంగును బ‌ట్టి చిన్న‌చూపు: అభినవ్ ముకుంద్ ఆవేదన

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: వ‌ర్ణ‌ వివ‌క్ష‌కు సాధార‌ణ వ్య‌క్తులే కాదు సెల‌బ్రిటీలు కూడా బారిన పడుతున్నారు. తాజాగా ఇండియ‌న్ క్రికెట‌ర్ అభిన‌వ్ ముకుంద్ వ‌ర్ణ‌ వివ‌క్ష‌పై ట్విట్టర్ వేదికగా స్పందించాడు. త‌న శ‌రీర రంగును బ‌ట్టి చిన్న‌చూపు చూడ‌టంపై అత‌ను అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు.

ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ మేసేజ్‌ను పోస్టు చేశాడు. తాను ప‌దేళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నాన‌ని, ఎంతో శ్ర‌మిస్తే ఈ స్థాయికి చేరానని అత‌ను ఆ మెసేజ్‌లో పేర్కొన్నాడు. 15 ఏళ్ల వ‌య‌సు నుంచి విదేశాలకు వెళ్తున్నానని, ఎక్క‌డికెళ్లినా త‌న శ‌రీర‌ రంగును వింత‌గా చూడ‌టం త‌న‌కు ఇప్ప‌టికీ మిస్ట‌రీగానే ఉంద‌ని ముకుంద్ అన్నాడు.

Abhinav Mukund slams people's obsession with skin colour, tweets fair isn't the only handsome

ఎండ‌లో రోజులు, నెల‌లు త‌ర‌బ‌డి ప్రాక్టీస్ చేస్తూ, ఆడుతూ గ‌డిపినా.. తాను న‌ల్ల‌బ‌డుతున్నాన‌న్న చింత త‌న‌కు లేద‌ని, దేశానికి ఆడ‌టం క‌న్నా కావాల్సిందేముంద‌ని అందులో అభినవ్ ముకుంద్ అభిప్రాయపడ్డాడు. ఎవ‌రి శ‌రీర రంగును వాళ్లు ప్రేమించండి అంటూ త‌న సందేశాన్ని ముగించాడు.

అభినవ్ ముకుంద్ పోస్ట్ చేసిన మేసేజ్ ఇక్కడ చదవండి

అయితే అతడు చేసిన ఈ పోస్టు ట్విట్టర్‌లో కొద్దిసేపటికి వైరల్‌లా మారింది. 24 గంట‌ల్లోపే వేల కొద్దీ లైక్స్‌, వెయ్యికి పైగా రీట్వీట్స్ చేశారు. అభిన‌వ్ ముకుంద్‌కు మ‌ద్ద‌తుగా ఎన్నో ట్వీట్స్ వ‌చ్చాయి.

అయితే గురువారం ఉద‌యం మ‌రోసారి ఇదే ట్వీట్‌పై అభిన‌వ్ ముకుంద్ ట్వీట్ చేశాడు. తాను చేసిన ఈ ట్వీట్ భారత జట్టు స‌భ్యుల‌ను ఉద్దేశించి కాద‌ని అత‌ను స్ప‌ష్టం చేశాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

Read in English: Abhinav Mukund slams racism
English summary
India cricketer Abhinav Mukund slammed the evil of racism prevalent in the society which is only growing in the era of social media. Mukund, who is a member of India's Test squad currently playing in Sri Lanka, has raised the issue which is deeply rooted in the psyche of most the Indians that fair complexioned people are better than dark coloured men.
Please Wait while comments are loading...