వన్డేల్లో రషీద్‌ఖాన్ సంచలనం: విలవిలల్లాడిన వెస్టిండిస్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్‌ఖాన్ సంచలనం సృష్టించాడు. రషీద్‌ఖాన్ దెబ్బకు ఒకప్పటి ప్రపంచ చాంపియన్‌ వెస్టిండిస్ విలవిల్లాడింది. వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో ఏడు వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేశాడు. శనివారం జరిగిన తొలి వన్డేలో ఆప్ఘనిస్థాన్... వెస్టిండిస్‌పై 63 పరుగుల తేడాతో విజయం సాధించింది.

దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. ఆప్ఘనిస్థాన్ నిర్దేశించిన 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండిస్ రషీద్(7/18) ధాటికి 44.4 ఓవర్లలో 149 పరుగులకు కుప్పకూలింది. ఒకానొక దశలో 3 వికెట్లకు 63 పరుగులతో సాఫీగా సాగుతున్న వెస్టిండిస్ జట్టుని రషీద్ తన బౌలింగ్‌తో పూర్తిగా కట్టడి చేశాడు.

Afghanistan's Rashid Khan demolishes West Indies with 7-wicket haul

వెస్టిండిస్ బ్యాట్స్‌మెన్లలో షాయి హోప్(35)టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకముందు ఆఫ్ఘానిస్థాన్‌ 50 ఓవర్లలో 6 వికెట్లకు 212 పరుగులు చేసింది. తొలుత ఓపెనర్ జావెద్ అహ్మదీ(81) అర్ధ సెంచరీతో రాణించగా, గులాబ్ నయిబ్(41నాటౌట్) అజేయంగా నిలిచాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రషీద్‌ ఖాన్‌ 8.4 ఓవర్లు వేయగా అందులో ఒక మెయిడిన్‌ కూడా ఉంది. కేవలం 18 పరుగులిచ్చి ఏకంగా 7 వికెట్లు తీశాడు. వన్డేల్లో ఇది నాలుగో అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం.

వన్డేల్లో టాప్ 5 అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు:

చమిందా వాస్ (శ్రీలంక) - 8/19 Vs జింబాబ్వే - 2001
షాహిద్ అప్రిది (పాకిస్థాన్) - 7/12 Vs వెస్టిండిస్ - 2013
గ్లెన్ మెక్ గ్రాత్ (ఆస్ట్రేలియా) - 7/15 Vs నమీబియా - 2003
రషీద్ ఖాన్ (ఆప్ఘనిస్థాన్) - 7/18 Vs వెస్టిండిస్ - 2017
ఆండీ బైచెల్ (ఆస్ట్రేలియా) - 7/20 Vs ఇంగ్లాండ్ - 2003

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Afghanistan's young legspinner Rashid Khan demolished West Indies batting with a career-best 7/18 in the first One Day International here yesterday (June 9).
Please Wait while comments are loading...