హైదరాబాద్: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ టెక్నిక్‌పై విమర్శలు చేసిన ఇంగ్లాండ్ పేస్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్పై మాజీ క్రికెటర్లు పలువురు మండిపడ్డారు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్, పాకిస్థాన్ మాజీ కెప్టెన్, పాక్ క్రికెట్ బోర్డ్ చీఫ్ సెలక్టర్ ఇంజిమామ్ ఉల్ హక్ అందులో ఉన్నారు.
కోహ్లీ టెక్నిక్‌ను తప్పు బట్టేంత స్థాయి ఆండర్సన్‌కు లేదని పాక్ క్రికెట్ బోర్డ్ చీఫ్ సెలక్టర్ ఇంజిమామ్ ఉల్ హక్ వ్యాఖ్యానించాడు. కోహ్లీ బ్యాటింగ్‌ను విమర్శించే ముందు భారత్‌లో వికెట్లు ఎలా తీయాలో తెలుసుకుంటే మంచిదని ఇంజమామ్ సూచించాడు. అంతేకాదు ఆండర్సన్ వ్యాఖ్యలు తనను ఆశ్చర్యానికి గురి చేశాయన్నాడు.
'కోహ్లీ బ్యాటింగ్ టెక్నిక్‌ను విమర్శిస్తూ అండర్సన్ చేసిన వ్యాఖ్యలు నన్ను ఆశ్చర్యానికి గురి చేశాయి. కోహ్లీను ప్రశ్నించే ముందు నువ్వు భారత్‌లో వికెట్లు తీసే పాఠాలు నేర్చుకుంటే మంచిది. ఇప్పటివరకూ అండర్సన్ భారత్ లో వికెట్లు తీయడం నేనైతే ఎప్పుడూ చూడలేదు. ఒక బ్యాట్స్‌మన్ టెక్నిక్‌ను ప్రశ్నించే స్థాయిలో నీవు ఉన్నావా అనేది తెలుసుకుని ఆ తరువాత మాట్లాడు' అని జియో స్పోర్ట్స్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో అన్నాడు.
'నా బౌలింగ్‌ను ఇంగ్లండ్‌లో కోహ్లీ ఎదుర్కోలేకపోయాడన్నావు. ఇంగ్లాండ్‌లో ఆడితేనే నాణ్యమైన బ్యాట్స్‌మన్ అని సర్టిఫికెట్ ఇస్తారా? ఉప ఖండం పిచ్‌ల్లో ఆడేటప్పుడు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఇబ్బందుల్లో పడకపోతేనే మంచిది. ఇది కేవలం అనుచిత వ్యాఖ్యలు చేసే విదేశీ ఆటగాళ్లకు నేనిచ్చే సూచన మాత్రమే. ఒక ఆటగాడు ఎక్కడ పరుగులు చేసినా వాటిని పరుగుల గానీ పరిగణిస్తారని విషయం బోధ పడితే మంచిది' అని ఇంజమామ్ ఘాటుగా వ్యాఖ్యానించాడు.
ఆండర్సన్‌ను 'దిమ్మె'తో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్ పోల్చాడు. 'కోహ్లి ఆటలో మార్పు వచ్చిందని అనుకోవట్లేదు. అతడి బ్యాటింగ్‌లో లోపాలు ఇక్కడి పిచ్‌లపై కనిపించడం లేదంతే. పిచ్‌ల్లో వేగం, స్వింగ్ లేకపోవడం వల్లే ఇంగ్లాండ్‌లో మాదిరిగా అతడిని ఔట్ చేయలేపోయాం' అని నాలుగో టెస్టు నాలుగో రోజు మీడియాతో ఆండర్సన్ అన్న సంగతి తెలిసిందే.
ఆండర్సన్ కేవలం తాను ఇంగ్లాండ్ కండిషన్స్‌లో మాత్రమే బౌలింగ్ వేస్తానని చెప్తున్నాడా? అంటూ దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ చమత్కరించాడు. టెస్టు సిరిస్ ఓటమి అసహనంతోనే కోహ్లీపై ఆండర్సన్ పైవిధంగా వ్యాఖ్యానించాడంటూ బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
Is #jimmyanderson saying he can only bowl in English conditions? #kohli #IndvsEng
— Graeme Smith (@GraemeSmith49) December 12, 2016