ఛాంపియన్స్ ట్రోఫీ: ఈబేలో అమ్మకానికి పాకిస్థాన్ క్రికెటర్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా తొలి సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌-పాకిస్థాన్‌ తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ‌టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఇంగ్లాండ్‌ను బ్యాటింగ్ ‌ఆహ్వానించాడు. ఇదిలా ఉంటే మ్యాచ్ ప్రారంభానికి ముందు ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్  | ఫోటోలు  | స్కోరు కార్డు 

టోర్నీలో భాగంగా భారత్‌-పాకిస్థాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో గాయపడిన టోర్నీకే దూరమైన వహాబ్‌ రియాజ్‌‌ని ఈబేలో అమ్మకానికి పెట్టాడు. టోర్నీలో రియాజ్‌ పేలవ ప్రదర్శన కనబర్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆగ్రహానికి గురైన ఓ పాక్ అభిమాని ఇలా వింతగా తన నిరసనను తెలియజేశాడు.

Ahead of Pakistan's Champions Trophy semi-final, 'used' Wahab Riaz on sale

కాగా, ఈబేలో రియాజ్‌ ధరను 610 ఆస్ట్రేలియా డాలర్లగా నిర్ణయించగా... ఇప్పటికే ఇతగాడి కోసం 54 మంది బిడ్లు దాఖలు చేశారు. 2017, జూన్‌ 19తో వేలం ముగుస్తోందని సదరు అభిమాని పేర్కొనడం విశేషం. వేలానికి అందుబాటులో ఉంచిన రియాజ్‌ గురించి సదరు అభిమాని వివరణ కూడా ఇచ్చాడు.

'వహాబ్‌ రియాజ్‌.. అతడి అవసరం నాకు ఎప్పటికీ లేదు. ఐటమ్‌ కండీషన్‌: ఉపయోగంలో ఉన్నది' అని పేర్కొన్నాడు. టోర్నీలో భాగంగా భారత్‌-పాక్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో రియాజ్‌ 8.4 ఓవర్లు వేసి 87పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్‌ కూడా తీయలేదు. గాయంతో మ్యాచ్ చివర్లో మైదానం నుంచి నిష్క్రమించినం సంగతి తెలిసిందే.

Ahead of Pakistan's Champions Trophy semi-final, 'used' Wahab Riaz on sale

మ్యాచ్ అనంతరం గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మొత్తం టోర్నీకే దూరమయ్యాడు. ఆ తర్వాత రియాజ్‌ ఆ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
As Pakistan prepare to face hosts England in the 1st semi-final of ICC Champions Trophy 2017 today (June 14), an upset fan has put paceman Wahab Riaz on sale on the website ebay.
Please Wait while comments are loading...