అర్జున‌ అవార్డుకు బొపన్న పేరు ప్ర‌తిపాదించిన ఏఐటీఏ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఫ్రెంచ్ ఓపెన్‌లో అద్భుతం చేసిన భారత టెన్నిస్ ఆటగాడు రోహ‌న్ బొపన్న పేరును ఈ ఏడాది అర్జున అవార్డుకు సిఫారు చేస్తున్న‌ట్లు అఖిల భార‌త టెన్నిస్ స‌మాఖ్య పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి భార‌త టెన్నిస్ స‌మాఖ్య లేఖ రాయనుంది.

ఫ్రెంచ్ ఓపెన్: మిక్స్‌డ్ డ‌బుల్స్ టైటిల్ గెలిచిన బోప‌న్న జోడీ

గతంలో పలుమార్లు బోపన్న పేరుని అర్జున అవార్డుకి ప్రతిపాదించినప్పటికీ, పాత కమిటీలు అతన్ని గుర్తించలేదని ఈ సందర్భంగా సమాఖ్య పేర్కొంది. కానీ ఇప్పుడు బోపన్న అర్జున అవార్డుకి అర్హుడని, ఈసారి అతడికి ఈ అవార్డు తప్పకుండా ఇవ్వాలని భార‌త టెన్నిస్ సంఘం జనరల్ సెక్రటరీ ఛ‌ట‌ర్జీ అన్నారు.

 AITA to recommend Rohan Bopanna's name for Arjuna award

బోపన్నతో పాటు రుష్మి చక్రవర్తి పేరుని కూడా అర్జున అవార్డుకు ప్రతిపాదించామని ఆయన తెలిపారు. అప్లికేషన్స్ పంపడానికి డెడ్ లైన్ ముగిసినప్పటికీ, ఈరోజే అప్లికేషన్ పంపేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. లియాండ‌ర్ పేస్‌, మ‌హేష్ భూప‌తి, సానియా మీర్జా త‌ర్వాత గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన నాలుగో భారత టెన్నిస్ ఆటగాడిగా బోప‌న్న నిలిచాడు.

గురువారం జ‌రిగిన మిక్స్‌డ్ డ‌బుల్స్ ఫైన‌ల్లో బొపన్న జోడీ విజ‌యం సాధించిన సంగతి తెలిసిందే. ఏడో సీడ్ రోహ‌న్ బోప‌న్న‌ కెనడాకు చెందిన పాట్నర్ గాబ్రియేలా దాబ్రోవ్‌స్కీల జోడీ ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను గెలిచారు. ఫైన‌ల్లో అన్‌సీడెడ్ జోడీ ఫ‌రా, గ్రోన్‌ఫెల్డ్‌పై 2-6, 6-2, 12-10 తేడాతో బోపన్న జోడీ విజయం సాధించి ట్రోఫీ అందుకున్నారు.

రోహ‌న్ బోప‌న్న‌కు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావ‌డం విశేషం. దాదాపు ఏడేళ్ల త‌ర్వాత అత‌ను ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ఫైన‌ల్‌కు చేరాడు. 2010లోనూ బోప‌న్న యూఎస్ ఓపెన్ పురుషుల డ‌బుల్స్ ఫైన‌ల్ చేరినప్పటికీ, టైటిల్ సాధించడంలో విఫలమయ్యాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Acknowledging the Grand Slam feat of Rohan Bopanna, the All India Tennis Association (AITA) has decided to send his name to the government for this year's Arjuna award.
Please Wait while comments are loading...